Home / Inspiring Stories / ఇంట్లోనే కరెంట్ తయారు చేసుకోండి.

ఇంట్లోనే కరెంట్ తయారు చేసుకోండి.

Author:

innovative plan to offer free electricity in India

విద్యుత్‌ కొరతతో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వినియోగ అవసరాలకు తీవ్ర అవాంతరం ఏర్పడుతోంది. విద్యుత్‌కు ఏర్పడిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం వల్ల కుటుంబాలనుంచి పరిశ్రమల వరకూ ఊహించని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇప్పటికే పరిశ్రమలు 60 శాతం విద్యుత్‌ కోతను భరిస్తున్నాయి. విద్యుత్‌ కోతల వల్ల చిన్న పరిశ్రమలు మూతపడుతుండగా, పెద్ద పరిశ్రమలు ఉత్పత్తి కార్యక్రమాలకు భారీ స్థాయిలో అవాంతరాలు ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కోతల గురించి చెప్పనక్కర లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. పట్టణ, నగర ప్రాంతాలలో తీవ్రస్థాయి విద్యుత్‌ కోతలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.వీటికి చెక్‌ పెట్టాలంటే..? ముడి నిల్వలని ఆదాచేసుకోవాలంటే ఉన్న మార్గం సోలార్ పవర్ మాత్రమే అనుకుంటున్న తరుణం లో గృహావసరాల నిమిత్తం మరిన్ని ప్రత్యామ్న్యాయాలూ ఆవిష్కరించ బడుతున్నాయి.గాలి శక్తితో పని చేసే గాలిమర పద్దతినే కొన్ని చిన్న మార్పులతో ఒక విద్యుతుత్పాదక యంత్రాన్ని తయారు చేసారు…. దీని మెకానిజం అంటా దాదాపు మనం చిన్నప్పుడు చూసిన సైకిల్ కి అమర్చే డైనమో వంటిదే కానీ ఈ యంత్రం లో కరెంట్ ని స్టోర్ చేసుకునే బ్యాటరీ సదుపాయం కూడా ఉంది…. అదేమితో ఒక సారి చూడండి మరీ…

innovative plan to offer free electricity in India

నిత్యావసరాల్లో మనకు కావాల్సిన వాటిల్లో మొదటి మూడింటిలో వచ్చేది కరెంట్. భవిశ్యత్తులో వచ్చే మొదటి సంక్షోబం విద్యుత్ కొరత వల్లే అనేది కూడా మన అంచనాలకందని విశయమేం కాదు. ఇదంతా పక్కన పెడితే సామాన్యుడికి భారంగా మారిన వాటిల్లో విద్యుత్ బిల్లు కూడా ఒకటి. దీనికి పరిష్కారం కంగొనే దిశగా ఓక ఆవిశ్కారం జరిగింది. అమెరికాలోని కోటీశ్వరుల్లో ఒకరైన మనోజ్ భార్గవ. విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సైకిల్‌ను ఇండియాలో ఆవిష్కరించారు. అతి తక్కువ విద్యుత్ వినిమయ గ్రామాల్లో ఈ సైకిల్ ఉపయోగకరంగా ఉండబోతోంది. స్టేషనరీ బైస్కిల్‌లో ఉన్న పైడిళ్లను తొక్కడం ద్వారా దీనికి అనుసంధానంగా ఉన్న బ్యాటరీలో విద్యుత్ స్టోరేజ్ ఔతుంది. ఈ సైకిల్ పెడల్స్ తొక్కిన సమయంలో చక్రాలు తిరిగి కరెంటు జనరేట్ అవుతుంది. జనించిన కరెంట్ సైకిల్ కు అనుసంధానించిన బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఈ సైకిల్ ను గంట సేపు తొక్కటం ద్వారా ఒకరోజుకు అవసరమైన విద్యుత్ అవసరాలను తీర్చుకోవచ్చని మనోజ్ భార్గవ అంటున్నారు. ఎలాంటి ఇంధన వ్యయం అక్కర్లేకుండా ఉత్పత్తి కాబడే ఈ కరెంటు ద్వారా లైట్లు, ఓ చిన్న ఫ్యాన్, సెల్‌ఫోన్ ఛార్జింగ్ వంటి అవసరాలను తీర్చుకోవచ్చు.

innovative plan to offer free electricity in India

అయితే దీని గురించి ఏడాది క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించానని భార్గవ తెలిపారు. అయితే ప్రభుత్వ సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు మాత్రం ఆయన అంతగా ఉత్సాహం కనబరచలేదు. కాగా, వచ్చే ఏడాది మార్కెట్‌లో అందుబాటులో ఉండే దీని ధర 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఉండొచ్చట. ఈ రకం ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల మంది వినియోగిస్తున్నారన్న భార్గవ.. భారత్‌లో తొలుత దీన్ని ఉత్తరాఖండ్‌కు పరిచయం చేస్తామన్నారు. అది మిగులు విద్యుత్ రాష్టమ్రే అయినప్పటికీ గ్రామీణ ప్రజలు విద్యుత్ కష్టాలను అనుభవిస్తున్న కారణంగా మొదటగా అక్కడినించే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ తరహా సైకిళ్లు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వాలు మరింత చొరవ చూపించాల్సిన అవసరం ఉంది, అప్పుడే విద్యుత్‌పై కర్చూ, విద్యుత్ వృదా రెండూ తగ్గుతాయి.

(Visited 379 times, 186 visits today)