Home / Inspiring Stories / నోటు నకిలీదో..? కాదో..? ఈ తొమ్మిది గుర్తులతో చెప్పేయొచ్చు..!

నోటు నకిలీదో..? కాదో..? ఈ తొమ్మిది గుర్తులతో చెప్పేయొచ్చు..!

Author:

నకిలీ నోట్ల చలామణి రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్మార్గపు ఆలోచనతో నకిలీ నోట్ల దందాలోకి దిగుతున్నారు చాలా మంది,ఏటియం నుండి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేస్తుంటాం, ఏటియం లలో డబ్బులు వేసేది బ్యాంకు వాళ్ళే కదా నకిలీ నోట్లు ఉండవు అనుకుంటే మీ జేబుకి చిల్లు పడ్డట్లే, ఈ మధ్య ఏటియంల నుండి కూడ నకిలీ నోట్లు వస్తున్నాయి, ఏటియం నుండి నోట్లు రాగానే తీసి జేబులో పెట్టుకునే కంటే ముందు అవి అసలువా..? లేదా నకిలీ నోట్ల అని ఖచ్చితంగా సారి చూసుకోవాలి, ఒక్కసారి ఏటియం దాటితే ఆ నోట్లతో బ్యాంకు వాళ్ళకి సంబంధం ఉండదు, అందుకే ఏటీయంలోనే సరిచూసుకోవాలి.

నకిలీ నోట్ల చలామణి ఎక్కువ అవ్వడంతో రిజర్వ్ బ్యాంకు వారు నకిలీ నోట్ల సులభంగా ఎలా గుర్తుపట్టాలో చెప్పారు, నకిలీ నోట్లని గుర్తుపట్టడానికి వారు ఇచ్చిన 9 సూచనలు మీ కోసం..!

1. వాటర్ మార్క్:

How-To-Identify-Fake-Note
ప్రతి నోటు పై మహాత్మ గాంధీ గారి వాటర్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది, మాములుగా కనబడదు ఏదైనా లైట్ కి ఎదురుగా పెడితేనే కనిపిస్తుంది.

2. సెక్యూరిటీ థ్రెడ్:

How-To-Identify-Fake-Note
ప్రతి నోటు పై మహాత్మ గాంధీ ఫోటోకి ఎడమ వైపున ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది దానిపై కొంచెం కొంచెం కనపడే విధంగా భారత్ ఆర్.బి.ఐ అని రాసి ఉంటుంది, ఈ సెక్యూరిటీ థ్రెడ్ వెనుక వైపు కనబడదు, 1000, 500, 100 విలువ చేసే నోట్ల పై పెద్దగా 50,20,10 రూపాయల నోట్ల పై చిన్నగా ఉంటుంది.

3.కనబడకుండా ఉండే నంబర్:

How-To-Identify-Fake-Note
మహాత్మ గాంధీ ఫోటోకి వెనుక వైపుగా ఉండే ప్రాంతంలో నిలువుగా ఒక పట్టి ఉంటుంది, ఆ పట్టీలో నోటు విలువని చూపించే నంబర్ కనబడకుండా దాగి ఉంటుంది, నోటుని అడ్డంగా పెట్టి తదేకంగా చూస్తేనే కనిపిస్తుంది.

4. మైక్రో అక్షరాలు:

How-To-Identify-Fake-Note
మహాత్మ గాంధీకి, నిలువుగా ఉండే పట్టికి మధ్యలో RBI అని చాలా చిన్నగా రాసి ఉంటుంది, చాలా దగ్గరగా పట్టుకొని చూస్తేనే కనిపిస్తుంది.

5. ముఖ్యమైన గుర్తులు:

How-To-Identify-Fake-Note
నోటు పై ఉండే మహాత్మ గాంధీ గారి ఫోటో, నాలుగు సింహాల గుర్తు, అశోక స్తంభం, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకంల పై మన వేళ్ళని పెడితే వాటిలో ఉండే ప్రింటింగ్ తేడాలని మనం గమనించవచ్చు.

6. గుర్తింపు చిహ్నం:

How-To-Identify-Fake-Note
ఒక్క 10 రూపాయల నోటు పై కాకుండా మిగతా అన్ని నోట్ల పై ఈ గుర్తింపు చిహ్నం ఉంటుంది, కళ్ళు కనబడని వారు దీనిని చేతితో తాకి నోటుని గుర్తు పట్టవచ్చు, (Rs. 20-Vertical Rectangle, Rs.50-Square, Rs.100-Triangle, Rs.500-Circle, Rs.1000-Diamond).

7. నోటు సిరీస్ నంబర్:

How-To-Identify-Fake-Note
పార్థి నోటు పై ఉండే నంబర్ ని ఫ్లోరోసెంట్ ఇంక్ తో రాస్తారు, అల్ట్రా వయొలెంట్ లైట్ దగ్గర పెట్టినప్పుడు కూడ ఈ నంబర్ ని చూడవచ్చు.

8. నోటు మధ్యలో ఉండే నంబర్:

How-To-Identify-Fake-Note
నోటు మధ్యలో ఉండే నంబర్ నోటుని మాములుగా చూస్తే ఆకుపచ్చ రంగులో, వేరే కోణంలో చూస్తే నీలి రంగులో కనిపిస్తుంది,ఇది కేవలం 1000, 500 విలువ చేసే నోట్లలో మాత్రమే ఉంటుంది.

9. పువ్వు లాంటి ఆకారం:

How-To-Identify-Fake-Note
ప్రతి నోటు పై పూర్తి ఎడమ వైపు వాటర్ మార్క్ కి పక్కన ఆ నోటు విలువ తెలిపే విధంగా ఒక పువ్వు లాంటి ఆకారం ఉంటుంది, నోటు కి వెనుక వైపు కూడ అదే ప్రాంతంలో ఉంటుంది.

ఈ తొమ్మిది గుర్తులతో ఏ ఒక్కటి లేకపోయినా అది నకిలీ నోటు అన్నట్లే, ఈ విషయాన్ని అందిరికి షేర్ చేయండి.

Must Read: ఏటియం నుండి నకిలీ నోట్లు వస్తే ఏం చెయ్యాలి..?

(Visited 12,767 times, 57 visits today)