Home / Inspiring Stories / ప్రభుత్వ సహాయం లేకుండా 100 కిలోమీటర్ల రోడ్డుని నిర్మించిన IAS.

ప్రభుత్వ సహాయం లేకుండా 100 కిలోమీటర్ల రోడ్డుని నిర్మించిన IAS.

Author:

IAS

“మీలోని అసహనాన్ని సానుకూల దిశలో నడిపించండి… సమస్యల పట్ల మీకున్న కోపాన్ని ఆ సమస్యని పరిష్కరించటం లో చూపించండి ఇక ఏ సమస్యా మీకు సమస్యగా కాక మీ విజయానికి వచ్చిన అవకాశంగా కనిపిస్తుంది” ఇవేమాటలని నమ్మిన మణిపూర్ లోని తమెంగ్లంగ్ జిల్లా కుచెందిన తౌసెం గ్రామస్తులు నిరూపించారు. వీరందిరినీ నడిపించిన ఒకే ఒక వ్యక్తి ఆ సబ్ డివిజన్ కే చెందిన ఒక యువ ఐఏస్ “ఆర్మ్ స్ట్రాంగ్ పామే “

ఈ చిన్న చిన్న పల్లెల్లో ప్రజల పాలిట ఆర్మ్ స్ట్రాంగ్ పామే ఒక దేవుడయ్యాడు. వారికోసం అతను రోజంతా శ్రమిస్తూనే ఉన్నాడు. మరీ వెనుకబడ్డ ప్రాంతం కావటం తో సరైన రోడ్డు మారగమూ లేదు దాంతో 100 కిలొమీటర్ల పొడవున మారుమూల ప్రదేశాల్లోకి కూడా రోడ్డు వేయిస్తున్నాడు. అయితే ఆ రోడ్డుకోసం అతను ప్రభుత్వం చేసే సహాయం కోసం ఎదురు చూడలేదు. తన పౌర భాధ్యతగానే ఆ రోడ్డు పనిని తలకెత్తుకున్నాడు. అయితే ఇదే రోడ్డు నిర్మాణం కోసం 1982 లోనే కేంద్ర ప్రభుత్వం 101 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అయితే కారణాలు తెలియవు గానీ మళ్ళీ ఆ ప్రజెక్ట్ ఆలోచననే విరమించుకున్నారు. ఇక మళ్ళీ ఆ రోడ్డు నిర్మాణం ఊసుకూడా ఎవరూ ఎత్త లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆర్మ్ స్ట్రాంగ్ పామే అ ప్రజల కలని నెరవేరుస్తున్నాడు.

అంతే కాదు ఇదే ప్రాంతం లో ఒకసారి అంటువ్యాదులు ప్రబలినప్పుడు సరైన రోడ్డులేని కారణం గా ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఆ మారుమూల ప్రదేశానికి మేం వెళ్ళేది లేదంటూ డాక్టర్లు కూడా వైద్యం చేయటానికి రానప్పుడు ఈ ఆర్మ్ స్ట్రాంగ్ ఐఏస్ తన స్నేహితులతో కలిసి అక్కడే ఉండి ఆ రోగులకు సేవలు చేసాడు. తన స్నేహితులైన డాక్టర్లంతా కలిసి అక్కడ ఉన్న 500 మంది రోగులనూ కాపాడారు.

అతను 100 కిలోమీటర్ల పొడవునా రోడ్డు వేయించాలనుకున్నప్పుడు అతని కుటుంబ సభ్యులూ, గ్రామస్తులూ అతనికి అండగా వచ్చారు. ప్రభుత్వం సహాయం లేకుండానే రోడ్డు నిర్మించి చూపించాలనే అతని నిర్ణయాన్ని విన్న అతని కుటుంబసభ్యులే మొదటగా అతనికి డబ్బులందించారు. స్కూల్ మాస్టర్ గా రిటైర్ అయిన అతని తండ్రి తన ఒక నెల పూర్తి పెన్షన్ ని, అతని తమ్ముడూ, అన్నా, వదిన ఇద్దరూ తమ తమ ఒక్కోనెల జీతాన్ని ఆర్మ్ స్ట్రాంగ్ పామే చేతిలో ఉంచారు. ఇక ఆర్మ్ స్ట్రాంగ్ పామే తన అయిదునెలల జీతాన్ని ఆ డబ్బుకు కలిపాడు మొత్తం 9 లక్షలు అయ్యింది. అయితే ఆడబ్బు కేవలం ప్రాజెక్టు మొదలు కావటానికి మాత్రమే సరిపోతుంది… మొత్తం పూర్తవ్వాలంటే కోట్లాది రూపాయలు కావాలి. ఏలా? అన్న ఆలోచనకి సోషల్ మీడియా ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది వెంటనే ఫేస్‌బుక్ లో ఒక పేజ్ క్రియేట్ చేసాడు. దాని ద్వారా నిధులని సమకూర్చటం మొదలుపెట్టాడు. ఈ పేజ్ వల్ల ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన డబ్బు 1.5 లక్షలు మాత్రమే.

రోడ్డు పని చేసే కార్మికులకు భోజనాలూ, పనిలో భాగంగా వాడే యంత్రాలకు ఇంథనం మొదలైనవన్నీ అక్కడి గ్రామస్తులే చూసుకుంటున్నారు. అంతే కాదు స్వచ్చందంగా తామూ వీలుకుదిరినప్పుడలా బృదాలుగా వచ్చి రొడ్డు పనిలో పాలుపంచుకుంటున్నారు. “తమెంగ్లాంగ్-హాఫ్లాంగ్ ఋఓద్ అనే పేరుతో నడిచే ఈ ప్రాజెక్టుకోసం దేశీయంగా బెంగళూరూ, ముంబై, డిల్లీ, కలకత్తా…మొదలైన నగరాలనుంచీ అమెరికా, కెనడా, లందన్ లలో ఉన్న ఎన్నారై లుకూడా తమవంతు సాయం చేయటం కోసం ముందుకొస్తున్నారు.

అంకితభావం అంటే ఎలా ఉంటుందో ఒక్కడు చేయటం అసాధ్యం అనుకున్నపని తల ఒక చేయి వేసి అంతా ఒక్కటైనప్పుడు, ఒకే కలని కన్న కొన్ని వేలమంది మనుషులు ఒక్కటైనప్పుడు ఎంతపెద్ద లక్ష్యం అయినా ఖచ్చితంగా చేదించబడుతుంది అనేందుకు ఒక ఉదాహరనే ఆర్మ్ స్ట్రాంగ్. అతని కల నెరవేరాలని, ఆ ప్రాంత ప్రజలకు రోడ్డుతో బాటు అభివృద్దీ అందాలని కోరుకుందాం…

(Visited 2,275 times, 11 visits today)