Home / Inspiring Stories / దయచేసి నోట్లపై రాతలొద్దన్న ఆర్‌బిఐ గవర్నర్‌.

దయచేసి నోట్లపై రాతలొద్దన్న ఆర్‌బిఐ గవర్నర్‌.

Author:

indian Currency

మన కరెన్సీ నోట్లపై తెల్లగా ఉండే ప్రాంతాన్ని వాటర్ మార్క్ విండో అంటారు ఆ ప్రాంతంలో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో రాయటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నిజమైన నోట్లను గుర్తించేందుకు ముద్రిస్తున్న సెక్యూరిటీ చిహ్నం కనిపించకుండా పోతుంది, అంతే కాకుండా నిజమైన నోట్ల గుర్తింపునకు ఇలాంటి రాతలు ఆటంకాలుగా తయారౌతాయి. ‘వాటర్‌మార్క్ ప్రాంతంలో కొందరు నంబర్లు వేస్తుంటారు,సంతకాలు వేస్తూంటారు,కొందరు దేవుడి పేర్లు రాసి మత ప్రచారం చేస్తూంటారు.ఇలా చేయటం వల్ల ఒక్కొక్క నోటూ తన జీవితకాలన్ని కోల్పోతుంది. కరెన్సీ నోట్ల తయారీకి వాడే పేపరూ,ఇంకూ చాలా ఖరీదైనవి కావటంతో మరింత ఇబ్బంది. అందుకే అక్కడ ఎటువంటి రాతలూ ఉండవద్దని చెబుతారు..

ఐతే ఈ నేపథ్యం లో కొన్ని పుకార్లు ఫేస్ బుక్,వాట్సాప్ లో కనిపించాయి. నోట్లపై రాతలూ, పెన్ తో పెట్టిన మార్కులూ ఉన్న నోట్లను ఈ జనవరి నుంచీ ఆర్బీఐ రద్దు చేస్తోందనీ అలాంటి నోట్లను తీసుకోవద్దనీ, ఉన్న వాటిని త్వరగా బ్యాంకుల్లో మార్చుకోవాలనీ కొన్ని మెసేజ్ లూ పోస్టులతో ప్రజలు తికమక పడుతున్నారు. ఐతే అల వచ్చే గాలి వార్తలు నమ్మవద్దని,అటువంటి నోట్లు చక్కగా చెల్లుతాయనీ ఆందోళనలు అనవసరం అనీ చెబుతూ ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మంగళవారం ఒక వాయిస్‌ మెసెజ్‌ను విడుదల చేశారు. తాము విడుదల చేసే ప్రతినోటు పైనా ఎలాంటి రాతలు ఉన్నా చెలామణికి చట్టబద్ధంగా ఎటువంటి అడ్దంకీ ఉండదనీ.ఐతే మరీ ఎక్కువ ఇంకు,ఇతర పదార్థాల మరకలతో వికారంగా మారిన నోట్లను చెలామణి ప్రక్రియ నుంచి వెనక్కి తీసుకోవాలని గతంలో ఆర్‌బిఐ ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఇందులో భాగంగా వాటిని సేకరించటమే కాకుండా వాటి స్థానం లో శుభ్రమైన నోట్లను వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేగానీ పెన్నురాతలు, ఛాయ మార్కులు ఉన్న నోట్లు చెల్లవని చెప్పినట్టు కాదనీ. ప్రజలు, వ్యాపారస్తులు, బ్యాంకు సిబ్బంది ఇతర నగదు చెలామణి కార్యక్రమాల్లో పని చేసే సిబ్బంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని రాజన్‌ కోరారు.

Raghuram Rajan Rbi Governer

ఇలాంటి కల్పిత వార్తలు సరైనవి కావని ఆయన వివరించారు.నిజానికి అటువంటి నిర్ణయం ఏం తీసుకున్నా ప్రభుత్వమూ,ఆర్బీఐ సంయుక్త ప్రకటనలో తెలుపుతాయి కాబట్టి అనదికారికంగా వచ్చె పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని చెబుతూ, వచ్చే జనవరి నుంచి రాతలు ఉన్న నోట్లు చెల్లవంటూ ఆర్‌బీఐ ఒక కమ్యూనికేషన్‌ను విడుదల చేసినట్లు వచ్చిన వార్తలను రాజన్‌ పూర్తిగా ఖండించారు. శుభ్రమైన కరెన్సీ నోట్ల విధానంలో భాగంగా దయచేసి ఎవ్వరూ నోట్లపై రాతలు రాయకూడదని ఆయన మరోమారు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ఆ కరెన్సీ నోటు లైఫ్ టైం తగ్గిపోయి త్వరగా మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేయవలసి వస్తూన్నదనీ ఆయన తెలిపారు.

(Visited 182 times, 12 visits today)