Home / Latest Alajadi / మరో బంపర్ ఆఫర్ తో వస్తున్న జియో: రూ.500కే జియో 4G ఫోన్.

మరో బంపర్ ఆఫర్ తో వస్తున్న జియో: రూ.500కే జియో 4G ఫోన్.

Author:

జియో రావడంతోనే ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలుసు, జియో పోటీని తట్టుకోలేక పెద్ద పెద్ద మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు అన్ని చేతులెత్తాశాయి, మరో సారి జియో అలాంటి సంచనలమే సృష్టించడానికి ప్రయత్నిచబోతుంది అని మార్కెట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి, దేశంలోనే అత్యంత తక్కువ ధరకి 4G ఫీచర్ ఫోన్ జియో మార్కెట్ లోకి తేవడానికి నిర్ణయం తీసుకుందని ఆ ఫోన్ ని ఈ నెలలో జరిగే రిలయన్స్ వార్షిక సదస్సులో రిలయన్స్ అధినేత అంబానీ జియో 4G ఫోన్ ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు.

రూ.500 ధరలో ఈ ఫీచర్ ఫోన్.. 4G నెట్ వర్క్ (VOLTE) పనిచేస్తోంది. మార్కెట్ లో 4G నెట్ వర్క్ లో పని చేసే ఫోన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఈ కారణంగానూ జియో కస్టమర్లు భారీగా పడిపోయారు. దీన్ని అధిగమించేందుకు 4G VOLTE హ్యండ్ సెట్లను విడుదల చేస్తోంది రిలయన్స్. జియో 4G VOLTE హ్యాండెసెట్లను అత్యంత చౌకగా.. కేవలం రూ.500కే అందించాలని నిర్ణయించింది. జియో 4G ఫోన్ లతో గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లు భారీ సంఖ్యలో పెరగనున్నట్లు అంచనా వేస్తుంది. జియో 4G VOLTE ఫోన్లతో రెండు కోట్ల మంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది కంపెనీ.

(Visited 2,017 times, 13 visits today)