ఇది చీకటి రాజ్యం.

తమిళంలో తూంగవనమ్‌గా తెలుగులో చీకటి రాజ్యం గా వస్తున్న కమల్ హసన్ కొత్త సినిమా ట్రైలర్  రిలీజ్ అయింది. కమల్ విలక్షణ శైలికి అనుగుణంగా అద్భతంగా ఉందీ చీకటి రాజ్యం ట్రైలర్. సస్పెన్స్‌తో కూడిన ఓ థ్రిల్లర్‌లా చీకటి రాజ్యం ఉండనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతోంది. ట్రైలర్‌లో యాక్షన్, పోరాట సన్నివేశాలతో కూడిన సస్పెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.
తమిళంలో తూంగవనమ్‌గా వస్తున్న చీకటి రాజ్యం లో కమల్ హాసన్ అద్భుత హావభావాలు పలికించారు. ఇందులో కమల్ తో పాటు ప్రకాశ్ రాజ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ పర్ ఫెక్ట్ సంగీతం అందించాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించగా, రాజేష్ ఎమ్ సెల్వా దర్శకత్వం వహించారు.
(Visited 22 times, 7 visits today)

Comments

comments

Comments