EDITION English తెలుగు
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.   జల్లికట్టు, కోడిపందాల పై నిషేదం సమంజసమేనా?   'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా చూసేందుకు ఈరోజు పోలీసులకు సెలవు   ప్రేమికుడిపై యాసిడ్, కత్తితో దాడి చేసిన అమ్మాయి.   గత 34 సంవత్సరాల నుండి రైల్వే స్టేషన్స్ లలో మనకి వినిపించే గొంతు ఈమెదే...!   ఆ ఊరిలో చలికాలం ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు ఉంటుంది.   ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలా..? మాకు ఫోన్ చేయండి..! మా సేవలన్నీ ఉచితమే..!   సాంకేతికతను దొంగిలించిన కేసులో కోర్ట్ కి హాజరుకానున్న జుకర్ బర్గ్.   గర్భిణీ మహిళలకు రూ.15 వేలు, బేబీ కిట్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం.   ఎండు ద్రాక్షల డ్రింక్ ను ఇలా త్రాగితే లివర్ క్లీన్.. ఇది అద్భుతంగా పని చేస్తుంది
Home / Inspiring Stories / 500రోజుల్లో 108 కిలోల బరువు తగ్గిన అనంత్ అంబానీ ఎలా సాధ్యం?

500రోజుల్లో 108 కిలోల బరువు తగ్గిన అనంత్ అంబానీ ఎలా సాధ్యం?

Author:

అనంత్ అంబానీని ఇటీవల చూసిన వారెవ్వరైనా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే గతంలో అధిక బరువుతో కొండలా కనిపించే ఆయన.. ఇప్పుడు ఎంతో సన్నబడి స్మార్ట్‌గా కనిపించడమే కారణం. ఇంత మార్పు ఎలా సాధ్యమైందబ్బ అని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా తమ ముంబై జట్టుతో సందడి చేసిన అనంత్ … భారీ కాయంతో దర్శనమిచ్చాడు. అయితే ఇప్పుడు ఏకంగా, 180 కేజీల బరువున్న అతడు కేవలం 18 నెలల్లో బాగా కష్టపడి 108 కేజీల తగ్గిపోయి .. చక్కగా స్లిమ్ గా తయారయ్యాడు.

inspiring-stories-anant-amnabi-weight-loss-500days-108kgs

కాగా, అతడు సన్నబడేందుకు చాలా వరకు సహజ మార్గాలనే అనుసరించాడు.అమెరికాకు చెందిన నిపుణులైన ట్రైనర్స్ సహాయంతో అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గాడు. అంటే నెలకు దాదాపుగా 6 కిలోల బరువు తగ్గాడన్నమాట. అయితే బరువు తగ్గేందు కోసం ముందుగా అనంత్ రోజూ దాదాపు 21 కిలోమీటర్ల పాటు వాకింగ్ చేశాడట. జామ్‌నగర్‌లోని రిలయన్స్ కంపెనీకి చెందిన రిఫైనరీలో ఉన్న తోటలో అతను రోజూ వాకింగ్‌కు వెళ్లేవాడట.వాకింగ్ చేస్తూ మధ్య మధ్యలో యోగా, హై ఇంటెన్సిటీ కార్డియో వర్కవుట్ (గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం), వెయిట్ ట్రెయినింగ్ వంటివి చేసే వాడు. ఇదంతా చేసేందుకు అనంత్‌కు రోజూ దాదాపు 5, 6 గంటల సమయం పట్టేది.

inspiring-stories-anant-amnabi-weight-loss-500days-108kgs

ఆరంభంలో దాదాపు 3 నెలల పాటు అతను అంతగా బరువు తగ్గలేదు. కానీ ఆ తరువాత అతని దేహంలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి. రోజూ కచ్చితమైన నియమాలను పాటిస్తుండడంతో అతని శరీరం నుంచి కొవ్వు కరగడం ప్రారంభమైంది.

inspiring-stories-anant-amnabi-weight-loss-500days-108kgs

అనంత్ ఇలా మారడం కోసం అతడి తల్లి నీతా అంబానీ అన్ని దగ్గర ఉండి చూసుకున్నారట. అనంత్ చిన్నతంలో ఆస్తమాతో బాధపడేవాడు. ఆ సమయంలో వాడిన మందుల వల్ల భారీ స్థూలకాయం వచ్చిందని తెలిసింది. ఇదే రీతిలో ఉంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో తన బరువును భారీగా తగ్గించుకున్నాడు. జంతు ప్రేమికుడైన అనంత్ ప్రస్తుతం యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. కాగా, ఐపిఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మరోసారి అనంత్ తన స్లిమ్ లుక్‌లో స్టేడియంలో సందడి చేసే అవకాశం లేకపోలేదు.

Comments

comments