జియో ఆఫర్: ఇంటింటికి 120 ఎంబీపీస్ స్పీడ్ తో ఉచితంగా ఇంటర్నెట్.

Author:

జియో వెల్ కం ఆఫర్ పేరుతో ఇప్పటికే టెలికం ఇండస్ట్రీలో లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో మరో షాకింగ్ ఆఫర్ ని ప్రకటించబోతున్నారు, మొబైల్ డేటాలో జియో పేరుతో ఉచిత డేటా, వాయిస్ కాల్స్ అందించిన రిలయన్స్ జియో ఇప్పుడు ఫైబర్ కేబుల్ ఇంటర్నెట్ సేవలలో కూడా అడుగుపెట్టబోతుంది, అపరిమిత ఇంటర్నెట్ ని అధిక వేగంతో అందించే విధంగా ఈ ప్లాన్ ఉంటుంది.

reliance-jio-ftth-broadband-plans

జియో గిగా ఫైబర్ స్పెషల్ ఆఫర్ పేరు మీద కేవలం రూ.500 లకే 600 జీబీ డేటాని దాదాపు 50 MBPS నుండి 1 GBPS స్పీడ్ తో అందించే విధంగా ఈ ఆఫర్ ఉండబోతుంది,త్వరలో ఈ ఆఫర్ ని కూడా ప్రారంభించబోతున్నారు దీనిని కూడా జియో వెల్ కం ఆఫర్ లాగానే 3 నెలలు ఉచితంగా ఇవ్వనున్నారు, ఆ తరువాత ఈ ఆఫర్ లో ఇంటర్నెట్ ప్యాకెజీలు రూ.500 నుండి రూ.5500 వరకు ఉన్నాయి, బ్రాడ్ బ్యాండ్ ఫైబర్ కేబుల్స్ ద్వారా ఇంటింటికి మరియు ఆఫీస్ లకి ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ ని అందించడంలో ఇప్పుడున్న కంపెనీలు చాలా వెనుకంజలో ఉన్నాయి, మరీ ఆఫర్ తో కానీ జియో నెట్ సేవలు బయటకు వస్తే.. టెలికం కంపెనీల మధ్య డేటా వార్ మరింత ముదిరిపోతుందనటంలో సందేహం లేనట్లే.

(Visited 3,307 times, 84 visits today)