EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Reviews / కనుపాప రివ్యూ & రేటింగ్

కనుపాప రివ్యూ & రేటింగ్

kanupapa movie review and rating

Alajadi Rating

2.75/5

Cast: మోహన్‌లాల్‌, బేబీ మీనాక్షి, అను శ్రీ సముద్రఖని, విమలారామన్‌, నడిమూడి వేణు

Directed by: ప్రియదర్శన్‌

Produced by: మోహన్‌లాల్‌

Banner: ఓవర్సీస్‌ నెట్‌వర్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Music Composed by: రోన్‌ ఎంథెన్‌ యెహన్‌, 4 మ్యూజిక్స్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే, పోయిన సంవత్సరం మోహన్ లాల్, జూనియర్ NTR తో కలిసి నటించిన జనతా గ్యారేజ్ ఎంతా పెద్ద విజయం నమోదు చేసుకుందో కొత్తగా చెప్పులోవాల్సిన అవసరంలేదు. అదే ఊపుతో మోహన్ లాల్ నటించిన మన్యం పులి సినిమా తెలుగులో విడుదలై మంచి కలెక్షన్లు సాధించింది. ఇక ఈ సంవత్సరం మలయాళంలో మోహన్ లాల్ ప్రయోగాత్మకంగా నటించిన ఒప్పమ్ సినిమా “కనుపాప” పేరుతో తెలుగులో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చదవండి.

కథ:

ఒక అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేసే  రాము (మోహన్ లాల్) గుడ్డివాడే కాని చాలా తెలివికలవాడు. రెటైర్డ్ జడ్జ్ అయిన క్రిష్ణమూర్తి (వేణు) కి నమ్మిన బంటులాగా ఉంటాడు రాము.  చేయని నేరానికి 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వాసుదేవ్ (సముద్రఖని) ప్రతీకారంతో క్రిష్ణమూర్తిని చంపుతాడు. అంతే కాకుండా రాముని, క్రిష్ణమూర్తి కుమార్తె నందిని (బేబీ మీనాక్షి) ని కూడా చంపాలనుకుంటాడు. అసలు వాసుదేవ్ ఎందుకు జైలుకు వెళ్ళాడు? వీరందరిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? గుడ్డివాడైనా రాము, వాసుదేవ్ ని ఏలా ఎదురుకొన్నాడు అనేది మిగిలిన కధ.

అలజడి విశ్లేషణ:

హీరో అంధుడిగా నటించిన సినిమాలు చాలా వచ్చాయి మొన్ననే హృతిక్ రోషన్ నటించిన కాబిల్ (బలం) సినిమాలో కూడా హీరో అంధుడే. కళ్ళు లేకపోయిన బుద్దిబలంతో విలన్ ఆటకట్టించే కధ ఇది. నిదానంగా సాగే మొదటి భాగంలో అసలు కధ చెప్పకుండా అన్ని పాత్రలను పరిచయం చేస్తున్నట్లుగా ఉంటుంది. మొదటి అర్ధ భాగంలోని పాటలు కూడా వినోదానికి బదులు సినిమా గమనాన్ని అడ్డుకున్నట్లుగా ఉన్నాయి. స్లోగా సాగుతున్న కధలో ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా అసలు రూపం బయటపడుతుంది. రెండవ అర్ధ భాగంలోనే సినిమా ఊపందుకుంటుంది.  తెలివైన హీరో, విలన్ల మధ్య జరిగే ఎత్తుకు పైఎత్తు సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకొని ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి. రెండవ అర్ధ భాగంలోనే సన్నివేషాలు థ్రిల్లింగ్గా ఉండడమే కాకుండా క్లైమాక్స్లో వచ్చే మరో ట్విస్ట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

నటీనటుల పనితీరు:

మోహన్‌లాల్‌: ఈ సినిమాకు ప్రధాన బలం మోహన్ లాల్‌ అనే చెప్పుకోవాలి. ఆయన తప్ప మరెవరూ ఈ పాత్ర చేయలేరేమో అనేంత అద్భుతంగా, చాలా తెలివిగా నటించారు. సినిమా ఆసాంతం అంధుడిగా నటించడం, అందులోను.. ఏ సన్నివేశంలోనూ తప్పులు వెతకనీకుండా చేయడంలో మోహన్‌లాల్ అనితర సాధ్యమైన ప్రతిభ కనపరిచాడు. 

సముద్రఖని: దర్శకుడిగా మంచి పేరున్న సముద్రఖని అప్పుడప్పుడూ ఇలాంటి కీలకమైన పాత్రలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఆయన మరోసారి… తనదైన స్థాయి నటన ఈ చిత్రంలో చూపించారు. మాట్లాడే సంభాషణలు తక్కువ ఉన్నప్పటికీ, కేవలం కళ్లతో, హావభావాలతో భయం పుట్టించారు.

బేబీ మీనాక్షి: తన పాత్ర పరిధి మేర నటనతో ఒకే అనిపించింది.

మిగిలిన నటీనటులు చిన్న చిన్న పాత్రలలో కనిపించారు.

ప్లస్ పాయింట్స్:

  • మోహన్‌లాల్‌ నటన
  • కథ, కథనం
  • సెకండాఫ్‌

మైనస్ పాయింట్స్:

  • నెమ్మదించిన ప్రధమార్ధం
  • సాగదీసిన క్లైమాక్స్
  • ఇరికించినట్లు ఉన్న పాటలు

పంచ్ లైన్: ఈ సినిమాకి మోహన్ లాల్ యే కనుపాప..!

Comments

comments