Home / Inspiring Stories / వలలో పడుతున్న హైదరబాద్ యువత..!?

వలలో పడుతున్న హైదరబాద్ యువత..!?

Author:

Hyderabad Students trying to join in ISIS

ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద కలకలం రేగినా ప్రపంచ దేశాల అనుమానపు చూపులు భారత్ మీదా పడుతున్నాయి. ప్రపంచానికి ఒక తలనొప్పిగా తయారైన ఐసిస్ ఉగ్రవాద సంస్థ లో ఉన్న మిలిటెంట్ల లో భారత దేశం నుంచి వెళ్ళిన వారూ ఉన్నారనే వార్థ వచ్చినప్పుడల్లా… ముంబై, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న ముస్లిం ఏరియాలు ఉలిక్కి పడుతున్నాయి. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిన తమ పిల్లలు తమకు తెలియకుండానే సిరియా యుద్దంలో మరణిన్స్తూండటాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఐఎస్ టెర్రరిస్టుల సానుభూతిపరురాలు నిక్కీజోసఫ్ పట్టుబడినప్పుడు విచారణలో ఆమె చెప్పిన విశయాలు విన్న పోలీసధికారులే ఆశ్చర్య పోయారు. తీవ్రవాదుల కార్యకలాపాలను వీడియో తీసి భారత దేశం లో ఉన్న యువకులని ఐసీస్ లో చేరే విధంగా రెచ్చగొట్టానని నేరాంగీకార వాగ్మూలంలో తెలిపింది. తన ఫేస్ బుక్ ఐడీని 50 వేల మంది ఫాలో అయ్యేవారని, 2010 లో మొయినుద్దీన్ తో కలసి ఫేస్ బుక్ గ్రూప్ క్రియేట్ చేశానని ఒప్పుకుంది. గ్రూప్ వ్యవహారాలు గుర్తించిన ఫేస్ బుక్ దాన్ని డిలీట్ చేయటంతో.. మరో నాలుగు గ్రూపులు మొదలు పెట్టి కీ వర్డ్స్ దొరకకుండా వాటిని నిర్వహించారని చెప్పిందీ నిక్కీ జోసెఫ్ అలియాస్ అఫ్సా జబీన్.

Hyderabad Students trying to join in ISIS

రెండు రోజుల క్రితం ముగ్గురు హైదరాబాద్ యువకులు కనిపించకుండా పోయారు. వారికోసం వెతికిన కుటుంబ సభ్యులు ఆందోళనతో వారు కనిపించటం లేదని ఫిర్యాదు చేసారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ హైదరాబాద్ యువకుల వయసు ఇరవై లోపే. నాగపూర్ నుంచి ఇండిగో విమానంలో వీరు శ్రీనగర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నాగ్ పూర్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. ఈ యువకులు హైదరాబాద్ నుంచి ఒక రోజు క్రితం నాగపూర్ చేరుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు గతంలోనే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ యువకుల ఐసిస్ ప్రయత్నంతో హైదరాబాద్ పోలిసుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇంకా యువకులు ఇలా ఎవరెవరు ప్రయత్నించారు అన్న కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇదివరలోనే ఒకసారి ఆఫ్గాన్ వెళ్ళివచ్చినట్టు తెలుస్తోంది. ఇదివరలో పుణే కు చెందిన ఒక యువతి కూడా ఐసిస్లో చేరేందుకు వెళ్తూండగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ముంబైలో కనిపించకుండా పోయినా యాజ్, మోసిన్, వాజిద్ అనే యువకులు కూడా ఐసిస్ లో చేరిపోయి ఉంటారనే పోలీసులు భావిస్తున్నారు. వారి సోషల్ మీడియా అక్కౌంట్లను పరిశీలించిన అధికారులకు కొంతకాలంగా వారు ఐసిస్ తో టచ్ లో ఉన్నట్టు తెలిసింది.

“సిరియాలో నా సివిల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో భూగర్భ బంకర్లను నిర్మించాను. యువతను ఆకర్షించేందుకు ఐసిస్ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది”. ఇవి మొన్న భారత్ లో పట్టుబడ్డ ఐసీస్ లో చేరిన భారతీయ ఉగ్రవాది ఆరిబ్ చెప్పిన మాటలు. ‘మాది మహారాష్ట్రలోని పాన్వెల్. సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తరువాత మే 2014లో నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఐసిస్‌లో చేరేందుకు ఇరాక్ వెళ్ళిన తాను తన మిత్రులూ ఆత్మాహుతి దాడిలో శిక్షణ పొందామని ఈ యువకుడు వెళ్ళడించాడు.

Hyderabad Students trying to join in ISIS

హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన సల్మాన్ మొహియుద్దీన్ ఇంజినీరింగ్ చేసి నాలుగేళ్ళ క్రితం అమెరికా వెళ్ళాడు. అక్కడే ఎం.ఎస్.పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యువతిని పెళ్ళిచేసుకున్నాడు. అమెరికాలో ఉన్నప్పుడే ఐసీస్ పట్ల ఆకర్షితుడైన సల్మాన్‌కు దుబాయ్‌లోని నిక్కీ జోసెఫ్ తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సిరియా వెళ్ళి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగానే గత అక్టోబరు చివరి వారంలో దుబాయ్ వెళ్ళేందుకు సల్మాన్ అమెరికా నుంచే వీసా కోసం ప్రయత్నించాడు. కాని వీసా మంజూరు కాలేదు. ఎలాగైనా దుబాయ్ వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగా మూడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు. చివరకు గురువారం రాత్రి దుబాయ్ వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అతన్ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…

(Visited 139 times, 15 visits today)