Home / సాహిత్యం / ఊహించి రాయటం నాకింకా పట్టుబడలేదేమో..!

ఊహించి రాయటం నాకింకా పట్టుబడలేదేమో..!

Author:

 

Shila Lolitha

ఋతువు
మనం ఉన్న చోటే ఉంటాం
కూచుంటే కూచునే ఉంటాం
నిలబడితే నిలబడే ఉంటాం
మోసుకెళ్లే వాహనం ప్రయానిస్తూనే ఉంటుంది
రోడ్డు పరుగెడుతూనే ఉంటుంది
చెట్లు కంగారు కంగారుగా వెనక్కెళుతున్నట్టా!
కదుల్తాయన్నవేవీ నిజానికి కదలటం లేదు
పరిగెట్టడమూ అబద్దమే
మనిషి చలనమూ నిజం కాదు
కాలమొక్కటే కదిలి వెళ్ళిపోతోంది
మనిషి ఋతువులా మరలిపోతున్నాడు… -“గాజునది” నుండి…
గాజునది” కవితా సంపుటి కి గుంటూరు రచయితల సంఘం సాహిత్య పురస్కారం గుంటూరులో జరగబోతోంది. శిలాలోలిత గారు ఈ అవార్డు అందుకోబోతున్నారు.. ఈ సందర్బంగా కవయిత్రి శిలాలోలిత గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ….. కొన్ని ప్రశనలు మాత్రమే అడిగాం కానీ…. సమాధానాలు చాలానే పొందాం మీకోసం…. ఈ ఇంటర్వ్యూ…

shila1

 

*మొదటి కవిత ఎప్పుడు రాసారు?
1985 లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా మొదటి కవిత “జీవితం” జ్యోతి లో అచ్చయ్యింది.బహుశా అప్పటివరకూ రాసుకున్న వాటికంటే అదే మొదటి కవితేమో అనిపిస్తుంది.

*మీ కవితలు చాలా వరకు ప్లెయిన్ గా… చాలా మామూలు పదాలతో ఉంటాయని అంటారు కొందరు అదీ…
హ..! అనిపించవచ్చు, చిన్నప్పుడు మాకున్న ఏకైక ప్రసార మాధ్యమం రేడియో అందులో వినిపించే ఉగాదికవితలు వినేవాళ్ళం కవిత అంటే చక్కని పదాలతోనూ,ప్రాసలతోనూ ఉండాలి అనుకున్నరోజులవి ఐతే పుస్తక పఠనం వల్ల ప్రాసలూ,భాష,పెద్ద పదాలు ఇలా కవిత్వానికి అలంకరణలు చేయటం అవసరం లేదని అర్థమైంది.చక్కటిపదాలు కవితకు అవసరమే కానీ స్త్రీ సమస్యలపై రాసే నేను కవిత ద్వారా చెప్పాల్సిన “విశయం” పాఠకులకు చేరటం ముఖ్యం అనుకుంటాను,అలా అని లోతైన పదాలు వాడటం సరికాదని కాదు పదాల తో కవిత లో కవి యొక్క ఉద్దేశం కనిపించాలి..అది పాటకున్ని ఆ సందర్భం తోనూ,ఆ ఫీల్ తోనూ కనెక్ట్ చెయాలి ఒక కవితలో ఉండాల్సిన,ఆవిష్కరించబడాల్సిన ఆత్మే లేనప్పుడు అక్షరాలతో ఎంత అలకరించినా జీవం లేని బొమ్మకీ చైతన్యం తో ఉండే మనిషికీ తేడా తెలిసి పోతుంది.. అందుకే నేను విషయం మీద తప్ప అలంకరణల జోలికి వెళ్ళి కవిత్వాన్ని కాంప్లికేట్ చేయను అందుకే ఆ ప్లయిన్నెస్ అనిపిస్తూండవచ్చు.

