EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / వామ్మో… ఈ మేక గారి భోజనం ఖరీదు 60వేల రూపాయలు.

వామ్మో… ఈ మేక గారి భోజనం ఖరీదు 60వేల రూపాయలు.

Author:

మేక భోజనానికి 60 వేల రూపాయల ఖర్చేంటి అనుకుంటున్నారా..? సాధారణంగా మేకలకి ఆకలేస్తే ఆకులో అలములో, కాయలో లేదా మరీ.. ఆకలేస్తే పేపర్లో తింటాయి. కానీ, ఈ కాన్పూర్ మేక ఏంటండీ బాబూ  ఏకంగా 60వేల రూపాయల నోట్లు తిన్నదంట. మరేం చేస్తుంది లెండి.. పాపం ఆకలి కి అలమటించిన ఆ మేక గారు యజమాని జేబులో పెట్టుకున్న నోట్లని సాధారణ పేపర్లే అనుకుందేమో పాపం, అందుకే కనబడగానే ఆకలికి తట్టుకోలేక వాటిని తినేసింది. అయినా మనకు డబ్బులంటే లెక్క కానీ మేకకేం లెక్క. దానికి పెద్ద నోటయినా చిన్న నోటయినా చిత్తూ కాగితంతో సమానం కదా… అందుకే మొత్తం ముప్పై 2వేల రూపాయల నోట్లని కరకరా నమిలేసింది.

Hungry Goat Eats Owners Currency Notes Worth Rs 62000

కాన్పూర్ కి చెందిన సర్వేశ్ అనే భవన నిర్మాణ వ్యాపారి ఇటుకలు కొనేందుకని తెచ్చుకున్న 60 వేల  రూపాయలని  తన చొక్కా జేబులో పెట్టి స్నానానికి వెళ్ళాడంట. వచ్చేసరికి ఆ మేక ఆ నోట్లను ఆకులు నమిలినట్టు నములుతోందంట. వింటుంటే మనకే ప్రాణం ఉసూరు మంటుంటే ఆ యజమానికి మాత్రం ఏ మాత్రం కోపం రాలేదంట. పైగా ఆ మేక నా ప్రాణం అని బదులిచ్చాడట. అయ్యో  ఇలా జరిగిందట కదా అని అడిగిన ఇరుగుపొరుగు వాళ్ళతో కూడా తిన్నది నా మేకే కదా మీకేం ప్రాబ్లం అంటున్నాడట.  అద్భుతం కదా.. ఏదయినా ఇలాంటి వింత సంఘటన జరగ్గానే ఊడిపడే జనాలకి, ఇప్పుడు ఈ మేక గారు  పెద్ద హాట్ టాపిక్ అయిందట. వచ్చేపోయే వాళ్లు ఈ మేక గారితో ఒక సేల్ఫీ దిగకుండా కదలట్లేదట. దాంతో మేక గారికి కూడా సేల్ఫీలు బాగా అలవాటయిపోయాయి.  సెల్ఫీలకు పోజు ఇచ్చేస్తూ ఈ  మేక  సెలబ్రిటీ  అయిపోయిందండి.

Comments

comments