Home / Inspiring Stories / ఇక భారత దేశం లో జీపీఎస్ స్థానం లో ఐ ఆర్ ఎస్ ఎస్.

ఇక భారత దేశం లో జీపీఎస్ స్థానం లో ఐ ఆర్ ఎస్ ఎస్.

Author:

isro1

జీపీఎస్  ప్రపంచ మార్గదర్శిగా పేరుగాంచిన ఆధునిక అవిష్కారం. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దారి తెలియదు అన్న భాద లేదు,ఎలా వెళ్ళాలి అన్న టెన్షన్ అస్సలు లేదు. మ్యాపింగ్‌ ద్వారా మీరు చేరాల్సిన గమ్యాన్ని అదే చూపిస్తుంది. ఏ మలుపు ఎక్కడ తిరగాలో కూడా చెప్తుంది. అమెరికాకు చెందిన ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌లో ఉపగ్రహాలు మొత్తం భూమిని కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా అందించే సమాచారాన్ని మనకు అందుబాటులోకి తెస్తాయి. మన్ ఊరిలో మనకు ఒక వీధికి ఎలా వెళ్ళాలో అమెరికావారి ఉపగ్రహం చెబుతుందన్న మాట. ఐతే ఇప్పుడు ఏ భారతీయుడికీ అమెరికా సాయం అవసరం లేదు తనదేశ సొంత సిస్టంతోనే జీపీఎస్ స్థాయి సేవలని పొందబోతున్నాడు..

isro 2

 

ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ ను ఉపయోగించి. జీపీఎస్‌ను భర్తీ చేసేలా ఈ కొత్త విధానం వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి వచ్చేలా పనులు నిర్వహిస్తున్నారు, పూర్తిగా భారత ప్రభుత్వం నియంత్రణలో పనిచేసే ఈ కొత్త ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ( Regional Navigation Satellite System-IRNSS) దేశంలోని యూజర్లకు సరైన సమాచారాన్ని, స్థానాన్ని అందించేందుకు ఇస్రో అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే… సిగ్నల్స్ మరింత మెరుగ్గానూ, కచ్చితంగానూ ఉంటాయని ఇస్రో అధికారులు భావిస్తున్నారు. విదేశీ ప్రభుత్వ నియంత్రణలో ఉండే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్… అన్ని పరిస్థితుల్లోనూ మనకు సేవలు అందిస్తుందన్న హామీ లేకపోవడంతో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అవసరమౌతుందని భావిస్తున్నారు. రెండు విధాలుగా సేవలు అందించే ఐఆర్ఎన్ఎస్ఎస్ లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ (sps). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్ (RS). మిలట్రీ సహా కొంతమంది ప్రముఖ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

mobile_gps

దీనిలో గర్వించదగిన విశయం ఏమిటంటే భారత రక్షణ వ్యవస్త ఇక ముందు వేరే వారి జోక్యం లేకుండానే తన భాద్యతలను నిర్వర్తించగలదు ఈ కొత్త విధానంతో మన దేశవాళీ పరిఙ్ఞానం తోనే విపత్తుల సమయంలో, వాహనాల ట్రాకింగ్ లో, నౌకా నిర్వహణ లతో సహా మన చేతుల్లోని మొబైల్ ఫోన్లతో అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులకు కావలసిన లింకులు, వాహనాలు నడిపేవారికి విజువల్, వాయిస్ నేవిగేషన్లతో పాటు మరిన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ సిస్టం కోసం కావాల్సిన మొత్తం ఏడు ఉపగ్రహాలలో ఇప్పటికే నాలుగు ఉపగ్రహాలు కక్ష్యలో ఉండగా మిగిలిన మూడింటిని వచ్చే ఏడు జనవరి, మార్చి మధ్య స్థాపించేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న అమెరికన్ ప్రొవైడింగ్ జీపీఎస్ దేశం లోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా ఉండటంతో తాము మన దేశానికి మాత్రమే పరిమితమైన ఒక సొంత సిగ్నల్‌తో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నామని ఇస్రో అధికారులు చెబుతున్నారు.

(Visited 1,262 times, 31 visits today)