EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Inspiring Stories / Video: బోరుబావిలో పడ్డ పిల్లల్ని ఇలా కాపాడొచ్చు..!

Video: బోరుబావిలో పడ్డ పిల్లల్ని ఇలా కాపాడొచ్చు..!

Author:

పిల్లల్ని మింగేస్తున్న బోరు బావులనుంచి రక్షించుకునేందుకు ఓ యువకుడు ఒక పరిష్కారం కనుగొన్నాడు. ఎన్ని సార్లు ఇలాంటి ప్రమాదాలు సంభవించినా, ఎంత మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా, తల్లిదండ్రులు బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చినా, బోరు వేసాకా మూత పెట్టడం మాత్రం చెయ్యట్లేదు. నీరు పాడనీ వాటిని పూడ్చే ప్రయత్నమూ చెయ్యట్లేదు. దాంతో పాపం అభం శుభం తెలియని చిన్నారులు నోర్లు తెరుచుకుని ఉన్న బోరు బావిల్లో పడాల్సి వస్తోంది. నిన్నటికి నిన్న ఓక చిన్నారి పాప మన కళ్ళముందే ప్రాణాలు వదిలింది. ప్రభుత్వాలు కూడా తెరిచి ఉన్న బోర్ల ఓనర్లపై గట్టి చర్యలు తీస్కోకపోతే ఇలా పిల్లలు భూస్థాపితం అవుతూనే ఉంటారు. నిజానికి వేల కొద్ది ఖర్చు పెట్టి బోరు వేసిన వాళ్ళు ఒక వంద రూపాయలతో మూత పెతదానికి ఎందుకు నిర్లక్షం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ చిన్నపాటి నిర్లక్షమే చిన్నారుల నిండు ప్రాణాలు బాలి తీసుకుoటున్నాయని గమనించాలి.

ఈ బోరు బావి సమస్యలకు తెలంగాణాకు చెందిన పెద్దపల్లి సత్య ప్రసాద్ అనే ఉవకుడు ఒక మంచి పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఎవరైనా చిన్నారి బోరుబావిలో పడిపోతే, చిన్నారి ఎంత లోతులో ఉన్నాడో ఒక కెమెరా ద్వారా చూస్తూ, చిన్నారికి తగలకుండా ఒక సన్నని కేబుల్ పైపు లాంటిది బావిలోకి పంపాలి. దానిలో ఒక రాడ్, బెలూన్ ఉంటాయి. చిన్నారి కిందకు పైపు వెళ్ళాక, ఆ రాడ్ ని తొలగించి పైనుంచి గాలి పంపి పైపు కిందన ఉన్న బెలూన్ గాలి నింపాలి. బెలూన్ లో ఎంత గాలి నింపాలి అనేది బోరు బావి సైజుని బట్టి డిసైడవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెల్లిగా పైపుని పైకి లాగడం వల్ల చిన్నారిని బెలూన్ తో సహా పైకి తీయవచ్చు. బెలూన్ సపోర్ట్ వల్ల చిన్నారి కిందకు జారిపోయే ప్రమాదం కూడా ఉండదు. కాకపొతే ప్రమాదం జరిగిన రెండు మూడు గంటల్లోపు అయితేనే ఈ పరికరం ఉపయోగపడుతుంది.

చిన్నారులని కాపాడే ఈ చిన్ని పరికరం, దాని పనితీరు చూడాలంటె ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి వీడియోని చూడండి. పదిమందికి పనికొచ్చే ఇలాంటి పరిశోధనలను అభినందించాల్సిందే.. హాట్స్ ఆఫ్ టు సత్య ప్రసాద్. నీకున్న సదాలోచన అందరికీ ఉంటె అసలు ఇలాంటి ప్రమాదాలే జరగవు.

(Visited 1,773 times, 44 visits today)