*మీ కవితల్లో,వ్యాసాల్లో ఎక్కువశాతం నిజ జీవితాలని చూపించేవే ప్రయత్నమే తప్ప ప్రకృతీ,సౌందర్యం వంటి రెగ్యులర్ గా కవులు టచ్ చేసే విశయాలని వదిలేసారెందుకని?

హ్మ్..! కొన్ని సార్లు ఊహ చేయటమూ కష్టమే..! మనకు తెలిసింది రాయగలం తప్ప..లేని దాన్ని ఊహించి రాయటం నాకింకా పట్టుబడలేదేమో(నవ్వుతూ). ఒక స్త్రీగా ఇంతమంది సాటి స్త్రీల బాదలని చూస్తూ… నవ్వుల ఏరూ,పువ్వుల వర్శం,వెన్నెల రాత్రులూ అంటూ ఎలా రాయగలను అనిపిస్తుంది. కవిత్వం కర్మాగారం లో తయరు చేసే ఒక బొమ్మ కాదుకదా నా సొంత మిథ్యా ఊహలని రాసి పాఠకుల మీద రుద్దటం సబబు కాదనిపిస్తుంది. ఐతే చదవటానికి మాత్రం నాకు ఇలా ఉండాలన్న నియమాలేం లేవు ఎటువంటి కవిత్వమైనా చదవటం నాకు ఇస్టం..

*ప్రపంచం లో ఇప్పుడు స్త్రీ కి ఇదివరకు ఉన్నన్ని భాదలు లేవూ,ఎన్నొ రంగాలలో స్త్రీలు పురుషులతో సమానం గా ఎదుగుతున్నారు ఇప్పుడు ఫెమినిజం అనేది అవసరమా? అనే ప్రశ్నలు వినిపిస్తూంటాయ్ కదా ఇలాంటివి విన్నప్పుడు మీరేమనుకుంటారు? స్త్రీ వాద కవిత్వం అనేది నిజంగా అవసరం అంటారా..?
స్త్రీలు అన్ని రంగాలలోనూ ఎదుగుతున్నారు ఇది కొంతవరకూ నిజమే కానీ..! ఇప్పటికీ ఉద్యోగాలు చేసే స్ట్రీలలో ఎంతమంది ఆర్థిక స్వావలంబన కలిగి ఉన్నారు? ఎంతమంది ఇంట్లో పనులు కూడా చేస్తూనే ఉధ్యోగాలనూ చేస్తున్నారు? పల్లెల్లో కూలీ చేస్తూ కూడా ఇంట్లో సరైన గౌరవం పొందుతున్నారు అనేవి చూసినప్పుడు… సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఒక చిన్న విశయం ఒకప్పుడు సిటీ బస్సుల్లో సాధారణం గా కనిపించే వాక్యం ఒకటుండేది”స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం”… చూడండి వారికి కేటాయించిన సీట్లు అవి వారి హక్కు అది కానీ “కూర్చోనిద్దాం” అంటూ రాసిన వారికి అంత తప్పేముందీ అనిపిచవచ్చుకానీ ఒక హక్కుగా “వారిని కూర్చోనివ్వండి” అనకుండా ఏదో జాలితో పోనీలే అన్నట్టుగా ఉండే ఆమాట స్త్రీకి మాత్రమే అర్థమౌతుంది. ఇక ఫెమినిజం అవసరమా..? అంటే ఒక్క సారి రోజూ పేపర్ చూడండి “స్త్రీ పై మానసికంగా,శారీరకంగా జరిగే దాడి” వార్త లేని రోజు లేదు ఇక మహిళా చైతన్య కార్యక్రమాలు ఉండాలో వద్దో నేను ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం ఏముంది? స్త్రీవాద కవిత్వమో,సాహిత్యమో రాకుండా ఉండాల్సినంత గా ఇంకా స్త్రీ ఎదగలేదు. ఇక అలాంటి మాటలు విన్నప్పుడు కోపం కాదు కానీ భాద కలుగుతుంది. కార్పోరేట్ రంగాలలో ఉన్న స్త్రీలని పైపైన చూసినప్పుడు కలిగే భావమే తప్ప నిజంగా స్త్రీల కోణం లో ఆలోచిస్తే వారలా మాట్లాడరు…

