EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Inspiring Stories / డ్రైవర్‌లెస్ సైకిల్ ని తయారు చేసిన విద్యార్థులు.

డ్రైవర్‌లెస్ సైకిల్ ని తయారు చేసిన విద్యార్థులు.

Author:

Driverless cycle

డ్రైవర్ లెస్ కార్ అని వినే ఉంటారు అయితే కేవలం కార్లకేనా ఈ సౌకర్యం. మరి సామాన్యుని మాటేమిటి? కార్లలో వెళ్లే ఆర్థికస్థోమత లేక.. సైకిల్‌పై వెళ్లే అవకాశం లేక.. చాలామంది అవస్థల పాలవుతుండటం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారి కోసం ఖరగ్‌పూర్‌ ఐఐటీ విద్యార్థులు సరికొత్త పరిష్కారం చూపారు. అంతే కాదు వీరి ఆవిష్కరణ అయిన ఏఏ-బైసికిల్ వెనుక ఒక మానవతా కోణం కూడా ఉంది అవయవాన్నీ సక్రమంగా ఉన్నవారే సైకిల్‌ తొక్కడానికి ఇబ్బంది పడుతుంటారు. ప్రధానంగా అంధులు, ఓ కాలో, చేయోలేక ఇబ్బందిపడే వారి కోసం దీన్ని సృష్టించినా సైకిల్‌పై శ్రమలేకుండా గమ్యస్థానం చేరుకోవాలనుకునే వారందరికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రత్యేక సైకిల్ ట్రాక్ ఉన్న నగరాల్లో ఝుమ్మంటూ హాయిగా, హుషారుగా దూసుకుపోవచ్చు. మెట్రో రైల్లో ఓ స్టేషన్లో దిగి సైకిల్ తీసుకొని గమ్యస్థానానికి వెళ్లావారికే ఈ డ్రైవర్‌లెస్ టెక్నాలజీ మరీ ఉపయోగపడుతుంది. దీని ప్రయోజనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎస్‌ఎమ్మెస్‌తో ఈ సైకిల్ మనల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. సరికొత్త టెక్నాలజీ తో ఒక్క మెసేజ్‌ పంపితే చాలు.. ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చే ఈ-బైస్కిల్ ని తయరు చేసారు. . సైకిల్‌పై కూర్చుంటే చాలు.. వెళ్లాల్సిన చోటుకు చేరుస్తుంది. హ్యాడిల్ పట్టుకోవాల్సిన పని లేదు. ఏదైనా వాహనం అడ్డువచ్చినా, దారిలో మలుపులు ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా గమ్యస్థానానికి చేర్చేలా ఈ సైకిల్‌ను అభివృద్ధి చేశారు. నిజానికిది సాధారణ సైకిలే కానీ వీరి అద్బుతమైన ఆలోచనకి టెక్నాలజీ జోడించి దీన్ని వీరు ఐ-బైక్‌గా మార్చేశారు.

Driverless Cycle 1

వికలాంగులు ఎక్కినప్పుడు సైకిల్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండేందుకు చిన్న పిల్లల సైకిల్ వలే వెనక చక్రానికి రెండు చిన్న చక్రాలను అదనంగా అమర్చారు. అవసరమనుకున్నప్పుడు వాటిని బటన్ ద్వారా మడిచేయవచ్చు. సైకిల్ దానంతట అదే నడిచేందుకు వెనక ఓ చిన్న మోటారును అమర్చారు. ఆ మోటారును వెలువడే శక్తి వంతవల్ల సైకిల్‌కు అమర్చిన బటన్లు పనిచేస్తాయి. ఆ బటన్లు నిర్దేశిత లక్ష్యం ప్రకారం పనిచేస్తాయి. ఒక బటన్‌ను నొక్కితే సైకిల్ హాండిల్ స్టీరింగ్‌లా పనిచేస్తోంది. మరో బటన్ నొక్కితే సైకిల్ ముందుకు వెళుతుంది.మొబైల్ ఫోన్ ద్వారా కమాండ్లు తీసుకునేందుకు సైకిల్‌కు రిసీవర్ వ్యవస్థ ఉంటుంది. డ్యూయల్‌ లోకోమోషన్‌ పరిజ్ఞానంతో ఈ సైకిల్‌ మ్యానువల్‌గానూ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ యాప్‌తో పనిచేసే ఐ-బైక్‌.. జీపీఎస్‌ ఆధారంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. దారిలో ఏవైనా గుంతలు ఉన్నా, వాహనాలు అడ్డువచ్చినా సోనార్‌ సెన్సర్ల ఆధారంగా దిశను మార్చుకుంటుంది ఐ-బైక్‌. ఈ సైకిల్‌ వైర్‌లెస్‌ టెలిఫోన్‌ నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. ఎవరైనా సరే ఐ-బైక్‌ కోసం మెసేజ్‌ చేసి లొకేషన్‌ను ఎంపిక చేసుకుంటే చాలు దానంతట అదే అక్కడికి వచ్చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా సైకిల్‌కు రిసీవర్‌ వ్యవస్థ కూడా ఉంది. జీపీఎస్‌తో అనుసంధానించడం వల్ల గమ్యస్థానానికి సులువుగా చేరుకుంటుంది. అంతేకాదు మనకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడికి చేరుస్తుంది. ఐ-బైక్‌కు ఛార్జింగ్‌ అయిపోతుందనో, ఇంధనం అయిపోతుందనే సమస్య కూడా లేదు. ఎందుకంటే డైనమో వంటి పరికరం తో సైకిల్‌ చక్రాలు తిరగడం వల్ల ఉత్పత్తయ్యే విధ్య్త్ శక్తి తోనే ఇది నడుస్తుంది.

Driverless Cycle 1

ప్రస్తుతం మెట్రోస్టేషన్లతో పాటు పలు కార్పొరేట్‌ సంస్థలు సైకిల్‌ షేరింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో ఈ ఐ-బైక్‌లు వైకల్యం ఉన్న వారితో పాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి మళ్ళీ తిరిగి స్టేషన్‌కు వచ్చేస్తాయని చెబుతున్నారు. అంతేకాదు ఇళ్లలోనూ వీటిని ఉపయోగించుకునేందుకు అనువుగా ఉంటాయి.ఇప్పటికే ఇదే తరహా లో ఒక వీల్ చైర్ ని కూడా రూపొందించే పనిలో ఉన్నారు ఈ యువ ఇంజినీర్లు. వీటితో నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది. సరికొత్తఐ-బైక్‌ జాతీయస్థాయిలో ప్రదర్శనల్లో బహుమతులని గెలుచుకుంది.

Source: TheBetterIndia.

Comments

comments