Home / Inspiring Stories / హీరోలు అంటే ఎలా ఉంటారో తెలుసా..?

హీరోలు అంటే ఎలా ఉంటారో తెలుసా..?

Author:

అభిమానం తో దగ్గరికి వెళితే “స్టుపిడ్ ఫెల్లోస్” అన్న హీరోని చూసి ఉంటారు, దండలు వేసిన మనుషులని తన్నిన హీరోలని చూసి ఉంటారు… వీళ్ళు హీరోలైతే ఇవాళ బుల్లెట్లకు ఎదురు నిలిచిన వాళ్ళనేమనాలి? అసలు హీరో అంటే ఎలా ఉంటాడో తెలుసా..?

ఎప్పుడు ఎటునుంచి మృత్యువు దూసుకు వస్తుందో తెలియదు. పరుగు తీసే కాళ్ళు ఏక్షణం లో ఆగిపోతాయో తెలియదు. కళ్ళలో తననే నమ్ముకున్న భార్య గుండె చప్పుదులో లేత చేతులతో వీడ్కోలు పలికిన పిల్లలు మళ్ళీ కనిపిస్తారా? అన్న ప్రశ్న కంటే దేశాన్ని ఎలా కాపాడాలి అన్న తపనే ముందుంటుంది. పఠాన్ కోట్ ఇంకా తుపాకీ చప్పుళ్ళతో దద్దరిల్లుతూనే ఉంది.. ఇప్పటికే ఏడుగురు హీరోలు నేలకొరిగారు. మూడు రోజులుగా ఆపరేషన్ జరుగుతూనే ఉంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి కొన్ని ఫొటోలు…

ఆ సమయానికి అతని గర్ల్ ఫ్రెండ్ పేరు ఏకే 47

Real Heros

 రబ్బరు కత్తులూ, ప్లాస్టిక్ గన్ లూ చేతిలో పట్టుకొని ఫోజులిస్తే హీరోలైపోరు…. తొడ గొట్టే హీరోలకు గన్ పట్టుకుంటే ఎలా ఉంటదో, చలిలో సెంట్రీ ద్యూటీ చేయటం అంటే ఎలా ఉంటదో అర్థం కాదు…

Real Heros3

తాళ్ళు కట్టుకొని ఎగిరి తంతే…. విజిల్సేస్తూ థియేటర్ లో డాన్సులేస్తాం…..  రెండు సెకెండ్ల దూరం లో నే చావు ఉందని తెలిసినా ముందుకే పరుగెత్తే హీరో లు ఆ టైం లో చలికి వణుకుతూ కూడా హాయిగా విజిల్ వేసుకుంటూ డ్యూటీ చేస్తూంటారు…

Real Heros7

బుల్లెట్ ఎన్ని అడుగులున్నా పేల్చేవాడి గుండెలో ధమ్ము ముందు అదెందుకూ పనికిరాదు….

Real Heros8

ఓక హీరో సినిమాలో సిన్సియర్ ఆఫీసర్ బయట తాగి కారు నడిపి మనుషులని చంపినా మనం “పెద్ద మనసుతో” అభిమానిస్తాం… “మన కోసం నేలకొరిగిన ఎందరు సైనికుల పేర్లు మనకు గుర్తున్నాయ్?” అని ఒక్క సారి ప్రశ్నించుకుంటే…!?

Real Heros4

“స్టుపిడ్ ఫెల్లో” అనిపించుకుంటాం అయినా చప్పట్లు కొడతాం, కాలితో తన్ని తొడకొట్టినా మళ్ళీ దండలేస్తాం…. పక్కన మార్షల్స్ ని పెట్టుకొని వచ్చే వాడి కోసం ఎగబడతాం…. మన సెక్యూరిటీ చూసే నిజమైన హీరో కనీసం మన చప్పట్లు కూడా వినపడనంత దూరం లో తుపాకీ చప్పుళ్ళ మధ్య ఉంటాడు…

Real Heros6

కోట్ల రూపాయల కార్లు కనీసం “అవసరం” కూడా కాదు అప్పుడప్పుడూ తిరగటానికి…. ఎంతైనా జీతం రాళ్ళ కోసం పని చేసే హీరో అనా?? గుంపులు గుంపులుగా వ్యాన్ లలో కుక్కి పంపిస్తాం… జై జవాన్ అని మళ్ళీ కంటి తుడుపు నినాదం ఒకటి…

Real Heros5

పదిరూపాయల టికెట్ 1000 రూపాయలకు అమ్ముతూంటే 500 లకు మనం బేరమాడి సినిమా చూసి పూలు గాళ్ళోకి చల్లేటప్పుదు… మన హీరో శరీరం లోకి బుల్లెట్ దిగి రక్తం చిమ్ముతుంది మన సినిమా అయిపోయాక ఫేస్బుక్ పోస్ట్ లో కన్నీళ్ళు కారుస్తాం…. జై భారత్ మాతా…. జై జవాన్…. జై కిసాన్

Real Heros1

తప్పు కాదు.., నేరమూ లేదు.., కానీ…! రీల్ మీద కనిపించే నీడని చూసే ఒక మనిషి కోసం ప్రాణాలిచ్చేటంత అభిమానించే మనం. ఒక కళాకారుడిని ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించి ఒక్క మాట పడ్డా, పోస్టర్ కొద్దిగా చిరిగినా భరించ లేనంత ప్రేమించే మనం… ఒక నిజమైన హీరోని ఎందుకు అభిమానించలేకపోతున్నాం..!? నిజంగా వాళ్ళు ఆ గౌరవానికి అర్హులుకారా..???

Must Read: మన అదిలాబాద్ అడవి మీకోసం కొన్ని అద్బుతాలని దాచి ఉంచింది.

(Visited 5,339 times, 73 visits today)