జియో బంపర్ ఆఫర్: హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో రూ.199 ప్లాన్.

Author:

కొత్త సంవత్సరం సందర్భంగా జియో తమ వినియోగదారుల కోసం మరో రెండు బంపర్ ఆఫర్స్ ని ప్రకటించింది, Low Price High Data అనే థీమ్ తో హ్యాపీ న్యూఇయర్‌ 2018 స్కీమ్‌ కింద రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఒకటి రూ.199 ప్లాన్‌. ఈ ప్లాన్ లో ప్రతి రోజు 1.2GB డేటాను 4G స్పీడ్ లో ఇస్తుంది. లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితం. అన్ లిమిటెడ్ గా కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్ ద్వారా అన్ లిమిటెడ్ మెసేజ్ లు పంపుకోవచ్చు. జియో చాట్, సినిమాలను కూడా ఈ ప్యాకేజ్ కింద వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు. న్యూ ఇయర్ సందర్భంగా రూ.199 ప్లాన్ ను తీసుకొచ్చింది జియో. డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.

Jio-Happy-New-Year-Offers

ఎక్కువ డేటా వాడే వారికోసం రూ.299తో మరో ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద ఫ్రీ వాయిస్‌, అన్ లిమిటెడ్ డేటా(రోజుకు 2GB హైస్పీడ్‌ 4జీ డేటా), అన్ లిమిటెడ్ SMS ,జియో ప్రైమ్‌ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది.

(Visited 974 times, 997 visits today)