Home / Political / సినీనటి జయసుధ భర్త నితిన్‌కపూర్‌ అనుమానాస్పద మృతి.

సినీనటి జయసుధ భర్త నితిన్‌కపూర్‌ అనుమానాస్పద మృతి.

Author:

ప్రముఖ సినీనటి జయసుధ భర్త నితిన్‌ కపూర్‌(58) ముంబైలో అనుమానాస్పందంగా మృతి చెందారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్రకు సోదరుడు అయిన నితిన్ ముంబైలోని తన కార్యాలయంలోనే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. నితిన్ మృతిని ఆత్మహత్యగా పరిగణిస్తున్న పోలీసులు దీనిపై దర్యాప్తు తరువాత మరిన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.

Jayasudhas husband Nitin Kapoor commits suicide telugu
జయసుధ నటించిన ఆశాజ్యోతి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నితిన్ కపూర్ తో 1985లో జయసుధ వివాహం జరిగింది. వీరికి నిహార్‌, శ్రేయాన్‌ ఇద్దరు కుమారులు ఉన్నారు. కపూర్‌ మృతి విషయం తెలిసిన వెంటనే జయసుధ హైదరాబాద్‌ నుంచి ముంబై బయలుదేరారు. నితిన్ జేఎస్కే కంబైన్స్‌ బ్యానర్‌పై కాంచనసీత, కలికాలం, హ్యాండ్సప్‌, మేరాపతి సిర్ఫ్‌ మేరా చిత్రాలను నిర్మించారు.

(Visited 4,174 times, 7 visits today)