బస్సు, కారు ఎక్కగానే వాంతులవుతాయా..? ఇలా చేయండి.

Author:

కొందరికి బస్సు ఎక్కాలంటేనే భయం.. ఎందుకంటే బస్సు ప్రయాణం పడదు. బస్సు ఎక్కగానే వాంతి వస్తున్న ఫీలింగ్.. కడుపులో తిప్పినట్టు అనిపించి, ప్రయాణమంతా విసుగు వికారాలతో చేయాల్సి వస్తుంది. అందుకే బస్సెక్కాలంటే వామ్మో నేను రాను అనేస్తారు. అయితే అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ వాంతి సమస్యని సమర్ధంగా ఎదుర్కోవచ్చు అంటున్నారు వైద్యులు.

stop vomitings in travelling

ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన వేసుకుంటే వాంతి రాదట. బస్సు ఎక్కగానే వక్కపొడిని చప్పరిస్తూ కళ్ళు మూసుకున్నా.. వాంతుల నుంచి బయట పడవచ్చు. అయితే, అల్లం ముక్కే చాల బెటర్ అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే.. అల్లంలో ఉండే కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి మనకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అందువల్ల, వాంతి రాకపోవడమే కాదు, అనేకరకాలుగా ఆరోగ్య ప్రదాయిని కూడా అయిన అల్లమే బెటర్ అంటున్నారు. నిజానికి ఈ వాంతి సమస్య ఎక్కువగా సైకలాజికల్ ఫీలింగే. కాబట్టి, వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు లేదా బస్సు గానీ ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని ప్రకృతి, పరిసరాలను ఆస్వాదించడం వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు.

ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు, బస్సు మలుపులు, కుదుపుల వల్ల కూడా ఈ వాంతి సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాంటప్పుడు నిమ్మ వైద్యంతో కూడా వాంతిని అరికట్టవచ్చు. నిమ్మకాయను నలుపుతూ, ఆ నిమ్మ వాసనని ముక్కుతో పీలిస్తే కూడా వాంతుల సమస్యను దూరం చేస్కోవచ్చు. లేదంటే లవంగాలు, సోంపు వంటివి దవడ కింద పెట్టుకుని చప్పరించినా, నములుతూ ఉన్నా కూడా వాంతులు రావు. దీని ప్రకారం, ఇకముందు బస్ జర్నీ చేసేముందు మీకు అందుబాటులో ఉన్న ఈ చిట్కా వైద్యం పాటించి వాంతులను దూరం చేస్కొండి. మీ ప్రయాణాన్ని సుఖమయం చేయండి.

(Visited 2,469 times, 534 visits today)

Comments

comments