EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / General / Video: ఇంట్లోకి ప్రవేశించిన కింగ్ కోబ్రా.

Video: ఇంట్లోకి ప్రవేశించిన కింగ్ కోబ్రా.

Author:

కింగ్‌ కోబ్రా.. ఈ పాము పేరు వింటే మిగతా పాములు, విష సర్పాలకే హడల్. అలాంటిది.. మామూలు మనుషులెంత భయపడతారో ఊహించుకోండి. మనకు మామూలుగా పాములు ఎక్కడో అక్కడ కనపడుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికే వామ్మో.. నేను పాముని చూశాను అని పేద్ద విడ్డూరంగా చెప్పుకుంటాం. మరి, అలాంటిది అత్యంత ప్రమాదకరమైన విష సర్పం కింగ్‌ కోబ్రా కనబడితే గజగజా వనికిపోవాల్సిందే.. ఏ దట్టమైన అడవుల్లోనో ఉండే ఈ కింగ్‌ కోబ్రా సాధారణంగా మనుషులకి సమీపంలో కనపడదు. సింపుల్ గా చెప్పాలంటే, కింగ్‌ కోబ్రా గురించి వినడమే తప్ప చూడటం అనేది చాలా అరుదు. అత్యంత విషపూరితమైన ఈ భారీ సర్పాన్ని చూస్తేనే భయమేస్తుంది. సాధారణ పాములతో పోలిస్తే వీటి ఆకారం, కదలికలు, విషం ప్రభావం అన్నిట్లోనూ కింగ్‌ కోబ్రా లక్షణాలు భారీగా, భయంకరంగా ఉంటాయి. మరి అలాంటి భయానక కింగ్‌ కోబ్రా మనకు ఎదురుపడితే ఇంకేమయినా ఉందా?.. వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే వార్త ఇటీవల మలేసియాలోని ఓ కుటుంబానికి ఎదురైంది.

జూన్‌ 18న.. సడన్ గా ఓ ఇంటి పరిసరాల్లోకి వచ్చిన కింగ్‌ కోబ్రా, ఇంటి లోపలికి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే ఇంటి కిటికీ మూసి ఉండటంతో పాము లోపలికి వెళ్లలేకపోయింది. కానీ, అది మామూలు పాము కాదు కదా… దాని పేరే కింగ్‌ కోబ్రా.. అంత సులువుగా వదులలేదు. అటూ ఇటూ చూసింది. కిటికీ పైకి పాకుతూ వెళ్లి ఇంటి వెంటిలేటర్‌ గుండా ఇంట్లోకి దూరింది. ఈ కింగ్‌ కోబ్రా ఎంటర్ ద హోం ని ఆ ఇంటి యజమాని డెరిక్‌ ఇఫాన్‌ తన ఫోన్ తో వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు. ఫేస్బుక్ లో ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. జస్ట్ రెండు రోజుల్లోనే 42వేల మంది కింగ్ కోబ్రా వీడియోను షేర్‌ చేయగా, దాదాపు 40 లక్షల వ్యూస్‌ లభించాయి.

అయితే కోబ్రా ఇంట్లోకి ప్రవేశించాక ఏం జరిగింది? ఇంతకీ, ఆ పాముని బయటకు ఎలా పంపించారనే విషయాలు వీడియోలో లేకపోయినా.. వీడియోలోని కోబ్రా ని చూస్తే మాత్రం ఒళ్లు జలదరించక మానదు. మీరూ.. ఆ వీడియోని చూడాలంటే క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

Comments

comments