Home / Latest Alajadi / భార్య విడాకులకు ఒప్పుకోవట్లేదని…ఆ భర్త ఏం చేసాడో తెలుసా.? అలంటి నీచుడిని ఏం చేయాలి?

భార్య విడాకులకు ఒప్పుకోవట్లేదని…ఆ భర్త ఏం చేసాడో తెలుసా.? అలంటి నీచుడిని ఏం చేయాలి?

Author:

దంప‌తులెవరైనా క‌ల‌కాలం క‌ల‌సి మెల‌సి కాపురం చేయాల‌ని, ఎలాంటి క‌ల‌హాలు రాకుండా సంసార జీవితం స‌జావుగా సాగాల‌నే కోరుకుంటారు. కానీ ఎవ‌రూ విడిపోవాల‌ని అనుకోరు. అయితే నేటి త‌రుణంలో చాలా మంది క‌పుల్స్ మాత్రం అనేక కార‌ణాల వ‌ల్ల విడిపోతున్నారు. చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే గొడ‌వ‌లు పడి అవి పెద్ద‌గై విడాకులు తీసుకునే వ‌ర‌కు వ‌స్తున్నాయి. దీంతోపాటు చాలా మంది దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త కూడా ఉండడం లేదు. తాజాగా గుజరాత్‌ కు చెందిన ఒక యువతి నుండి ఆస్ట్రేలియాలో ఉంటున్న ఇండియన్‌ మొగుడు విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఆమె విడాకులకు అంగీకరించకపోవడంతో అతను ఎలాంటి పని చేసాడో తెలుసా.?

source

వివరాల్లోకి వెళ్తే 2015 లో గుజరాత్‌కు చెందిన యువతికి, ఆస్ట్రేలియాలో ఉండే ఒక యువకుడితో పెళ్లి జరిగింది. కొత్తల్లో బాగానే ఉన్నారు…తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఆ యువతి ఎప్పటికైనా భర్తతో సంతోషంగా ఉండే రోజు వస్తుందని కలలు కంటూ ఎదురుచూస్తుంది. కాని అతడు మాత్రం ఇక జీవితంలో కలిసి ఉండటం అసాధ్యం. విడాకులు తీసుకుందాం అంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.

source

విడాకులకు ఆమె ఓకే చెప్పక పోవడంతో కోపంతో రగిలి పోయిన అతడు ఆమెకు కోపం తెప్పించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె అసభ్యంగా ఉన్నప్పటి ఫొటోలను, గతంలో సరదాగా తీసుకున్న అశ్లీల ఫొటోలను భర్త ఫేస్‌బుక్‌ లో షేర్‌ చేశాడు. దెబ్బకు షాక్ అయిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. . ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌ ద్వారా తొలగించిన పోలీసులు ప్రస్తుతం అతడిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

(Visited 1 times, 300 visits today)