Home / Political / ప్రాచీన భారతీయుల విమాన తయారీ గ్రంథం “వైమానిక ప్రకరణం” గురించి తెలుసా?

ప్రాచీన భారతీయుల విమాన తయారీ గ్రంథం “వైమానిక ప్రకరణం” గురించి తెలుసా?

Author:

aeroplane made before right brothers

విమానాన్ని కనిపెట్టిందెవరు..? ఈ ప్రశ్నకు ఎవరైనా ఠక్కున రైట్ బ్రదర్స్ అని జవాబిస్తారు..? కానీ వారికన్నా ఎనిమిదేళ్ల ముందే ఓ భారతీయుడు విమానాన్ని రూపొందించి ప్రయాణించినట్లు వెలుగు చూసింది..! అయనే ముంబైకి చెందిన శివకర్ బాపూజీ తల్పడే. రైట్ బ్రదర్స్ 1903లో తొలిసారి విమానంలో విజయవంతంగా ప్రయాణించారన్నది చరిత్ర.
1903 డిసెంబరు 17న రైట్‌ సోదరులు ప్రపంచంలోనే తొలి విమానాన్ని నడిపినట్లు నేటి చరిత్ర. కాని వీరికన్నా ఎనిమిది సంవత్సరాల ముందు శివకర్‌ బాపూజీ తల్పడే అనే ఆయన బొంబాయి సముద్రతీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులున్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్‌ వినాయక సావర్కార్‌ ప్రత్యేకంగా వ్రాసారు. కాగా 1885లోనే శివకర్ తల్పడే ఆ ఘనత సాధించారనేందుకు ఆధారాలు బయటపడ్డాయి. ముంబైలోని జే జే స్కూల్ ఆఫ్ ఆర్స్ట్‌ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు “మరుత్సక” పేరిట విమానాన్ని రూపొందించి గుర్గావ్ లోని చౌపట్టి ప్రాంతాన అందులో ప్రయాణించినట్లు తెలుస్తోంది.అయితే తాను రూపొందించిన విమానం ఎక్కువదూరం గాలిలో ప్రయాణించలేకపోవటమూ, దానికి పెద్దగా ప్రచారం కలపించుకోలేకపోవటం వల్ల శివకర్ ఆవిష్కరణ చరిత్రలోనే మరుగున పడిపోయింది.

             “వైమానిక ప్రకరణం” అనే పురాతన గ్రంథం ఆథారంగా ఆయన దాన్ని రూపొందించాడట..! ఈ గంథ్రం చేతిరాత ప్రస్తుతం పూణెలోని భారత్ ఇతిహాస్ సంశోధక్ మండల్ లో ఉందట..!అలాగే మహరాజా సాయాజీరావ్ వర్సిటీ ఆఫ్ బరోడాలోని ఓరియంటల్ ఇన్ స్టిట్యూట్ లో ఓ కాఫీ, జామ్ నగర్ లోకి గుజరాత్ ఆయుర్వేదిక్ వర్సిటీలో ఇంకోటి, తల్పడే వద్ద మరోటి ఉన్నాయని కొల్హాపూర్ లోని శివాజీ వర్సిటీ పురాతత్వ పరిశోరధకుడు గణేష్ నెర్లెంకర్ దేశాయ్ చెబుతున్నారు. విమానాల నిర్మాణం, పిడుగుల నుంచి రక్షణ , సూర్య తాపాన్ని నిరోధిచండం, దాడులను ఎదుర్కోవడంపై అందులో సమగ్రంగా ఉన్నట్లు దేశాయ్ తెలిపారు. ఈ గ్రంథాన్ని భరద్వాజ మహర్షి రాశాడని కొందరంటుండగా శివుడు వినాయకుడికి చెబితే ఆయన భరద్వాజమునికి చెప్పినట్లు పురాణ కథనం.

