EDITION English తెలుగు
రైళ్లలో దోపిడీకి ప్రయత్నించే దొంగలను కాల్చి వేయాలని డిసైడ్ అయ్యింది:రైల్వేశాఖ   ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుపై తల్లిదండ్రుల సంఘం తీవ్ర నిరసనలు   గవర్నర్ ప్రారంభించిన...అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు పరుగులు   రికార్డు స్థాయికి: పెట్రోల్‌ ధర తొలిసారి రూ.90 దాటింది   ఉదయం అలారం మొగిందా ? అయితె దాన్ని ఆపెసి మళ్ళీ పడుకొంటున్నరా ? అయితె ఈ మనసు మనిషి సంఝర్షణ మీ కొసమె   గ్రీవియెన్స్ ఆఫీసర్ని నియమించిన వాట్సాప్-ఇండియా   సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని ఆర్టీసీ ఆదేశాలు   బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం లో రూ.16.60లక్షలు అమ్ముడయ్యాయి   వెంక‌టేష్ త‌న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ .!   భారతదేశం ఇటీవలి కాలంలో పేదరికంపై భారీ విజయాన్నే సాధించింది: ఐరాస

జయ జానకి నాయక రివ్యూ & రేటింగ్.

జయ జానకి నాయక రివ్యూ

Alajadi Rating

2.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్, ప్రగ్య జైస్వాల్, శరత్ కుమార్, జగపతి బాబు, నందు..తదితరులు.

Directed by: బోయపాటి శ్రీను

Produced by: మిర్యాల రవీందర్ రెడ్డి.

Banner: ద్వారకా క్రియేషన్స్

Music Composed by: దేవిశ్రీ ప్రసాద్

బోయపాటి శ్రీను సినిమా అంటే సినిమా టైటిల్ దగ్గర నుండి క్లైమాక్స్ సీన్ వరకు పక్క మాస్ గా ఉంటాయి, ఇప్పటివరకు పెద్ద హీరోలని తన మాస్ సినిమాలతో మరో మెట్టు ఎక్కించిన బోయపాటి శ్రీను ఈసారి యువ హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా తీసాడు, మాస్‌ టైటిళ్లతో అదరగొట్టే శ్రీను.. ఈసారి ‘జయ జానకి నాయక’ అనే సున్నితమైన పేరు పెట్టారు.శ్రీనివాస్, రకుల్ ప్రీత్ లతో బోయపాటి చేసిన సరికొత్త సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి..

కథ:

గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్) కి తన కుటుంబం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా నాన్న చక్రవర్తి(శరత్ కుమార్), అన్నయ్య (నందు) లు అంటే ప్రాణం వారికోసం ఏమైనా చేస్తాడు, అనుకోకుండా పరిచయం అయిన స్వీటీ(రకుల్ ప్రీత్)ని గగన్ ప్రేమిస్తాడు, స్వీటీ వల్ల గగన్ కుటుంబంలో చాలా మార్పులొస్తాయి, గగన్, స్వీటీలు ఒక్కటవ్వుదాం అనుకునేలోపు స్వీటీ అశ్వింత్‌ నారాయణ(జగపతి బాబు) వల్ల పీకల్లోతు కష్టాలలో మునిగిపోతుంది, స్వీటీకి వచ్చిన కష్టాలు ఏంటి..? అశ్వింత్‌ నారాయణ ఎవరు..? చివరికి ఏమి జరిగింది..? అనేది తెరమీదనే చూడాలి.

అలజడి విశ్లేషణ:

హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, హీరోయిన్ కి విలన్ వల్ల కష్టాలు వస్తాయి, ఆ కష్టాల నుండి హీరోయిన్ ని హీరో గారు కాపాడి విలన్ పని పడతాడు, ఇది అనాదిగా వస్తున్న రొటీన్ తెలుగు సినిమా కథ, కథ రొటీన్ అయినప్పటికీ ప్రేక్షకుల మాస్ పల్స్ ని సరిగా క్యాచ్ చేసిన బోయపాటి స్క్రీన్ ప్లే మాయతో సినిమాని నిలబెట్టాడు, బోయపాటి సినిమా అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్ లని సూపర్బ్ గా తెరకెక్కించారు, సినిమా మొదటి నుంచే ఓ ఎమోషన్‌ తో సాగుతుంది. యాక్షన్‌ ఘట్టాలు, వాటి ముందు వచ్చే లీడ్‌ సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నాడు. దాంతో మాస్‌ ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలు నచ్చుతాయి.

పరువు – పంతం వీటి మధ్య ఒక అమ్మాయి, అలాగే ఇద్దరి మధ్య సున్నితమైన ప్రేమకథ ఈ రెండింటిని బాలన్స్ చేస్తూ తెరకెక్కించిన విధానం బాగుంది, కాకపోతే ప్రేమకథ అని చెప్పి హీరో-విలన్ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ లపై ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల సినిమా మొత్తం అవే కనబడుతాయి, కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్లు కుటుంబ ప్రేక్షకులకి ఆకట్టుకున్న మరికొన్ని బోర్ కొట్టిస్తాయి, హీరోయిన్ చుట్టూ జరిగే ఎమోషనల్ సన్నివేశాలు మరియు హంసల దీవి ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి, మొత్తానికి జయ జానకి నాయక రూపంలో మరొక పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని బోయపాటి తీసుకొచ్చాడు.

నటీనటుల పెరఫార్మన్స్:

బెల్లంకొండ శ్రీనివాస్ : డాన్స్, ఫైట్ లలో శ్రీనివాస్ అదరగొట్టాడు, క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డైలాగ్‌లు బాగా పలికాడు.

రకుల్ : రకుల్ తన నటనతో సినిమాని నిలబెట్టింది, ఎమోషనల్ సీన్లలో రకుల్ నటన సినిమాకే హైలైట్.

శరత్ కుమార్: చాలాకాలం తరువాత తెలుగులో నటించిన శరత్ కుమార్ ఆకట్టుకున్నాడు, అయన చుట్టూ ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులని అలరిస్తాయి.

జగపతి బాబు: మరో స్టైలిష్ విలన్ గా జగపతి బాబు సూపర్బ్ గా నటించాడు.

ఇంకా నందు, ప్రగ్య జైస్వాల్, తరుణ్ అరోరా.. తదితరులు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • స్క్రీన్ ప్లే
  • బెల్లంకొండ శ్రీనివాస్ , రకుల్ ప్రీత్ ల నటన
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ స్టోరీ
  • మితిమీరిన యాక్షన్‌ ఎపిసోడ్స్

 

పంచ్ లైన్ : టైటిల్ యే క్లాస్ సినిమా మొత్తం మాస్..!

 

(Visited 2,087 times, 58 visits today)