Home / Inspiring Stories / 25 వేల మందిపిల్లలకి తన లాంటి కష్టం వద్దనుకున్న ఈ కలెక్టర్ ఏం చేసాడు?

25 వేల మందిపిల్లలకి తన లాంటి కష్టం వద్దనుకున్న ఈ కలెక్టర్ ఏం చేసాడు?

Author:

Jalore Collector

రాజస్థాన్ జాలోర్ జిల్లా కలెక్టర్ జితేంద్ర కుమార్ సోని రోజూ మాదిరిగానే తన అధికార వాహనంలో కార్యాలయానికి బయలు దేరారు.దారిలో ఒక సిగ్నల్ దగ్గర బడికి వెళ్తోన్న ముగ్గురు చిన్నారులను చూశారు.స్థానిక మునిసిపల్ స్కూల్లో చదువుకుంటున్నారని వాళ్ళ బట్టలనీ చిరుగుల స్కూల్ బ్యాగులనీ చూసి అర్థమైంది. నవ్వుకుంటూ ఆ ఉదయం వేళలో పరుగులు తీస్తున్న చిన్నరులను చూసి కలెక్టర్ ఎంతగానో ఆనందించారు. అయితే ఆయన చూసింది వాళ్ళ నవ్వు మొహాలనే కాదు ఆ పసివాళ్ళ పాదాలను కూడా ఆ ముగ్గురి పాదాలకూ పాదరక్షలు లేవు. చలికాలం అందులోనూ వణికించే డిసెంబర్ రోజులు.అయినా వాళ్ళకి స్కూలు తప్ప మిగిలిన వాటి మీద ధ్యాసలేదు, ఆ చిన్నారులు మెండిపాదాలతో ఎలా స్కూలుకు వెళ్లగలుగుతున్నారో ఆయనకు అర్థం కాలేదు.

ఒక్క సారి తన బాల్యం గుర్తొచ్చింది. ఇలాగే రాజస్థాన్ లోని ఒక పల్లెలో తన బడీ,పొలం గట్లమీద పరుగులూ,కాలికి గుచుకున్న ముళ్ళూ,ఆ నొప్పీ గుర్తొచ్చాయి…. పేదరిక బాల్యపు జ్ఞాపకాలు! వెంటనే కారు దిగారు.ఆ ముగ్గురు పిల్లలనీ దగ్గరికి పిలిచి ముగ్గురినీ బజారుకి తీసుకెళ్లి తన దగ్గరున్న డబ్బుతో బూట్లు కొన్నారు.,జితేంద్ర కుమార్ ఐఏఎస్ కీ ఆనందం వేసింది. ఐతే ఆ పిల్లల ఆనందం ఉన్నంత సేపు ఆయన ఆనందించలేకపోయారు. ఎందుకంటే. కళ్ళ ముందు మరికొన్ని పాదాలు,కరకు రోడ్లమీద గాయాలతో పరుగులు తీసే మరికొన్ని చిన్నారి పాదాలు కనిపిస్తున్నాయి.

Jalore Students

ఈ ముగ్గురు పిల్లలకీ బూట్లుకొన్నాడు అక్కడితో ఆ పూటకి జితేంద్ర మనసు సంతృప్తి చెందింది. కానీ, అతడి కంటికి కనిపించని వేలాది చిన్నారుల పరిస్థితేంటి..? అనిపించింది అందుకే, జితేంద్ర అక్కడితో ఆగిపోలేదు. దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకు స్వయంగా వెళ్ళారు వెళ్లారు. అక్కడి టీచర్లను కలిసి, ఎంతమంది పిల్లలు షూ లేకుండా పాఠశాలకు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో కొందరు చిన్నారులున్నారని కూడా తెలిసింది తిరిగి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇప్పుడేం చేయాలి? తన సమీపంలో ఉన్న స్కూల్ లోనే కనీసం రెండువందలకు పైగా పిల్లలు ఉంటే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు..? అంతే జిల్లాలోని అన్ని ప్రదేశాల అధికారుల నుంచి సమాచారం సేకరించారు. వచ్చిన నివేదికల ప్రకారం జాలోర్ జిల్లాలోని 2,500 పాఠశాలల్లో సగటున పదిమంది చొప్పున పాదరక్షలు కొనుక్కోలేనివారున్నారు. మరి వారందరికీ పాదరక్షలు కొనాలి అంటే..? తన సంపాదన ఒక మూలకు కూడా రాదు,ప్రభుత్వాన్నీ కూడా అడిగే పరిస్థితి లేదు ఏం చేయాలి….?

వెంటనే ‘చరణ్ పాదుకా యోజనా’ అనే కొత్త స్కీమును ప్రవేశపెట్టారు. జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు పాదరక్షలు సమకూర్చడమే ఈ పథకం ఉద్దేశం. అయితే ప్రభుత్వ నిధుల కొరత వేధించింది. వెంటనే ఇతర దాతల సాయం కోరారు. సాధ్యమైనంత సహాయం కోసం పర్సనల్ గా కూడా కొందరిని కలిసి పరిస్థితి వివరించారు ఈ పథకం గురించి తెలుసుకున్న ప్రజలు ప్రతి రోజూ కలెక్టరేట్‌కు వస్తూ తమకు తోచినంత ఇచ్చి వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు తన జిల్లాలోని 25 వేల మంది చిన్నారులకు షూస్ కొనడానికి సరిపడా మొత్తం ఖాతాలో చేరింది. ఈ గణతంత్ర దినోత్సవంలోగా పాదరక్షలను వారికి అందజేయాలని కలెక్టర్ ప్రణాళికలు రచిస్తున్నారు.శోభాయాత్రలో ఏ ఒక్క చిన్నారీ ఉట్టి కాళ్ళతో నడవకూడదన్న లక్ష్యం తో పని చేస్తున్నారు…. లక్ష్యం నెరవేరింది కొన్ని వేల జతల బూట్లు స్కూల్లకు చేరి పసిపాదాల రక్షణ కోసం సిద్దంగా ఉన్నాయి.

jalore Students1

‘‘సాధారణ, నాన్ బ్రాండెడ్ స్కూల్ షూ ధర మార్కెట్లో రూ.200 నుంచి 300 మధ్యలో ఉంది. దీంతో నా ఆలోచన సాధ్యమే అని అర్థమైంది. ప్రజలనే దానం చేయండంటూ అభ్యర్థించా. వారిచ్చిన నిధులే ఈ పథకానికి ఊపిరి. ఏటా బూట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నా’’ అంటున్నారు కలెక్టర్ జితేంద్ర. పేదరికంలో మగ్గిన తన బాల్యం ఇప్పటికీ గుర్తుందనీ, తండ్రి ఎంతో కష్టపడి తనను ఈ స్థాయికి తీసుకొచ్చారనీ,ఇప్పుడు తాను తన లాంటి మరికొందరికైనా ఆ భాదాపూరిత ఙ్ఞాపకాలు లేకుండా చేయాలనుకున్నాననీ చెబుతున్నారీ కలెక్టర్…

(Visited 919 times, 24 visits today)