ఇంటర్ విద్యార్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్…!

Author:

ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. రాత, శరీరదారుఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆగస్టు నుంచి శిక్షణ మొదలవుతుంది. ప్రారంభంలోనే నెలకు రూ.35,000 వరకు వేతనం పొందవచ్చు.

కోస్ట్ గార్డ్

అర్హత పొందిన వారికి… ప్రాథమిక శిక్షణ ఆగస్టు నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. ఇక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టింగు ఇస్తారు. విధుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. వేతనంతోపాటు పలు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్‌, వసతి, దుస్తులు, ఎల్‌టీసీ…మొదలైనవి) ఉంటాయి.

చివరి తేదీ: ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. జనవరి 2, 2018 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ అడ్మిట్ కార్డుల ప్రింట్ అవుట్ లు జనవరి 22 వరకు తీసుకోవచ్చు. రాత పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం.

వెబ్ సైట్: www.joininindiancoastguard.gov.in

నోటిఫికేషన్: Indian Coast Guard Recruitment Adv

అర్హతలు:

 • 50 శాతం మార్కులతో ఇంటర్‌ / +2 ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణత పొందాలి.
 • మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
 • వయసు- కనిష్ఠం 18 ఏళ్లు, గరిష్ఠం 22. ఆగస్టు 1, 1996 – జులై 31, 2000 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.
 • ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయఃపరిమితి సడలింపు ఉంది.
 • ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.
 • ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతోపాటు ఆంగ్లభాషా పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి.
 • రాత పరీక్షలో అర్హత సాధించినవారికి శరీరదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
 • ఎత్తు కనీసం 157 సెం.మీ.
 • ఊ­పిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. ఉండాలి.
 • ఈ విభాగంలో అర్హత సాధించడానికి 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్‌లు తీయగలగాలి.
 • పీఈటీలో అర్హత పొందితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్పష్టమైన కంటిచూపు ఉండాలి, వినికిడిలోపం ఉండకూడదు.
(Visited 342 times, 363 visits today)

Comments

comments