EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Inspiring Stories / పాడిరైతులు నెలకి రూ.50 వేలు సంపాదించేలా చేసిన ఐటీ ఉద్యోగులు.

పాడిరైతులు నెలకి రూ.50 వేలు సంపాదించేలా చేసిన ఐటీ ఉద్యోగులు.

Author:

కర్ణాటకలో పుట్టి పెరిగిన శశికుమార్ అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యని అభ్యసించి అమెరికాలోనే ఐటీ జాబ్ చేసేవాడు, కొంతకాలం జాబ్ చేసిన తరువాత మాతృభూమికి ఏదైనా చేయాలనే సంకల్పంతో జాబ్ ని వదిలేసి ఇండియాకి వచ్చేసాడు, కర్ణాటకలో హాసన్ జిల్లా కోదిహల్లి గ్రామంలో ఒక డైరీ ఫాంని పెట్టాడు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని రైతులకి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో వారిని సరికొత్త డైరీ పద్ధతులని వారికి నేర్పించాడు, శశికుమార్ కి డైరీ ఏర్పాటులో అతని స్నేహితులు కూడా సహకరించారు, కానీ ఆ డైరీని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడల్సి వచ్చింది, దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఆ డైరీని ఏర్పాటు చేసారు.

పాడి రైతుల‌కు నెలకు రూ.48వేల ఆదాయం వ‌చ్చేలా చేస్తున్నారు ఆ ఐటీ ఉద్యోగులు..!

మొదట్లో ఫాం నిర్మాణం కోసం అనుమ‌తులు ఇచ్చేందుకు అధికారులు స‌సేమిరా అన్నారు. విద్యుత్‌, స్థలం, పంచాయ‌తీ అనుమ‌తి త‌దిత‌ర ప‌త్రాల కోసం సంబంధిత శాఖ‌ల అధికారులు శ‌శిని లంచం అడిగారు. అయితే వారు స్వ‌త‌హాగా గాంధీజీ సిద్ధాంతాల‌ను పాటించేవారు. దీంతో శ‌శి, అత‌ని స్నేహితులు ఎవ‌రూ లంచం ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. నిజాయితీగా డెయిరీ ఫాం కోసం య‌త్నించారు. అందుకు వారు ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు. ఓ ద‌శ‌లో ప్ర‌భుత్వ అధికారుల‌కు చెందిన గూండాలు వారిని బెదిరించారు కూడా. అయినా వారు లొంగ‌లేదు. చివ‌ర‌కు అక్ష‌య‌క‌ల్ప ఫాంను వారు ప్రారంభించారు. దీంతో హ‌స‌న్ జిల్లా ప‌రిధిలో ఉన్న ప‌లు గ్రామాల‌కు చెందిన పాడి రైతుల‌కు ఎంత‌గానో ల‌బ్ది చేకూరుతోంది. వారి బతుకుల్లో వెలుగు నింపుతుంది.

పాడి రైతుల‌కు నెలకు రూ.48వేల ఆదాయం వ‌చ్చేలా చేస్తున్నారు ఆ ఐటీ ఉద్యోగులు..!

ఇప్పుడు ఆ ప్రాంతాల్లో దాదాపు 160 మంది రైతులు సేంద్రియ పద్దతులతో గేదెలని పెంచుతూ అక్షయకల్పకి పాలని సరఫరా చేస్తున్నారు, అక్షయకల్ప ఆ రైతులకి లీటర్ కి రూ.32 రూపాయలని చెల్లిస్తుంది, ఒక రైతు రోజుకు 60 లీట‌ర్ల చొప్పున నెలకి 1800 లీటర్ల పాల‌ను అక్ష‌య‌క‌ల్ప డెయిరీ ఫాంకు స‌ప్లై చేస్తే వారికి లీట‌ర్‌కు రూ.32 చొప్పున నెల‌కు 1800 x 32 = రూ.57వేల వ‌ర‌కు ఆదాయం వస్తుంది, మరికొంత మంది రైతులు పెద్దమొత్తంలో పాలని సప్లై చేస్తూ నెలకి లక్ష రూపాలు సంపాదిస్తున్నారు, ఈ అక్షయ కల్ప డెయిరీ ఫాం ఏర్పాటుకి దాదాపు రూ.10 – 20 లక్షల పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడిని మొదటి మూడు సంవత్సరాలోనే 3 సంవత్సరాలలోనే రాబట్టుకున్నారు, ఇది వారు ఈ 6 సంవ‌త్స‌రాల్లో సాధించిన ప్ర‌గ‌తి. ఇదే ఫాంను మ‌రిన్ని గ్రామీణ ప్రాంతాల‌కు విస్త‌రిస్తామ‌ని చెబుతున్నారు శ‌శికుమార్ బృందం. వారు చేస్తున్న మంచి ప‌నిని నిజంగా అంద‌రూ అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments