జియో ఆఫర్.. జూన్ వరకు పెంపు!

Author:

జియో వచ్చినప్పటి నుండి ఇతర నెట్ వర్క్ కంపెనీలు జియోకి పోటీగా ఎలాంటి ఆఫర్ ఇవ్వాలో అని ఇప్పటికి సతమతవుతున్నాయి, మొదటగా సెప్టెంబర్ నుండి డిసెంబర్ 31 వరకే జియో వెల్ కం ఆఫర్ ప్రకటించిన అంబానీ, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో మార్చి వరకు ఫ్రీ ఆఫర్ ని పొడిగించారు, జియో ఆఫర్ తో హై స్పీడ్ 4G డేటాని, ఫ్రీ కాల్స్, మెసేజ్ లని వాడుకుంటున్న వారికి అంబానీ మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు, జియో ఆఫర్ జూన్ వరకు పొడిగించనున్న‌ట్టు తెలిపారు.

jio-offer-extended-upto-june

జూన్ వరకు జియో ఆఫర్ కావాలంటే వినియోగదారులు కేవ‌లం రూ.100 నామ మాత్ర‌పు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది, దాంతో 3 నెల‌ల వ‌ర‌కు ఇప్పుడు ఉన్న‌ట్టుగానే ఉచిత కాల్స్‌, డేటా, ఎస్ఎంఎస్‌ల‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు, రూ.100 రూపాయలకి 1 GB డేటా కూడా ఏ ఇతర నెట్ వర్క్ ఇవ్వలేకపోతుంది అలాంటిది జియో హై స్పీడ్ లో ఆన్ లిమిటెడ్ 4జి డేటాని, కాల్స్ ని కేవలం రూ.౧౦౦ ఇస్తాం అంటే ఎవరు వద్దంటారు, కానీ ఈ ఆఫర్ ని జియో వారు ఇంకా ప్రకటించలేదు, దీనిపై తుది నిర్ణయం తీసుకోని మరికొన్ని రోజులలో ప్రకటిస్తారు, అప్పటివరకు వేచి ఉండండి.

(Visited 1,981 times, 153 visits today)