Home / Latest Alajadi / ప్రపంచలోనే నెం.1 ఎయిర్ పోర్ట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్…!

ప్రపంచలోనే నెం.1 ఎయిర్ పోర్ట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్…!

Author:

హైదరాబాద్ శివార్లలో నిర్మితమై ఉన్న శంషాబాద్ విమానాశ్రయానికి మరో ప్రఖ్యాత అవార్డు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న విమానాశ్రయాలలో మన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది, గత ఏడాదిలో.. క్వాలిటీ సర్వీస్ అందించిన విమానాశ్రయాలపై.. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఫస్ట్ ప్లేస్ దక్కింది. వచ్చే అక్టోబర్ లో మారిషస్ లో జరగనున్న కార్యక్రమంలో.. విమానాశ్రయ నిర్వాహకులు అవార్డు అందుకోనున్నారు.

rajiv gandhi airport

ఇంతకముందు ఆసియా లోనే ఉత్తమమైన సేవలు అందించిన విమానాశ్రయంగా మన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అవార్డుని సాధించింది, ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండటం మనందరికి గర్వకారణమే, ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించడంతో పాటు , హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ద్వారా బంగారం, డ్రగ్స్ రవాణా జరగకుండా అధికారులు అడ్డుకుంటున్నారు, క్వాలిటీ సర్వీస్ సర్వేలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ రెండో స్థానంలో నిలిచింది.

(Visited 1,101 times, 23 visits today)