EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / పాము ని ప్రేమించి, పాము నే పెళ్ళాడిన అమ్మాయి !!

పాము ని ప్రేమించి, పాము నే పెళ్ళాడిన అమ్మాయి !!

Author:

అప్పట్లో 1980 నుండి 1990 మధ్య కాలంలో పాముల సినిమాలు తెగ వచ్చేవి. బాల నాగమ్మ, అఖండ సౌభాగ్యవతి మొదలైనవి అన్నీ… పాముల కథలే. పాముని పూజించడం, పాము మహిమలు, భక్తులని కాపాడే పాముల కథాంశాలతో ఉండేవి. కానీ, ఇలాంటి కథ ఏ సినిమాల్లో కూడా రాలేదు. అలాంటిలాంటి కథ కాదు, ఇది మామూలు ప్రేమ కాదు, అగ్ని లాంటి స్వచ్చమైన ప్రేమ, జన్మ జన్మల ప్రేమ అనుకున్న ఒక యువతి ఏకంగా పామునే ప్రేమించింది. ప్రేమించడమే కాదు పాముని లవ్ మారేజ్ కూడా చేసేసుకుంది.

girl who married a snake

ఒడిశాలోని ఖుర్ధా జిల్లాలోని అతాల్ అనే గ్రామానికి చెందినా బిమ్‌ బాలా అనే యువతి ఇంట్లో ఒక పాము పుట్ట ఉంది. పాముని భక్తీ తో కొలిచే ఆ ఇంటివారు ఆ పుట్టని తొలగించలేదు. ఆ పుట్టలో నివాసం ఉండే ఒక పాము రోజూ బయటకు వచ్చి బిమ్ బాలా పోసిన పాలు తాగేదట. ఎవరినీ ఏమీ అనకుండా ఇంట్లో మనిషిలా… సారీ ఇంట్లో పాములా ఇల్లంతా కలియ తిరిగేదట ఆ సర్పం. అంతేకాదు ఆ పాము బిమ్‌ బాలా ఒడిలో కాసేపు సేదతీరేదట. కాసేపాగి పుట్టలోకి వెళ్లిపోయేదట. అలా పాముతో నెమ్మదిగా ప్రేమలో పడిన బిమ్‌ బాలా తమది జన్మ జన్మల బంధమని భావించి, ఆ పామునే పెళ్ళాడాలని నిర్ణయించుకుంది. అయితే వీరి పెళ్ళికి ఎవరూ అడ్డు చెప్పకపోవడం విడ్డూరం. అంతేకాదు, ఇంట్లో వాళ్లు, గ్రామస్తులు కూడా ఈ పెళ్ళికి ఓకే చెప్పేశారు.

ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం. పాపం ఆ పాము కూడా ఎప్పుడూ ఎవరినీ కరవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పాము కూడా ఆమెను ప్రేమిస్తోంది కాబట్టే… అని అందరూ కలిసి పెళ్లి బాజాలు మోగించడానికి రెడీ అయ్యారు. పాముతో పెళ్ళికి ముహూర్తం పెట్టేసారు. కానీ పాపం కరెక్టుగా ముహూర్త సమయానికి వరుడు పాము పుట్టలోంచి బయటకు రాకపోవడంతో పాము బొమ్మతో పెళ్లి కానిచ్చేశారు. పురోహితుల వేదమంత్రాల నడుమ పాముగారి పెళ్లి సందడి మహా వైభవంగా జరిగింది. ఈ విచిత్ర వివాహానికి 1500 మంది అతిథులు కూడా హాజరయ్యారట. ఇదే మరి వినాశకాలే విపరీత బుద్ది అంటే.. పాముని చూసి కస్సుబుస్సు లాడేవారిని చూశాం కానీ, కిస్సు బుస్సు లాడడమంటే ఇదే మరి.

Comments

comments