Home / Inspiring Stories / ఆస్ట్రేలియాలో పరుగులు తీయనున్న భారతీయ రైల్వేకోచ్ లు.

ఆస్ట్రేలియాలో పరుగులు తీయనున్న భారతీయ రైల్వేకోచ్ లు.

Author:

Made in India Coachs 2

భారత్ సాంకేతిక రంగంలో మరో అడుగు ముందుకేసింది. దేశీయ పరిఙ్ఞానంతో తయారు చేసిన వస్తువుల మీద మనకు ఉండే చిన్న చూపుని తగ్గించే ప్రయత్నంలో మనం తలుచుకుంటే ఎటువంటి అద్బుతాలను చేయగలమో నిరూపించింది ఇండియన్ రైల్వే. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా పూర్తి స్థాయి భారతీయ పరిఙ్ఞానంతో తయారు చేసిన 6 రైల్వే కొచ్ లను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తోంది. ఒక ఒప్పందం ప్రకారం వచ్చే రెండున్నర సంవత్సరాలలో 450 అత్యాధునిక రైల్వే భోగీలు ఆస్ట్రేలియాకు పంపనున్నారట.2.7 అమెరికన్ డాలర్ల ఈ డీల్ పై వడొదరా బొంబార్దియర్ ట్రాన్స్ పోర్ట్ తో కూడా ఈ రైల్వే కోచ్ ల రవాణా ఒప్పందం కుదింది కూడా…

ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం బుక్ చేసుకున్న బరోడా ప్లాంట్లో నిర్మించిన 6 కోచ్ లు ముంబై పోర్ట్ లో షిప్ప్ లలో లోడ్ చేయబడ్డాయి కూడా. భారీ వస్తువులను చేరవేసే కార్గో షిప్లు వాటిని మోస్తూ బయలు దేరే సమయం కోసం ఎదురు చూస్తున్నాయినంటూ నౌకా మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన ప్రకటన చెబుతోంది. ఒక్కో కోచ్ 75 అడుగుల పోడవూ,46 టన్నుల బరువూ ఉన్న ఆరు రైల్వే కోచ్లనూ అత్యంత జాగ్రత్తగా,భారీ క్రేన్ల సాయంతో షిప్ లోకి ఎక్కించారట. ఈ ఓవర్ సైజు లో ఉన్న మెట్రో కోచ్ లని షిప్ లోకి ఎక్కించటానికి చాలా తంటాలే పడ్డారట పోర్ట్ అధికారులు. వీటిని లోడ్ చేసే భారీ క్రేన్ ని నడపటానికి బయటి నుంచి ప్రత్యేకంగా ఆపరెటర్లనూ టెక్నీషియన్లనూ రప్పించారట…

Made In India Coachs 1

భారత రైల్వే గురించి మరికొన్ని విశేషాలు:

  • బ్రెజిల్ రైల్వే అయిన సోపులో మోనోరైల్(Sao Pulo Monorail) కోసం 521 భొగీ ఫ్రేం లను భారత్ నుంచే ఎగుమతి చేసుకోనుంది. ఇప్పటికే ఆ ఫ్రేముల తయారీ మొదలైంది.
  • డిల్లి మెట్రో ఇప్పటికే 90% వ్యాగన్ లను సొంతంగా తయారు చేసుకొని ఒక మైలు రాయిని దాటింది.ఫేస్ 1,2 లలో మొత్తం 1234 వ్యాగన్లలో 36 జర్మనీవి కాగా,64 కొరియానుంచి దిగుమతి చేసుకున్నవి. ఫేస్ 3 లోని 846 కోచ్ లలో 120 కొరియావి కాగా మిగిలినవి మొత్తం మనదెశ పరిఙ్ఞానం తో ఇక్కడ నిర్మించబడ్డవే.
  • రాబోయే 5 సంవత్సరాలలో 2000 మెట్రో రైళ్ళ ను నిర్మించాలనే లక్ష్యం వైపు ఇప్పుడు భారత రైల్వే పరుగు తీస్తోంది.
  • ఫ్రెంచ్ కంపెనీ అల్స్ట్రాం ట్రాన్స్ పోర్ట్ కోసం కోచ్లను తయారు చేస్తున్న “కొచ్చి మెట్రోరైల్” అనుకున్న సమయం కంటే అయిదునెలలు ముందుగానే తన ప్రాజెక్ట్ ని పూర్తి చేసింది.
  • ప్రపంచం లోని అన్ని దేశాలకంటే భారత్ లో తయారయ్యే మెట్రో రైల్ కోచ్ లు తక్కువ ధరలో ఉండటమే కాకుండా. నాణ్యతలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటున్నాయి.
  • ఒక్క కోచ్ ని తయారు చేయటానికి వ్యాంకోవర్(కెనడ) లో 16.08 కోట్లూ,సాన్ ఫ్రాన్సిస్కో లో 15.13 కోట్లైతే, భారత దేశం లో మాత్రం కేవలం 8.94 కోట్లు మాత్రమే. అదీ నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండానే పూర్తి కోచ్ తయారౌతోంది.

నిజానికి భారత దేశం ఆర్థికంగానూ,మేదా సంపత్థిలోనూ ప్రపంచం లోనిఉ మిగిలిన ఏదేశం కన్నా తక్కువకాదు. కానీ ఇంత ఘనత సాధిస్తూకూడా ఇంకా వెనుకబడే ఉంటున్నం అంటే….. సమాధానం మీకూ తెలుసు.

(Visited 1,514 times, 9 visits today)