EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ..! మరో అద్భుతానికి సిద్ధమైన భారత్..!

Author:

మనదేశంలో ఒక హీరో సినిమా విడుదల అయింది అంటే చాలు బట్టలు చింపుకొని మరి థియేటర్లో గోల గోల చేస్తాం, ఒక రాజకీయ నాయకుడి పుట్టిన రోజుకి రక్తదానాలు అని నానా హంగామా చేస్తాం కానీ అంతర్జాతీయ స్థాయిలో మన దేశం మొత్తం గర్వించే విషయాన్నీ మాత్రం పట్టించుకోము, మన రక్షణ కోసం సరిహద్దులో ప్రాణాలు కోల్పోతున్న సైనికుల గురుంచి మనకి అవసరం లేదు, మన కోసం కష్టపడుతున్న శాస్త్రవేత్తల గురుంచి మనకి పట్టదు, మనం మనం మారనంతవరకు మన దేశం ఇలాగే ఉంటది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి భారతీయుడు గర్వించే రోజు రాబోతుంది, ఇప్పటికే చేసిన అన్ని ప్రయోగాలని విజయవంతం చేసిన మన ఇస్రో ఫిబ్రవరి 15 న ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్ చేస్తూ ఒకేసారి వందకి పైగా ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రయోగించబోతుంది.

Isro-Project

నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షం లోకి ఒక్క రాకెట్ దూసుకెళ్తేనే అమితమైన ఆశ్చర్యంతో చూస్తాం, అలాంటిది ఒకేసారి వంద ఉపగ్రహాలు నింగిలోకి పంపిస్తే.. ఆ ఆనందానికి హద్దులు ఉండవు, మంగళయాన్, చంద్రయాన్౧, నావిక్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఇస్రో ఆత్మ విశ్వాసంతో మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీన 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనత ఏ దేశానికి లేదు. అది మన భారత దేశానికి మాత్రమే దక్కబోతున్న అరుదైన గౌరవం.

Isro-Project

60వ రాకెట్ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వాహన నౌక ద్వారా అంతరిక్షంలోకి చేర్చేందుకు రంగం సిద్ధమైంది. సీ 37 వాహన నౌక ద్వారా 3స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 2016లో పీఎస్ఎల్వీ-34 రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి విజయం సాధించింది. ఈ రికార్డును అధిగమించేందుకు ఏకంగా 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో ప్రణాళిక రూపొందించింది. కాగా తమ ఉపగ్రహాలను ఆ జాబితాలో చేర్చాలని 20 దేశాలు కోరడంతో మొత్తంగా 104 ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే అంతరిక్ష స్థాయిలో మన దేశ జెండా రెపపలాడుతుంది, ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం.

(Visited 3,708 times, 104 visits today)

Comments

comments