Home / General / ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ Vs పాకిస్థాన్.

ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ Vs పాకిస్థాన్.

Author:

న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో భాగంగా వరుసగా మ్యాచ్ లు గెలిచిన మన జట్టు క్వార్టర్‌ ఫైనల్ లో మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌ తో తలపడింది, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు 49.2 ఓవర్లలో ఆలౌట్ అయి 265 రన్స్ చేసారు, ఓపెనర్‌ పృథ్వీ షా(40), శుభ్నమ్‌ గిల్‌(86), అభిషేక్‌ శర్మ(50) బ్యాటింగ్‌లోరాణించారు.

ఐసీసీ వరల్డ్ కప్

266 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ జట్టు మన బౌలర్ల దాటికి 42.1 ఓవర్లలో 134 పరుగులకే చేతులెత్తేసింది. భారత్‌ బౌలర్లు నాగర్‌ కోటి(3), శివమ్‌ మావి(2), అభిషేక్‌ వర్మ(2) బౌలింగ్ లో సత్తా చాటడంతో మన జట్టు బంగ్లాదేశ్ పై 131 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నెల 30న జరగనున్న సెమీఫైనల్‌-2లో భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్‌ మధ్య ఈ నెల 29న సెమీఫైనల్‌-1 జరగనుంది.

(Visited 149 times, 7 visits today)