Home / Entertainment / మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!

మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!

Author:

సౌత్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ హీరోగా కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాలా. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నిర్మిస్తున్నాడు. రజనీ నటించిన మరో సినిమా 2.ఓ ఆలస్యం కావటంతో కాలాను ముందుగానే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 2.ఓ రిలీజ్‌ చేయాలని భావించిన ఏప్రిల్‌ చివరి వారంలో కాలాను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు.

మహేష్‌, బన్నీలకు షాక్‌

కాలా సినిమాను ఏప్రిల్‌ 27న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ టాప్‌ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్‌ లు తమ సినిమాలను అదే రోజు రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భరత్‌ అనే నేను, వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలను ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు సడన్‌ గా రజనీ సినిమాను అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన రావటంతో మహేష్‌, బన్నీ చిత్రాల నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. రజనీకాంత్ సినిమా అంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ భారీగా రిలీజ్ అవుతోంది. ఇలా ఒకేసారి ముగ్గురు టాప్‌ హీరోలు బరిలో దిగితే థియేటర్ల సమస్య కూడా తలెత్తుంది. మరి ఈ రజనీ ఎంట్రీతో మహేష్, బన్నీ లలో ఎవరైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.

(Visited 118 times, 4 visits today)