EDITION English తెలుగు
రైళ్లలో దోపిడీకి ప్రయత్నించే దొంగలను కాల్చి వేయాలని డిసైడ్ అయ్యింది:రైల్వేశాఖ   ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుపై తల్లిదండ్రుల సంఘం తీవ్ర నిరసనలు   గవర్నర్ ప్రారంభించిన...అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు పరుగులు   రికార్డు స్థాయికి: పెట్రోల్‌ ధర తొలిసారి రూ.90 దాటింది   ఉదయం అలారం మొగిందా ? అయితె దాన్ని ఆపెసి మళ్ళీ పడుకొంటున్నరా ? అయితె ఈ మనసు మనిషి సంఝర్షణ మీ కొసమె   గ్రీవియెన్స్ ఆఫీసర్ని నియమించిన వాట్సాప్-ఇండియా   సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని ఆర్టీసీ ఆదేశాలు   బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం లో రూ.16.60లక్షలు అమ్ముడయ్యాయి   వెంక‌టేష్ త‌న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ .!   భారతదేశం ఇటీవలి కాలంలో పేదరికంపై భారీ విజయాన్నే సాధించింది: ఐరాస

బిచ్చగాళ్ల ఆచూకీ చెప్పండి..రూ. 500 పొందండి.

Author:

హైదరాబాద్ లో ఈ నెల చివరి వారంలో జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకి అమెరికా అధ్యక్షుడి కూతురైన ఇవాంక ట్రంప్ వస్తుండటంతో మన అధికారులు హైదరాబాద్ ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పటికే పునరావాసం పేరిట అనేక మనది బిచ్చగాళ్ళని చంచల్ గూడా, చర్లపల్లి జైళ్ళకి పంపించిన అధికారులు, హైదరాబాద్ లో 2 నెలల పాటు బిచ్చమెత్తడాన్ని నిషేధించారు కూడా, తాజాగా మరో కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు, అడుక్కునే వారు కనిపించగానే జైళ్ల శాఖ కంట్రోల్‌రూంకు సమాచారం ఇచ్చిన వారికి రూ.500 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. డిసెంబరు 25 నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు.

బిచ్చగాళ్ల Beggers in hyderabad

నగరంలో ఉన్న బిచ్చగాళ్ళలో ఇప్పటికే చాలామందిని జైళ్ళకి తరలించిన అధికారులు అక్కడ వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వేలిముద్రలు, ఆధార్‌ నంబర్లు సేకరించారు. వారు మళ్లీ భవిష్యత్తులో ఈ వృత్తిలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. యాచకుల్లో నైపుణ్యాలను గుర్తించి అవసరమైతే వారికి శిక్షణ ఇచ్చి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోలు బంకులు, ఇతర చోట్ల ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు, హైదరాబాద్ లో ఉన్న బిచ్చగాళ్ళని ఈ నెల 30 లోపు పునరావాస కేంద్రాలకి తరలించి, కౌన్సిలింగ్, శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని..ఆ తరువాత అంటే డిసెంబర్ 25 వ తేదీ నుండి ఎవరైనా అడుక్కునే వాళ్ళు రోడ్ మీద కనిపిస్తే కంట్రోల్ రూమ్ కి సమాచారం అందజేయాలని, సమాచారం ఇచ్చినందుకు వారికీ రూ.500 రివార్డు కూడా ఇష్టం అని జైళ్ల శాఖ డీజీ వి.కె సింగ్ తెలిపారు.

(Visited 138 times, 81 visits today)