Home / Political / Video: తప్పు ప్రీక్వెన్సీ సెట్ చేసి కాసేపు దేశాలనే బయపెట్టిన జెట్ ఎయిర్ వేస్ పైలట్.

Video: తప్పు ప్రీక్వెన్సీ సెట్ చేసి కాసేపు దేశాలనే బయపెట్టిన జెట్ ఎయిర్ వేస్ పైలట్.

Author:

ఒక చిన్న తప్పుతో జర్మనీ మిలిటరి విభాగాన్ని కాసేపు హడలెత్తించాడు జెట్ ఎయిర్ వేస్ పైలట్. 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో ముంబాయి నుండి లండన్ వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానం జర్మనీ గగనతలంలోకి వెళ్లింది. జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం వారు తమ గగనతలంలోకి వచ్చిన ఆ జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని సంప్రదించడానికి ప్రయత్నించారు. కాని విమానం నుండి ఎటువంటి సమాధానం రాలేదు, దానితో సందేహించిన జర్మనీ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు రంగంలోకి దిగి జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని వెంబడించాయి . ఎం జరుగుతుందో అన్న అందోళనలో ఉన్న జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి తమ తప్పు తెలిసివచ్చింది.

జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో సంప్రదించడానికి తమకు కేటయించిన ఫ్రీక్వెన్సీ 132.980MHz కి బదులు తప్పుగా 132.890MHz సెట్ చేయడమే అని అర్దం అయ్యింది, దాని వలన జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి, విమానానికి సంబంధాలు తెగిపోయాయి. జరిగిన తప్పును సరిదిద్ది కరెక్టు ఫ్రీక్వెన్సీ సెట్ చేసి జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి తమ విమానం గురించి తెలిపారు. దానితో అది పౌర విమానం అని గుర్తించిన జర్మనీ యుద్ధ విమానాలు జెట్ ఎయిర్ వేస్ విమానానికి దారి చూపించి వదిలివేసాయి. ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ విమానం గమ్యస్థానం లండన్ లో దిగింది. దీనికి సంబంధించిన వీడీయోను అదే దారిలో వెళ్తున్న ఇంకో విమానం నుండి చిత్రీకరించారు.

(Visited 861 times, 14 visits today)