Home / Inspiring Stories / ఐదు సార్లు ఎమ్మేల్యేగా గెలిచినా ఒక్కపైసా తనకోసం ఖర్చు చేయలేదు.

ఐదు సార్లు ఎమ్మేల్యేగా గెలిచినా ఒక్కపైసా తనకోసం ఖర్చు చేయలేదు.

Author:

ప్రస్తుత సమాజంలో రాజకీయాలంటేనే ఏహ్యభావం కలిగేలా ప్రవర్తిస్తున్నారు మన చేతే ఎన్నుకోబడ్డ నాయకులు. ప్రజా సేవ పేరుతో ఫుల్లుగా దండుకునే అడ్డగోలు వ్యాపరమేది అంటే ఇంకేం రాజకీయాలే అని టక్కున సమాధానం చెప్పే రోజులివి. కాని ఇంత అస్తవ్యస్త అవినీతి రాజకీయ చదరంగంలో కూడా అప్పుడప్పుడు ఒకరో ఇద్దరో మహానుభావులు వస్తుంటారు. అసలు సిసలు ప్రజాసేవ అంటే ఏంటో గుర్తు చేస్తుంటారు. అలాంటి సాదా సీదా రాజకీయ నాయకుడిని చూడాలంటే మనం కొత్తగూడెం దగ్గర ఇల్లందుకు వెళ్ళాల్సిందే.

gummadi narsaiah

ఇల్లందుకు గనక మీరెల్లారే అనుకుందాం. మీతో పాటు ఆర్టీసి బస్లోనో, ఏ చాయ్ బండి దగ్గరో మీతో పాటు సామాన్యుడిలా కలిసిపోయే ఉంటాడు అక్కడి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు. కానీ ప్రజా సేవే తప్ప ఇంకేం తెలియదు అతనికి. ఇప్పటికి ఊర్లో తన సైకిల్ మీదే తిరుగుతాడు. ఎవరికీ ఏ ఆపద వచ్చిన తన చేతనయిన సాయం చేస్తాడు. అంతెందుకు బస్టాప్ లో ఎవరైనా తెలియక జరగమన్నా కూడా, జరిగి దారిచ్చి అవసరమైతే సాయం చేసే నిండు మనసున్న వ్యక్తి ఈ గుమ్మడి నర్సయ్య. జస్ట్ వార్డ్ కౌన్సిలర్సే అడ్డగోలు సంపాదనతో, అవినీతి భూబాగోతాలతో, అధికార దర్పంతో ప్రజలను కనీసం పట్టించుకోకుండా రాజకియ దర్పం వెలగబెడుతున్న ఈ నయవంచక సమాజం లో గుమ్మడి నర్సయ్య లాంటోల్లు నిజంగా ఆదర్శప్రాయులు. ఇప్పటికి ఈయన కుటుంబ తో సహా ఆర్టీసి బస్సులోనే ప్రయాణం చేస్తరు, ఆయన పిల్లలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు అంతే కాకా తన కుటుంబ ఆస్తిగా సంక్రమించిన భూమిలో ఆయనే స్వయంగా వ్యవసాయం చేస్తారు. ఇలాంటి నాయకులు ఉన్నంత కాలాం మన దేశ రాజకీయాల మీద కూడా అంతో ఇంతో నమ్మకం పెరుగుతుంది.. హాట్స్ ఆఫ్ గుమ్మడి నర్సయ్య గారూ..

Comments

comments