Home / Inspiring Stories / చచ్చిన కోళ్ళతో బిర్యానీ,రోగాలతో చనిపోయిన పశువుల మాంసపు వంటకాలు.

చచ్చిన కోళ్ళతో బిర్యానీ,రోగాలతో చనిపోయిన పశువుల మాంసపు వంటకాలు.

Author:

Hyderabad Biryani

ఆకలి తీర్చుకోవటానికి వెళితే అన్నం బదులు విషం వండిపెడుతున్నారు. హోటల్ లో ఆహారం అంటే రోగాలని కొనుక్కు తిన్నట్టే,హొటల్ అనే కాదు మీరు కొనే మాంసం,పాలు కూడా భయంకర రోగాలని ప్రజల లోపలికి చేరవేస్తున్నాయి… ప్రతీ నెలా ఫుడ్‌పాయిజన్‌తో 80 నుంచి 120 వరకూ పేషెంట్స్‌ వస్తుంటారని ప్రముఖ ఆస్పత్రులు పేర్కొంటున్నాయి. వీరిలో 10శాతం బాధితులు వారం పదిరోజుల పాటు చికిత్స పొందుతున్నవారూ ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కల్తీ ఆహార పదార్థాలు, పరిశుభ్రత పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ‘గ్రేటర్‌’ అధికారులు చూసీచూడనట్లు వ్యవ హరించడం ప్రజలకు శాపంగా మారింది. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం హైదరాబాద్ మొత్తం మీదా 160 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి.కానీ ఇప్పుడు ఉన్నది ఎంతమందో తెలుసా?? ఐదుగురు కేవలం ఐదుగురు…

పాలిష్డ్ అని మీరు కొనే ప్రతీ పప్పు మీదా మెరుపు కోసం వాడిన రసాయన పదార్థాలుంటున్నయ్ చిన్న రెస్టారెంట్లలో వాడే పప్పులు గోడౌన్లలో పాడైన వేస్టేజ్ నుంచె తెస్తున్నారు.ఫౌల్ట్రీ ఫారాల్లో చచ్చిన కోళ్ళని తెచ్చి వాటితో బిర్యానీ వండి మనకు వడ్డిస్తున్నారు. కొవ్వునూనెలు, డాల్డా కలిపిన నెయ్యి, పత్తిగింజల నూనెను చాలా హోటళ్లలో ఉపయోగిస్తున్నట్లు సమాచారం.ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనే జరుగుతుందనుకోవటం పొరపాటు. ఏసీ హోటళ్లు.. రెస్టారెంట్లలోనూ కల్తీ పెద్దఎత్తున జరుగుతోంది. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి వేడిచేసి వడ్డించడం, నిల్వ ఉంచిన మాంసంతో చేసిన బిర్యానీలతో, ఇతర వంటకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సరిగ్గా ఉడికించని మాంసం తింటే అందులోని బ్రుసెల్లోసిస్‌ వైరస్‌ మనిషి శరీరంలోకి చేరుతుందని ‘నేషనల్‌ రీసెర్స్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌’ నిర్వహించిన పరిశోధనలో తేలింది.ఈ వైరస్ మనలో ఫ్లూ తో సహా ఎనిమిది రకాల వ్యాదులకి మూల కారణం. మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలపై పరిశోధించి ఇక్కడ 20శాతం పశువుల్లో బ్రుసెల్లోసిస్‌ వైరస్‌ ఉన్నట్లు తేల్చారు. అయితే తక్కువ ధరకు వస్తున్నాయని హోటల్‌ నిర్వాహకులు వాటినికొని మనకు వండి పెడుతున్నారు.

ప్రామాణిక నిబంధనలను హోటళ్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన ప్రమాణాలు పాటించటం తప్పనిసరి. వీటి ప్రకారం.. వండిన పదార్థాలను నిల్వచేయకూడదు. తాగునీటికి ఫిల్టర్‌ తప్పనిసరి. వంటనూనెను ఒక్కసారికి మించి వినియోగించరాదు. మురుగునీటికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. నాణ్యమైన పదార్థాలనే ఉపయోగించాలి.నిబంధనల ప్రకారం.. ఫుడ్‌ పాయిజన్‌ వల్ల వినియోగదారుడు మరణిస్తే హోటల్‌ యజమాని తగు నష్టపరిహారం చెల్లించాలి. ఆ హోటల్‌ను సీజ్‌ చేసి బాధ్యుడికి 6 నెలల జైలుశిక్ష విధించాలి.కానీ ఎక్కడా ఇవేం అమలుకావటం లేదు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టి శాంపిల్స్‌ సేకరించినా రాజకీయ ఒత్తిళ్లతో కేసులనుంచి బయటపడుతున్నారు.అధికారులు కూడా ఫిర్యాదు అందినా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు.

హైదరాబాద్ మొత్తం మీదా 26వేలకు పైగా రెస్టారెంట్లు, హోటళ్లున్నాయి. 5 వేల వరకూ స్వీట్‌షాపులు, బేకరీలు, 1000 తినుబండారాలు తయారుచేసే పరిశ్రమలున్నాయని, వీటిలో చాలా వరకూ కల్తీ పదార్థాలను వినియోగించి తినుబండారాలను తయారు చేస్తున్నాయనీ సాక్షత్తూ ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. సీజ్ చేసినా రీఓపెన్ అయి నడుస్తున్నవి ఎన్నో… హైదారాబాద్ లో మొత్తం 160 ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం . కానీ ఇక్కడ ఉన్నది ఎంతమందో తెలుసా..? ఐదుగురు కేవలం ఐదుగురు మాత్రమే.. కేవలం ఫుడ్ పాయిజనింగ్ కారణంతోనే నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో నేలలో 300-350 కేసులు నమోదవుతున్నాయి… ఇక ఇప్పటికైనా అధికారులూ,ప్రజలూ జాగ్రత్త పడకపోతే…. ఇలా మన ప్రాణాలతో డబ్బు సంపాదించుకునే వ్యాపారం జరుగుతూనే ఉంటుంది.

(Visited 1,034 times, 38 visits today)