EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

జయమ్ము నిశ్చయమ్మురా రివ్యూ & రేటింగ్

Author:

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాను నటించిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు. గీతాంజలి సినిమాతో మొదటిసారి హీరోగా మారి అందరిచే మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా తో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. పూర్ణ హీరోయినా గా నటించిన ఈ సినిమాని శివరాజ్ కనుమూరి దర్శకత్వం వహిస్తూ నిర్మించాడు. ట్రైలర్  ఎన్నో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది మరి ఎలా ఉందొ ఒక్కసారి చూద్దాం.

‘జయమ్ము నిశ్చయమ్ము రా’ మూవీ రివ్యూ

కథ:

సర్వ మంగళం(వైఎస్సార్) పదేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటారు. మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్ముతూ ప్రతి విషయానికి దొంగ బాబా ( జీవ)పై ఆధారపడుతుంటాడు. ఇలాంటి టైంలో తనకి ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగం దొంగ బాబా వలనే వచ్చింది అనుకుంటాడు. తాను ఉండేది కరీంనగర్ అయితే ఉద్యోగం వచ్చింది మాత్రం కాకినాడ మున్సిపల్ ఆఫీసులో….. అయిన తప్పదు కాబట్టి వెళ్లి కాకినాడలోని మున్సిపల్ ఆఫీస్ లో క్లర్క్ గా జాయిన్ అవుతాడు. సర్వమంగళంని తన ఊరికి బదిలీ చేయిస్తా అని తనతో అడ్డమైన పనులు అన్ని చేయించుకుంటారు పై అధికారులు. కాకినాడ రాక ముందే హైదరాబాద్ లో రాణి(పూర్ణ) ని చూసి మొదటి చూపులోనే ఇష్టపడుతారు మన హీరో . రాణి కూడా మనోడు పనిచేసే ఆఫీస్ పక్కనే పని చేస్తుంటుంది. భయస్తుడైన సర్వమంగళం రాణికి తన ప్రేమ విషయం ఏవిధముగా చెప్పాడు?. ఇంతకు సర్వమంగళం, రాణి ల ప్రేమ మధ్యలో జెసి ఎందుకు వచ్చాడు. చివరకు వీరి ప్రేమ సక్సస్ అయిందా లేదా!…తెలియాలి అంటే మీరు సినిమా చూడవలసిందే …..

అలజడి విశ్లేషణ :

మన తెలుగులో ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుందనే చెప్పాలి. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా డబుల్ మైనింగ్ డైలాగ్స్ లేకుండా ఒక చిన్న ప్రేమకథకు కొన్ని సన్నివేశాలు జోడించి అద్భుతమైన సినిమాగా మలిచాడు దర్శకుడు. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా పోస్టర్ ను కథలో భాగంగా మలుచుకున్న తీరు బాగుంది. ఈ సినిమా మొత్తం మన చుట్టూ ఉన్న పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడ ఒక పాత్రను ఎక్కడి నుండో తీసుకువచ్చి ఇందులో పెట్టినట్టు  కనిపించదు. హీరోయిన్ ప్రేమ వ్యవహారం తెలిశాక హీరో కొద్దిగా నిరాశ చెందడం, అలాగే హీరోయిన్ ఎవరినైతే ప్రేమించిందో వారిని విడదీయటానికి చూడటం కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో కొద్దిగా కామెడీ తగ్గడం వలన కథ కూడా స్లోగా అవడం కొద్దిగా బోరింగ్  అనిపిస్తుంది.

మొదటి భాగంలో మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్మే యువకుడిగా, భయస్తుడిగా ఉన్న హీరో సెకండాఫ్ లో మాత్రం  తన సమస్యలను తనే ఎదురుకునే యువకుడిగా, ప్రేమను గెలుచుకునే వ్యక్తిగా చాలా బాగా యాక్టింగ్ చేసాడు శ్రీనివాస్. ఇక శ్రీనివాస్ తెలంగాణ యువకుడిగా తెలంగాణ యాసలో మాట్లాడటం చాలా బాగుంది.

నటీనటుల పనితీరు:

శ్రీనివాస్ రెడ్డి : తనకు బాగా తెలిసిన కామిడి కథనే ఎంచుకోవడం శ్రీనివాస్ చేసిన మంచి పని. భయస్తుడిగా, ప్రేమికుడిగా, శత్రువులను ఎదురుకునే వ్యక్తిగా ఇలా ఒకే పాత్రలో భిన్న కోణాలు చూపించాడు.

పూర్ణ : తనకు ఇచ్చిన పాత్రలో చాల చక్కగా ఒదిగిపోయింది అని చెప్పాలి. తన సైలెంట్ లుక్స్ తో చాలా భాగా వ్యక్తిగా చేసింది అని చెప్పాలి.

అడపా ప్రసాద్ పాత్రలో కృష్ణ భగవాన్ నటన సూపర్బ్ అని చెప్పాలి. ఇక ఆ పాత్ర రూపుదిద్దిన తీరు చాలా బాగుంది. ఈ పాత్ర సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటుంది. తత్కాల్ పాత్రలో ప్రవీణ్ , గుంటూరు పంతులు పాత్రలో పోసాని ల మధ్య వచ్చే కామెడీ చాలా బాగుంది. లాగే చాలా రోజుల తరువాత జె.సి పాత్రలో రవివర్మ చాల చక్కగా నటించాడు. మిగతా ఆర్టిస్టులు వారి పరిధి మేరకు వారు నటించారు.

సాంకేతిక వర్గం:

కొత్త దర్శకుడైన కుటుంబం అంత కలసి చూసే కథను ఎంచుకున్న దర్శకుడిని మొదటగా అభినందించాలి. కథ మొత్తంలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా, డబల్ మైనింగ్ డైలాగ్స్ లేకుండా ఈ రోజులలో సినిమా రావడం కష్టమా అనుకున్న సమయంలో అలాంటి సినిమాతో మన ముందుకు వచ్చిన శివరాజ్ కనుమూరి గొప్పతనం. ఇక సినిమాని మరో ఎత్తు రవిచంద్రన్, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడు. ఇందులోని ఓ రంగుల  చిలకా సాంగ్ సూపర్. అలాగే కార్తీక్ అందించా నేపథ్య సంగీతం కూడా బాగుంది. కెమెరామెన్ నగేష్ బానెల్  ఈ సినిమాకు మరో పిల్లర్ గా నిలిచాడు. తన కెమెరాతో మనం ఇంతకు ముందు  చూడని కాకినాడ అందాలను మనకు చూపించాడు. ఇక ఈ సినిమాని దర్శకుడే నిర్మించాడు కాబట్టి  నిర్మాణ విలువలు తగ్గకుండా బాగున్నాయి

ప్లస్ పాయింట్స్ :

  • శ్రీనివాస్ రెడ్డి నటన
  • కథ, కామెడీ
  • సంగీతం
  •  సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

  • స్లోనేరేషన్
  • సెకండ్ హాఫ్
  • స్క్రీన్ ప్లే

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్: కొంచెం నెమ్మదిగా జయమ్ము నిశ్చయమ్మురా. 

(Visited 1,711 times, 19 visits today)

Comments

comments