EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / 56శాతం భారతీయులు లంచం ఇచ్చారు..గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ

56శాతం భారతీయులు లంచం ఇచ్చారు..గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ

Author:

అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దేశంలో అవినీతి పెరిగిపోతూనే ఉంది. అంతకుముందుతో పోలిస్తే గడచిన ఏడాది కాలంలో మరింత పెరిగింది. ట్రన్సాపరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా అండ్‌ లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ ఏడాది భారత్‌లోని 56 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లంచాలు ఇచ్చారు. ఈ సర్వే కోసం 1,60,000 మంది నుంచి స్పందనలను స్వీకరించారు.గత ఏడాది 45శాతం మంది భారతీయులు లంచాలు ఇచ్చినట్లు చెప్పగా ఈ ఏడాది 56శాతం మంది లంచాలు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో అంతకుముందుతో పోలిస్తే 11శాతం మంది పెరిగారు. తాజా నివేదిక ప్రకారం 58శాతం మంది తమ రాష్ట్రాల్లో అవినీతి-వ్యతిరేక హెల్ప్‌లైన్‌ లేదని చెప్పారు. 33శాతం మంది తమ రాష్ట్రాల్లో అవినీతి వ్యతిరేక హెల్ప్‌లైన్‌ ఉన్నట్లు తెలియదని సమాధానమిచ్చారు.

ఎక్కువ శాతం లంచాలు డబ్బు రూపంలోనే ఇచ్చారని సర్వే పేర్కొంది. నగదు రూపంలో 39శాతం, ఏజెంట్ల ద్వారా 25శాతం, ఇతర రూపాల్లో ఒక్క శాతం లంచాలు అందాయని వెల్లడించింది. అందులోనూ ఎక్కువగా పోలీసులకు లంచాలు ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత మున్సిపల్‌ అధికారులకు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం‌, ఇతర అధికారులకు(విద్యుత్‌ బోర్డు, రవాణా కార్యాలయం, పన్ను కార్యాలయం, ఇతర కార్యాలయాలు) ప్రజలు లంచాలు ఇచ్చినట్లు సర్వే పేర్కొంది.

India Corruption Survey 2018 56% Indians admit to paying bribes

అంతేకాకుండా సర్వేలో పాల్గొన్న వారిలో 36శాతం మంది తమ పని పూర్తి కావాలంటే లంచం ఇవ్వడం ఒక్కటే మార్గం అని భావిస్తున్నారని తెలిపింది. అలాగే తమ పని చేయించుకోవడానికి లంచం ఇవ్వము అని చెప్పే వారి సంఖ్య కూడా 43శాతం నుంచి 39శాతానికి తగ్గిందని వెల్లడించింది. 13శాతం మంది తాము లంచం ఇచ్చిన కార్యాలయాల్లో సీసీటీవీలు ఉన్నాయని చెప్పారని సర్వే పేర్కొంది.

(Visited 1 times, 24 visits today)