Home / Entertainment / బ్రూస్ లీ టీం మీద ఆదాయపు పన్ను శాఖా దాడి….!?

బ్రూస్ లీ టీం మీద ఆదాయపు పన్ను శాఖా దాడి….!?

Author:

బ్రూస్ లీ టీం పై ఆదాయ పన్ను శాఖ వారి కన్ను పడింది. ఒకేసారి సంగీత దర్శకుడు థమన్, నిర్మాతలు నిర్మాత దానయ్య, ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు దిల్‌ రాజు ల ఇళ్ళ పై సోదాలు జరిగాయి. సినిమా విడుదలకు ముందు ‘క్లియరెన్స్‌ల’ కోసం సినీ ప్రముఖులు తమ ఇళ్ళలో కార్యాలయాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు నిల్వ చేస్తున్నారన్న “హింట్” తో అధికారులు ఇలా సోదాలకు వచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళ సినిమా “పులి” విడుదలకు ఒక్కరోజు ముందుకూడా ఇలానే అధికారులు సోదాలు నిర్వహించారు.

ఐతే ఇలా సరిగ్గా సినిమాకు ముందు జరిగే దాడుల వల్ల తమ సినిమాల పై చెడు ప్రభావం పడుతుందనీ, సినిమా రిలీజ్ లూ వాయిదా వేసుకోవాల్సి వచ్చి నానా ఇబ్బందులూ ఎదుర్కుంటున్నామనీ పలువురు సినీ ప్రముఖులు విమర్శించిన సందర్భాలూ ఉనాయి.. సినిమా రిలీజ్ అనగానే ఒకరోజు ముందో లేదా అదే ముందు రోజు రాత్రో జరిగే సోదాల వల్ల తమ సినిమాల విజయాల పైనే ప్రభావం పడుతోందనీ వారంటున్నారు..

తమిళ హీరో విజయ్‌ నటించిన ‘పులి’ రిలీజ్‌కి ముందు విజయ్‌ సహా పలువురు సినీ ప్రముఖుల ఇళ్ళపై ఐటీ దాడులు జరిగాయి. ‘పులి’ రిలీజ్‌ సమయంలో నానా ఇబ్బందులూ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తెలుగులో విడుదల ఆలస్యం అవ్టం వల్లనే ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయి తెలుగులో హక్కులు కొన్నవా వారువిపరీతంగా నష్ట పోయారు.

(Visited 40 times, 14 visits today)