Home / Inspiring Stories / భారత్ తేజస్ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మిన పాక్ రక్షణ విభాగం.

భారత్ తేజస్ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మిన పాక్ రక్షణ విభాగం.

Author:

Tejas Flight

తేజస్ భారత అమ్ములపొదిలో అత్యంత శక్తివంతమైన యుద్ద విమానాల్లో ఒకటి. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘తేజస్’ తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ) ఎట్టకేలకు వాయుసేన అమ్ములపొదికి చేరింది. కాలంచెల్లిన ‘మిగ్21’ యుద్ధవిమానాల స్థానంలో మోహరించేందుకు తేలికపాటి యుద్ధవిమానాలు ‘ఎల్‌సీఏ’ల తయారీని రక్షణ శాఖ 1983లో ప్రారంభించింది. ఇన్నాళ్లకు వారి ప్రయత్నాలు ఫలించాయి. రెండు దశాబ్దాల కాలంలో మొత్తం 15 వెర్షన్ల తేజస్ విమానాలు గాలిలోకి ఎగరగా.. ఇది చివరిదైన 16వ వెర్షన్‌కు చెందినది. ఇప్పటిదాకా తేజస్ విమానాలు 2,500 సార్లకుపైగా నింగికి ఎగిరాయి. అన్ని తేజస్ విమానాల్లోనూ ఉన్న ప్రధాన సాంకేతికతలను తేజస్ పీవీ-6లో పొందుపర్చారు. తేజస్ శిక్షణ విమానాలకు ఇదే తుది వెర్షన్ విమానం. దీనిలో ఆధునిక కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలు, ఈడబ్ల్యూ సెన్సర్లు, ఆటోమేటిక్ ల్యాండింగ్ కోసం కొత్త నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి.

తేజస్ అనే ఈ తేలికపాటి విమానాన్ని, నాల్గవ తరం సాంకేతికతలను ఉపయోగించి తయారుచేశారు
అన్ స్టేబుల్ ఏరోడైనమిక్స్ కలిగిన ఈ విమానాన్ని కార్బన్ ఫైబర్ కాంపోజిట్ (సి.ఎఫ్.సి) పదార్థాల నుండి రూపొందించారు
• ఇది పైలట్ యొక్క సులభమైన వినియోగం కోసం క్వాడ్రుప్లెక్స్ డిజిటల్ ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
• ఈ విమానం, ఆల్ రౌండ్ డయల్డ్ ఎలక్ట్రో మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను కలిగి అత్యాధునికమైన గ్లాస్ కాక్ పిట్ ను కలిగి ఉంది.
• తేజస్ అనే ఈ తేలికపాటి యుద్ధ విమానం, కోహెరెంట్ పల్స్ డాప్లర్ మల్టీ మోడ్ రాడార్ వ్యవస్థను మరియు ఓపెన్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్ (ఓఏసి) వ్యవస్థలను సమకూర్చుకుంది.

Tejas

అయితే ఇదే తేజస్ తన మొదటి రాకతోనే మన ప్రత్యర్థి దేశమైన పాక్ కు చిన్న పాటి దెబ్బవేసింది. ఎలానో తెలుసా..? శ్రీలంక తన వాయు,నావికాదళ సేనల కోసం పాక్ తయారు చేసిన థండర్ అనే యుద్ద విమానాలను కొనేందుకు ఒప్పందం పై చర్చలు మొదలుపెట్టింది. దాదాపు 100 థండర్ యుద్ద విమానాలను కొనేందుకు శ్రీలంక సదరు ప్రతిపాదన చేసిందట. అయితే ఈ మద్య న్యావీ డే సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన తేజస్ తేజస్సుకు కళ్ళు చెదిరిన శ్రీలంక ప్రభుత్వం. తన ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకుంది. దాంతో ఎన్నొ ఆశలు పెట్టుకున్న పాక్ ఆశల మీద నీళ్ళు చల్లినట్టయ్యింది. థండర్ ఎగరాలంటే 609 మీటర్ల రన్‌వే కావాల్సి ఉండగా తేజస్ కి 460 మీటర్ల రన్‌వే సరిపొద్ది అలాగే దిగడానికి 823 మీటర్ల రన్‌వే అవసరం కాగా తేజస్ కి 750 మీటర్ల రన్‌వే సరిపొతుంది. మామూలు విమానాల్లగే అల్యూమినియం, ఇనుము తో తయారీ కారణంగా థండర్ రాడార్ కి తేలిగ్గా దొరికిపోవటమే కాక బరువు కూడా తేజస్ కంటే చాలా ఎక్కువ. గ్లాస్ కాంపొనెంట్ కార్బన్ ఫైబర్ వాడినందుకు తేజస్ రాడార్ కి అంత తేలిగ్గా చిక్కదు. వేగం థండర్ వేగం 1960 కి మీ కాగా తేజస్ 2250 కి మీ నిట్ట నిటారుగా పైకి లేవడం లో ఇంధన పొదుపులో ఇలా ఏ రంగం లో చూసిన చాలా ముందు ఉంది మన తేజస్. అంతే కాదు ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ ధర విషయంలోనూ తేజస్ అనుకూలంగానే ఉంది. మార్కెట్ లో థండర్ ధర 200 కోట్లు అయితే తేజస్ ధర 180 కోట్లు మాత్రమే. చైనా ఇచ్చిన ప్రోద్బలంతో చైనాలోనే ఇంజిన్ లూ,సాంకేతిక పరికరాలు కొని తయారు చేసుకున్న తమ థండర్… తేజస్ కొట్టిన దెబ్బకి చతికిలబడటంతో బిక్క మొహం వేసారు పాక్ రక్షణ విభాగం అధికారులు…

Must Read: చరిత్ర మరుస్తున్న భారతీయ మహిళలు..!

(Visited 15,497 times, 110 visits today)