Home / General / ఏ ముద్దులో ఏ వైరస్ దాగి ఉందో ఎవరికీ తెలుసు?

ఏ ముద్దులో ఏ వైరస్ దాగి ఉందో ఎవరికీ తెలుసు?

Author:

9 నెలలు ఎంతో మురిపెంగా, జాగ్రత్తగా మోసి.. పురిటి నొప్పులను పంటి దిగువన భరించి కన్న ఒక్కగానొక్క పాప, ఇంకా పూర్తిగా కళ్ళు కూడా తెరవని పాప.. కేవలం 4 వారల వయస్సులోనే.. కన్ను మూస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించండి.

kiss can be deadly to new born babies

ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ కి చెందిన యువ దంపతులు 28ఏళ్ల సారా పగ్, డగ్లస్ లాంప్టన్ లు ఎంతో ఇష్టంగా ఒక పాపను కన్నారు. ముద్దుగా బొద్దుగా ఆరోగ్యంగా పుట్టిన పాపాయిని చూసి ఎంతో ఆనంద పడ్డారు. తమ బంగారు పాపకు ల్లాయిస్ లాంప్టన్ అని నామకరణం చేశారు. తల్లి సారా పగ్ ఆనందానికైతే అవధులు లేవు. నెలలు నిండినా నొప్పులు రాకపోవడంతో సిజేరియన్ చేయించుకుని మరీ కన్న బుజ్జి పాపాయిని చూస్తూ రోజులు మరిచిపోయారు తల్లిదండ్రులు.

తమ ఆనందాన్ని అందరితో పంచుకుందామని బంధుమిత్రులతో కలిసి పార్టీ చేసుకుందామని నిర్ణయించారు. అందరినీ పార్టీకి ఆహ్వానించారు. పిలిచినా వెంటనే, బందుమిత్రులంతా కూడా చాలా ఆనందంగా బుజ్జి పాపాయిని ఆశీర్వదించడానికి విచ్చేశారు. చాలా ఘనంగా అందరూ కలిసి పార్టీ సెలెబ్రేట్ చేసుకున్నారు. వచ్చిన వాళ్ళంతా బుజ్జి పాపాయిని చూసి.. ఎత్తుకొని ముద్దాడారు. వావ్ భలే ఉంది బుజ్జి పాపాయి అనగానే తల్లిదండ్రులకు ఇంకా ఆనందం వేసింది. అనుకున్న దానికన్నా ఎక్కువ సంతోషంతో పార్టీ ముగిసింది. అందరూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపోయారు.

తెల్లారి తండ్రి డగ్లస్ లాంప్టన్ ఎప్పటిలాగానే ఆఫీస్ వెళ్ళాడు. వచ్చాక పాపతో ఆడుకుంటూ..పార్టీ సంగతులు, ఫోటోలు గుర్తు చేసుకుని సంబరపడిపోయారు. అయితే పాప నీరసంగా ఉండడం, పాలు కూడా తాగకపోవడంతో బుజ్జగించి బజ్జోపెట్టారు. కానీ, రెండు మూడు రోజులుగా పాపలో హుషారు ఇంకా ఇంకా తగ్గినట్టు అనిపించి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. చూస్తే బరువు కూడా తగ్గినట్టు తేలింది. అన్ని పరీక్షలు చేస్తే గానీ అసలు విషయం బయట పడలేదు. పాపకి హెర్ప్స్ అనే వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పడంతో దంపతులు కంగారు పడ్డారు. ఇది కేవలం జలుబు, దగ్గు ఉన్నవారు పాపని ముద్దాడడం వల్లే జరిగిందని తెలిసి నిర్ఘాంతపోయారు. డాక్టర్లు వెంటనే పాపాయికి అవసరమైన వైద్యం మొదలు పెట్టారు. కానీ, వైరస్ దాటికి కేవలం 24 రోజుల పాప అందరినీ వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అసలు ఆ పార్టీ ఇవ్వకపోయుంటే పాప బతికే ఉండేదని తెలిసి పేరెంట్స్ షాక్ తిన్నారు. పార్టీ కి వచ్చినవారిలోనే ఎవరికో జలుబు, దగ్గు లేదా ఈ వైరస్ ఉందని తెలిసి నివ్వెరపోయారు. ఎవరిని మాత్రం ఏమనగలరు, తమ ముద్దుల పట్టీయే ప్రాణాలు వదిలాక ఇంకేం చేయగలరు. తమ బాధ ఎవ్వరికి చెప్పుకోలేక కుమిలిపోయారు. తమలా ఇంకెవరికీ ఈ పుత్ర శోకం రాకూడదనే నిర్ణయానికొచ్చారు. పాపాయిని ముద్దు చేయండి కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏ ముద్దులో ఏలాంటి వైరస్ దాగి ఉందో ఎవరికీ తెలుసు అని అందరిని జాగృతం చేస్తున్నారు.

పాపం ఆ తల్లిదండ్రులు ఎన్నో అనుకున్నారు, ఇంకెన్నో ప్లాన్లు వేశారు. బుజ్జి పాప మరణం తో తమ లోకమే తలకిందులయింది. తామొకటి తలిస్తే దైవం ఇంకోటి తలచిందని అన్నట్టు.. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుందాం అనుకున్నతమ బుజ్జి పాపాయి .. అర్దాంతరంగా కళ్ళు మూయడంతో వారి జీవితంలో వెలుగులు కోల్పోయారు. అందుకే అందరు తల్లిదండ్రులకు ఈ సలహా ఇస్తున్నారు. తమలాగా ఇంకొకరు బిడ్డను పోగొట్టుకోకూడదనేదే వారి తపన.. కాబట్టి మీ పాపని కానీ, తెల్సినవాళ్ళ పాపని కానీ.. కాస్త జాగ్రత్తగా ముద్దు చేయండి.

(Visited 3,109 times, 71 visits today)