history about aeroplane
భరద్వాజ మహర్షి వ్రాసిన ”యంత్ర సర్వస్వం” ప్రాచీన భారతీయుల వైమానిక విద్యా నైపుణ్యానికి నిదర్శనం. ఈ గ్రంథం బరోడా మహారాజావారి గ్రంథాలయంలో వుంది. దీని ఆధారంగానే బోధానందుని వ్యాఖ్యానంతో ”వైమానిక ప్రకరణం” వెలువడింది. దాదాపు యాబై వరకు విమానగ్రంథాల సూచిక ఈ ప్రకరణంలో లభిస్తుంది. అగస్త్యుని ”శక్తిసూత్రం”, ఈశ్వరుని ”సౌదామినీకళ”, ”భరద్వాజుని ‘అంశుతంత్రం”, శాకటాయనుని ”వాయుతత్వ ప్రకరణం”, నారదుని ”వైశ్వానరతంత్రం”, ”ధూమప్రకరణం”, వీటిలో ముఖ్యమైనవి. అన్నింటిలో ”యంత్ర సర్వస్వం”, ఎనిమిది అధ్యాయాలు, వంద కాండలు, ఐదువందల సూత్రాలతో విశిష్టంగా పేర్కొనబడింది.
ఆకాశంలోనేకాక గాలిలోను, నీటిలోను, పక్షితో సమానమైన వేగంతో పయనించే దానిని ”విమానం” అంటారని భరద్వా జుడు పేర్కొన్నాడు. 36 రహస్యాలు (సాంకేతిక పరిజ్ఞానం) తెలిసినవాడు విమానాన్ని నడపగలడని అతన్నే ”చోదకుడు” పైలెట్‌ అంటారని ఆయన వివరించాడు.

ఈ ”యంత్ర సర్వస్వం” ఆధునిక, పాశ్చాత్య వైమానిక విద్యావేత్తల్ని ఆశ్చర్యపరు స్తున్నారని భరద్వాజుడు పేర్కొన్న వైమానిక సాంకేతిక పద్దతుల్లో నాలుగు ముఖ్యమైనవి వున్నాయి.
1. కృతకరహస్యం : విశ్వకర్మ, మయుడు, మనువు చెప్పిన రీతిలో విమానాలు నిర్మించే పద్ధతిని ఇది వివరిస్తుంది.
2. గూఢ రహస్యం: విమాన ప్రయాణాలకు దోహదం చేసే వాయువులు, వాటి చలనాల గురించి వివరిస్తుంది. ఆ వాయువుల పేర్లివి. వాస, వైయాస, ప్రయాస- ఈ మూడు వాయువుల్ని వశపర్చుకున్నట్లయితే విమానాన్ని ఎవరికీ కనిపించకుండా నడుపవచ్చునట!
3. అపరోక్షరహస్యం : పిడుగులవల్ల జన్మించే ఒక రకం ‘విద్యుత్తు’ గురించి ఈ ప్రకరణం వివరిస్తుంది.ఈ విద్యుత్తును వశపర్చుకుంటే విమానం ముందుగల వస్తువుల్ని పైలెట్‌      స్పష్టంగా చూడగలుగుతాడు.
4. సర్పగమన రహస్యం : సౌరశక్తిని ఉపయోగించి విమానాన్ని సర్పగతిలో నడిపే పద్ధతిని ఈ ప్రకరణం వివరిస్తుంది. ఇలా యంత్ర సర్వస్వం ప్రాచీన భారతీయుల విమాన విద్యా ప్రావీణ్యం గురించి వివరిస్తుంది.

అంతేకాక అతి ప్రాచీనమైన ఋగ్వేదం కూడా విమాన విద్యారహస్య సూక్తాలున్నాయి.
ఋగ్వేదం (5- 41-6) చెప్పిన ”ప్రావోవాయుం రధ యుజం కృధ్వం” అనే సూక్తం వాయు శక్తితో నడిచే వాహనాలను సూచిస్తుంది. అలాగే సాగర తరంగాలపై సంచరించే వాహనాలు (ఓడలు) గురించి ”సింధోర్‌ ఊర్శ వధి శ్రితఃకరం విబృత్‌ పరిస్పృం” అనే సూక్తం వివరి స్తుంది.
ఋహుడు మూడు చక్రాల వాహనాన్ని ఉపయోగించేవాడని గాలిలోనేకాక సముద్రంలో సంచరించే జలాంత ర్గాములు వాడకంలో వున్నాయని ఋగ్వేదం పేర్కొన్నది. ఆవిరి యంత్రాలను వేదకాలపు దాక్షిణికులు ”అగ్నిరథాలు” అనేవారు. త్రిపుర విమానం గురించి పురాణాల్లో వివరణ ఉంది.
అలాగే రామాయణంలో పుష్పకవిమానం గురించి భారత, భాగవతాల్లో సౌభకం వంటి విమానాల గురించి విశేష వర్ణనలు ఉన్నాయి.
మొత్తంమీద మన ప్రాచీన వాన్మయంలో విమాన నిర్మాణ విద్య గురించిన విశేషాలు ఎక్కువగానే ఉన్నాయి. నేటి ఏరోనాటిక్స్‌ నేపథ్యంగా ఈ విశేషాలను విశ్లేషించుకోవాలి.

(Visited 1,153 times, 77 visits today)