Home / Entertainment / కళ్యాణ వైభోగమే సినిమా రివ్యూ & రేటింగ్.

కళ్యాణ వైభోగమే సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Kalyana Vaibhogame Movie Review and Rating

‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ నందిని రెడ్డి జబర్దస్త్ ఇచ్చిన షాక్ నుండి కోలుకొని, వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న యువహీరో నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘కళ్యాణ వైభోగమే’. పెళ్ళైన కొత్తలో భార్య, భర్తల నడుమ జరిగే ఎమోషనల్ జర్నీని చెప్పిన కథగా వచ్చిన సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ :

గేమ్ డిజైనర్ శౌర్య (నాగ శౌర్య)కి మొదట్నుంచీ పెళ్ళంటే ఏమాత్రం ఆసక్తి ఉండదు. పెళ్ళి అనే బంధంలో చిక్కుకోవద్దనే సిద్ధాంతాన్ని పెట్టుకొని బతుకుతూంటాడు. ఇక ఇలాంటి ఆలోచనలనే నింపుకున్న దివ్య (మాళవిక నాయర్) కూడా పెళ్ళి అనే బంధంలో పడేందుకు ఒప్పుకోదు. విచిత్రంగా వీరిద్దరికి ఇరు కుటుంబాలూ పెళ్ళి ఫిక్స్ చేస్తాయి. ఈ పరిస్థితుల్లో పెళ్ళి అంటేనే ఇష్టం లేని వీరిద్దరూ ఏం చేశారు? పెళ్ళిని తప్పించుకోవడానికి ఏం ప్లాన్ చేశారు? తర్వాత వీరిద్దరి ప్రయాణం ఎటువైపు దారితీసింది? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

సింపుల్ గా చెప్పాలంటే పెళ్లంటే ఇష్టం లేని గేమ్ డిజైనర్ శౌర్య (నాగశౌర్య) … దివ్య (మాళవికా నాయర్) . కానీ వీళ్ల తల్లి తండ్రులు మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూండటంతో..దాంతో వీళ్లద్దరూ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. పెళ్లి అనే తంతుని డ్రామాగా ఆడటం మొదలెడతారు. ఆ డ్రామా ఏ మలుపు తిరిగింది. ఎలాంటి పరిణాలకు దారి తీసింది. వీళ్లద్దరూ చివరకు ఎలా ఒకటయ్యారు. ఇంతకీ పెళ్లి అంటే చివరకు వీళ్లిద్దరూ ఆసక్తి పెంచుకున్నారా వంటి విషయాలతో కూడిన సినిమా ఇది. ఈ సినిమా చూస్తూంటే ఎన్నో సినిమాలు గుర్తుకు వచ్చినా, తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోయినా దర్శకురాలు మాత్రం తన మ్యాజిక్ తో కొన్ని ఎపిసోడ్స్ హైలెట్ చేసి నిలబెట్టింది. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫ్యామిలీ ఎమోషన్‌ను అద్భుతంగా తెరకెక్కించిన విధానం గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఒక తెలిసిన కథనే బాగా చెప్పినా, ఎక్కువ నిడివి ఉండడం ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాలు చాలా లెంగ్తీగా ఉన్నట్లు అనిపిస్తాయి.

నాగశౌర్య తనకి సూటయ్యే పాత్రలో ఎంచక్కా ఒదిగిపోయాడు. చాలా ఈజ్‌తో పాత్రకి పరిపూర్ణ న్యాయం చేసాడు. యావరేజ్‌ ఇండియన్‌ గాళ్‌గా మాళవిక అతికినట్టు సరిపోయింది. ఆమె లుక్స్‌పై పాపం చాలానే జోక్స్‌ వేసారు. లుక్స్‌ పరంగా యావరేజ్‌ అయినా కానీ నటిగా ఆమెకి వంక పెట్టలేం. ఎంతటి భావాన్ని అయినా ఆమె కళ్లు ఇట్టే పలికించగలవు. డైరెక్టర్‌కి ఆ సంగతి బాగా తెలుసు కనుకే కీలక సన్నివేశాల్లో ఆమెకి సంభాషణలు లేకుండా కేవలం కళ్లల్లోనే ఫీలింగ్స్‌ క్యాప్చర్‌ చేసారు. ‘అలా మొదలైంది’ తరహాలో తాగుబోతు రమేష్ పాత్రను క్లైమాక్స్‌ కన్ఫ్యూజన్‌కు వాడుకోవడం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకురాలు నందిని రెడ్డి గురించి చెప్పుకోవాలి. ఇలాంటి కథలు తెలుగుకు కొత్తేమీ కాదు… కాకపోతే ట్రీట్ మెంట్ తేడా. కొంచెం అటూ ఇటూలో కామెడీ డోస్ కాస్త పెంచి హిట్ కొట్టాలనే ఆలోచన చేసింది నందినీ రెడ్డి…అదే దీని స్పెషాలిటీ. ఫస్టాఫ్ ఫ్రేమ్ నిండా జనాలు, పెళ్లి హడావిడితో గడిచిపోతే సెకండాఫ్ ..ఫన్ తో నడిచి, క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో ముగింపుకొచ్చింది. సినిమాలో ఎక్కువ ట్రై చేసింది ఫన్ కాబట్టి అదే సినిమాని నిలబెట్టే అంశం కావాలి.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ జి.వీ.ఎస్. రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమ్ ని చాల అధ్బుతంగా చూపించాడు. ఈ సినిమా కి మరో ప్లస్ పాయింట్ కళ్యాణ్ కోడూరి. ఆయన స్వరాలూ సమకూర్చిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. లక్ష్మి భూపాల్ డైలాగ్స్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • కామెడీ
  • స్క్రీన్ ప్లే
  • క్లీన్ మువీ
  • మాళవిక నాయర్, నాగశౌర్యల పెర్ఫార్మన్స్

మైన‌స్పాయింట్స్:

  • రోటీన్ స్టోరీ
  • ఫ‌స్టాఫ్
  • క్లైమాక్స్

అలజడి రేటింగ్: 2.75/5

                                             పంచ్ లైన్: కళ్యాణంలో కొంచం వినోదం కొంచెం వైభోగం…!

(Visited 621 times, 25 visits today)