EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / సాహో యువ భారత్: అండర్ 19 వరల్డ్ కప్ మనదే..!

సాహో యువ భారత్: అండర్ 19 వరల్డ్ కప్ మనదే..!

Author:

కుర్రాళ్ళే కదా అనుకుంటే కొత్త విజయం తో ప్రపంచాన్నే కుమ్మి పడేశారు. రేపటి తరం ఇండియన్ క్రికెట్ కి మేము వస్తున్నాం అంటూ వరల్డ్ కప్ తో సవాల్ విసిరారు. నాల్గోసారి వరల్‌ కప్‌ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్‌ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది.. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేశారు. మ‌రో ఎనిమిది వికెట్లు మిగిలి ఉండ‌గానే విజ‌యం చేజిక్కించుకున్నారు.  యంగిండియా ఇర‌గ‌దీసింది. కొత్త చ‌రిత్ర సృష్టించింది. గ‌తంలో ఎవ‌రికీ సాధ్యం కాని రీతిలో అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను నాలుగోసారి గెలిచింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఫైన‌ల్లో 8 వికెట్ల‌తో గెలిచి.. నాలుగోసారి విశ్వ‌విజేత‌గా నిలిచింది. ఆసీస్ విధించిన 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 38.5 ఓవ‌ర్ల‌లోనే చేజ్ చేసింది. టోర్నీ మొత్తం అజేయంగా నిలిచిన పృథ్వి షా సేన‌.. ఫైన‌ల్లోనే అదే జోరు కొన‌సాగించింది. తిరుగులేని ఆధిప‌త్యం చెలాయించింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్.. ఇలా అన్ని రంగాల్లో రాణించి మూడుసార్లు విశ్వ విజేత అయిన ఆస్ట్రేలియాను ఓ ప‌సికూనగా మార్చేసింది.  టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇదే ఆస్ట్రేలియాపై వంద ప‌రుగుల‌తో గెలిచిన టీమిండియా.. ఫైన‌ల్లోనూ ఆసీస్‌ను మ‌ట్టి క‌రిపించింది. టోర్నీలో ఆసీస్‌తో మొద‌లుపెట్టి ప‌పువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌.. మ‌ళ్లీ ఆస్ట్రేలియాపై గెలిచి నాలుగోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. రాహుల్ ద్ర‌విడ్ కోచింగ్‌లో రాటుదేలిన పృథ్వి షా సేన‌.. నిజ‌మైన చాంపియ‌న్ టీమ్‌లాగే ఆడి విజ‌యం సాధించింది.

Under-19-World-Cup

ఓపెన‌ర్ మ‌న్‌జోత్ కైరా (101) అజేయ శ‌త‌కంతో భారత్ సునాయాసంగా ల‌క్ష్యాన్ని ఛేదించింది. దేశాయ్ (47 నాటౌట్‌) స‌హ‌కార‌మందించాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 38.5 ఓవర్ల‌లోనే రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఛేదించింది.

అంత‌కుముందు బౌల‌ర్లు స‌మ‌ష్టిగా రాణించిన విష‌యం తెలిసిందే. పోరెల్‌, శివ సింగ్‌, నాగ‌ర్ కోటి, రాయ్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టి ఆస్ట్రేలియాను 217 ప‌రుగుల ల‌క్ష్యానికే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. ఆసీస్ బ్యాట్స‌మెన్ల‌లో మెర్లో (76) మాత్ర‌మే రాణించాడు. కాగా, ఈ విజ‌యంతో భార‌త్ ఖాతాలో నాలుగో సారి ప్ర‌పంచ‌క‌ప్ చేరింది. దీంతో అత్య‌ధిక ప్ర‌పంచ‌క‌ప్‌లు నెగ్గిన జ‌ట్టుగా భార‌త్ అవ‌త‌రించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా స‌త్తా చాటింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భార‌త్ అన్ని రంగాల్లోనూ పై చేయి సాధించింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ ఆధిప‌త్యం క‌న‌బ‌ర్చింది.

Under-19-World-Cup

 యువ భారత జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌కు రూ. 50లక్షలను బహుమతిగా ప్రకటించిన బీసీసీఐ.. వరల్డ్‌ కప్‌ ఆడిన క్రికెటర్లకు తలో రూ. 30 లక్షల చొప్పన ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మరొకవైపు ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు సేవలందించిన సపోర్టింగ్‌ స్టాఫ్‌కు సైతం రూ. 20లక్షల నజరానాను ప్రకటించింది. ఈ మేరకు వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత  బీసీసీఐ తన ట్వీటర్‌ అకౌంట్‌లో నజరానా విషయాన్ని వెల్లడించింది.

Comments

comments