*కవిత్వం కాకుండా ఇంకేవైనా రాసిన రాస్తున్నవి ఏమైనా ఉన్నయా? సమయాన్ని ఎలా సర్దు బాటు చేసుకుంటున్నారు.?
అదృష్టవశాత్తూ కవిత్వం రాయటం అనేది నాకు తప్పని సరి డ్యూటీ కాలేదు. మరీ కదిలించిన విశయమ్మీద తప్ప ఇది రాయాలి అనుకొని కవిత్వం రాయలేను, ఇక మిగిలిన వాటి విషయానికి వస్తే .. భూమిక అనే మాస పత్రికలో లేఖా సాహిత్యం పేరుతో ఒక కాలం నిర్వహిస్తున్నాను, స్త్రీల సమస్యలనూ,సాహిత్య విశయాలనూ లేఖ లో చెబుతున్నట్టు గా చర్చించే కాలం ఇది.. ఇక కవిత్వం కాకుండా అంటే వ్యాసాలు చాలానే ఉన్నయి…
విశాలాక్షి పత్రిక లోనూ “మరోపుట” పేరుతో సమకాలీన స్త్రీల సమస్యలమీదా,చైతన్యం మీదా చర్చించే కాలం అది.
చైతన్య మానవి లోనూ అవగాహనా సందర్భం అనే మరో శీర్షిక నీ నిర్వహిస్తున్నాను..

ఇప్పటివరకూ అచ్చులో వచ్చిన పుస్తకాలూ,అవార్డుల గురించి చెప్తారా…
* కవిత్వం మొత్తం మూడు సంపుటాలుగా ప్రచురించబడింది. పంజరాన్ని నేనే ,పక్షినీ నేనే ! – 1999 లొనూ ఎంతెంత దూరం – 2005 లోనూ చివరగా 2013 లో గాజునది వచ్చాయి. ఇక వచనం లోకి వస్తే మూడు విమర్శా గ్రంధాలు కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు 1993లోనూ , కవయిత్రుల కవితా మార్గం 2006 లో నారి సారించి [ విమర్శా వ్యాసాలు ] 2006 లోనూ వచ్చాయి…

*అవార్డుల విషయం చెప్పనేలేదు…
(నవ్వుతూ) నిజానికి నేను చెప్పుకోవాలో వద్దో తెలియని స్థితి.. ఎందుకంటే మహిళా చైతన్యం కోరుకుంటూ చేసిన ప్రయత్నం లో భాగంగా వచ్చినవి.. నా స్వంతం అనుకోలేను నాతో ఉన్న మహిళలందరి ఉమ్మడి గా వచ్చినవే అనిపిస్తుంది…
1980నుంచీ1990 మధ్యకాలం లో వచ్చిన స్త్రీల కవిత్వం మీద రాసిన థీసిస్ బెస్ట్ థీసిస్ గా ఎన్నికైంది, తెలుగు యూనివర్సిటీ ఇచ్చిన రంగనాయకమ్మ అవార్డూ,రమ్య సాహితీ అవార్డూ,హృదయ భారతీ అవార్డూ… ఇలా మరికొన్ని.

*ఇదే ఇక చివరి ప్రశ్న స్త్రీ ల విశయం లో మీరు సాధించాలనుకునేది ఏమిటి ఒక్క వాక్యం లో చెప్పాగలరా..?
విమానం నడిపే అమ్మాయీ,పొలం గట్టు మీద కొడవలితో నడిచే అమ్మాయీ ఒకేరకమైన గౌరవాన్ని పొందే రోజు.. ఆడా,మగా మధ్య ఈక్వాలిటీ…

(Visited 366 times, 100 visits today)