Home / Inspiring Stories / పాకిస్థాన్ దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన భారత సైనికుడు.

పాకిస్థాన్ దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన భారత సైనికుడు.

Author:

సరిహద్దు దగ్గర విధులు నిర్వహిస్తున్న భారత సైనికులపై రాత్రిపూట దాడి చేసి 20 మంది వీరులని పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదుల పై ప్రతీకారం తీర్చుకోవాలని మన సైనికులు రగిలిపోతున్నారు, వారు ఎన్ని చర్యలకి దిగిన, ఎంతో మందిని చంపేసిన మన సైనికులు మాత్రం ఎప్పుడు సహనంతోనే వ్యవహరించారు, పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు లాగా సరిహద్దు దాటి దాడి చేయలేదు, కానీ మన సహనాన్ని చేతకానితనంగా భావించి వారు రెచ్చిపోతున్నారు, వారికి బుడ్డి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు.

jawan-warning-pakisthan

మనం పాటిస్తున్న శాంతి సూత్రాన్ని అపహేళన చేస్తూ కవ్వింపు చర్యలకి పాల్పడుతున్న పాకిస్థాన్ కి ఒక సైనికుడు ఒక అద్భుతమైన కవితతో హెచ్చరించాడు, బస్సులో ప్రయాణిస్తూ యావత్ భారతదేశానికి స్ఫూర్తినిచ్చేలా కవిత చెప్పిన సైనికుడి వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుంది..

మేం ఎవరికి భయపడం..
వెళ్లి పాకిస్థాన్ వాళ్లకు చెప్పండి..
అణబాంబులకు, అణ్వాయుధాలకు మేం భయపడం..
అణుబాంబుల తయారు చేసి మీరు మరిచిపోయినట్లున్నారు..
గుర్తుతెచ్చుకోండి అబ్దుల్ హామీద్ పాకిస్థాన్ ట్యాంకులను కాల్చివేశాడు..
భయపెట్టాలని చూసే వారి వెన్నులో భయాన్ని పుట్టిస్తాం..
భారతావనిపై మేం తాగే నీటి శక్తి ఏమిటో తెలియజేస్తాం..
నాటి యుద్ధంలో అదృష్టం బాగుండి బతికారు. ఆ యుద్ధాన్ని గుర్తు చేసుకోండి..
కార్గిల్ యుద్ధాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. పాకిస్థాన్, చెవులు తెరుచుకుని విను..
గుర్తు తెచ్చుకోండి హిందుస్థాన్ వాళ్లు అమెరికా జెట్ ను కాల్చివేశారు..
పాకిస్తాన్ గుర్తు చేసుకో.. సిమ్లాలో ఏమైందో.. ఢాకాలో ఏమైందో గుర్తు చేసుకో..
సింహాల పిల్లలు తోడేళ్లకు భయపడవు..
ఈసారి యుద్ధం వస్తే.. పాక్ పేరు కూడా వినపడదు. ఖబర్దార్ పాకిస్థాన్
ఆటంబాంబులను తయారు చేసినందుకు మీరు ఎగిసిపడుతున్నారేమో..
మేం కన్నెర్ర చేస్తే మీ నామరూపాలు లేకుండా పోతాయి..
కాశ్మీర్ అయితే ఉంటుంది కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు..

శ్రీనగర్ ఘాట్ లను రక్తంతో ఎర్రగా మార్చారు..
భయాందోళనలు కలిగిన మీరు అనామకులను పంపిస్తున్నారు..
అందరికి తెలుసు ఆయుధాలు మీరే పంపిస్తున్నారు.. మీరే రాక్షసులుగా మారుతున్నారు..
వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి లేదంటే పాకిస్థాన్ మొత్తం నష్టపోకతప్పదు..
పాకిస్థాన్ లోని అన్ని దిక్కుల్లో మహాప్రళయం వస్తుంది..
ఏం జరుగుతుంది అనేదానిపై మీకు కనీసం అంచనాలు కూడా ఉండవు..
కాశ్మీర్ ఉంటుంది కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు..

అణుబాంబులను ఎవడు వాడతాడు..
మీ ముఖాలను మాత్రమే కాదు మొత్తం చరిత్రను, భౌగోళాన్ని మార్చేస్తాం..
గంగానది తన రూట్ మార్చుకొని లాహోర్ నుండి ప్రవహిస్తుంది..
ఇస్లామాబాద్ గుండెల మీద ఎగురుతుంది భారత జెండా..
రావల్పిండి నుండి కరాచీ వరకు మొత్తం నాశనమవుతుంది..
సింధు నది చుట్టు పక్కల మంచు కురుస్తుంది..
తరతరాల వరకు జిన్నా లాంటి రాక్షసుడు మళ్లీరాడు..
పాకిస్థాన్ మమ్మల్ని ఎదురించాలి అని ఎప్పుడూ అనుకోకు..
అలా అనుకుంటే మాత్రం ప్రపంచపటం మీద నీ నామరూపాలు లేకుండా చేస్తాం..
కాశ్మీర్ అయితే ఉంటుంది కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు..

జైహింద్.. భారత్ మాతాకి జై.

(Visited 2,376 times, 65 visits today)