EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / General / వీడు ఆల్మోస్ట్ ఏడడుగుల బుల్లెట్టు. 8 ఏళ్లకే 6.6 అడుగుల ఎత్తు.

వీడు ఆల్మోస్ట్ ఏడడుగుల బుల్లెట్టు. 8 ఏళ్లకే 6.6 అడుగుల ఎత్తు.

Author:

వామ్మో.. ఏం ఎత్తురా బాబు.. తల పైకెత్తి చూస్తే… కానీ, అతన్ని పూర్తిగా చూడలేం. బాహుబలిలా ఉండే అతని పేరు కరణ్ సింగ్. వయస్సు జస్ట్ 8 ఏళ్లు మాత్రమే కానీ, ఎత్తు 6 అడుగులా 6 అంగుళాలు. ఇప్పటికే చిన్న వయస్సులో ప్రపంచంలోనే అత్యంత పొడుగైన అబ్బాయిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. అంతెందుకు పుట్టడం పుట్టడమే 2 అడుగుల ఎత్తు, మాంచి బరువుతో పుట్టి అప్పుడే గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసాడట కరణ్ సింగ్. తల్లి స్వెత్లానా కూడా 7 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో దేశం లోనే అత్యంత పొడుగయినా మహిళగా రికార్డు నెలకొలిపింది. అంతేకాదు, తల్లి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా… ఇక తండ్రి సంజయ్ కూడా మంచి పొడగరే అయినప్పటికీ, కొడుకు అసాధారణ ఎత్తుతో పోలిస్తే మాత్రం.. తండ్రీ కొడుకులు ఒకే ఎత్తుతో ఉంటారు. అంటే, 8 ఏళ్లకే మనోడు తండ్రి అంత ఎదిగిపోయాడన్నమాట.

మీరట్ కి చెందిన ఈ ఫ్యామిలీ అందర్లానే ఏ ఇబ్బంది లేకుండా సాధారణ జీవితమే గడుపుతున్నప్పటికీ, దుస్తులు, చెప్పులు కొనుక్కోవాలంటే మాత్రం అదో పెద్ద సమస్య. తమ ఎత్తు, సైజుకు తగ్గట్టుగా బట్టలు, చెప్పులు, షూలు దొరక్క చాలా ఇబ్బంది పడాల్సివస్తుందట. కరణ్ షూ సైజు 12 అంటే ఊహించుకోండి మనోడి ఎత్తు ఎలా ఉంటుందో. ఇప్పటికే వల్డ్ బాక్సర్ వ్లాదిమీర్ క్లిష్కో తో భుజం భుజం రాసుకునే అంత ఎత్తుకు పెరిగాడు. 3 ఏళ్లకే 10 ఏళ్ల వయసు కుర్రాళ్ళ సైజు బట్టలు వేసుకోవాల్సి వచ్చేదట.

world tallest boy

కరణ్ అందరిలాగే సాధారణ ఆహారమే తీసుకుంటాడు. కాకపొతే, ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారం కూడా తీస్కుంటాడు. కానీ, అతని ఎత్తుకి ఆహారం కన్నా, తమ ఒంట్లో ఉండే హార్మోన్లె కారణం కావచ్చు అంటున్నాడు తండ్రి సంజయ్. కరణ్ కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అయితే క్రమం తప్పకుండా ఎండోక్రైనాలజిస్ట్ ని సంప్రదిస్తామని చెప్పాడు.

బాస్కెట్ బాల్ ఆడడాన్ని బాగా ఇష్టపడే కరణ్, ఎప్పటికైనా దేశం తరపున బాస్కెట్ బాల్ ఆడుతానని, దానికోసం రోజూ అమ్మతో ప్రాక్టీస్ కూడా చేస్తానని చెప్పాడు. అంతేకాదు అమ్మా, నాన్నలకన్నా ఎత్తు పెరిగి వాళ్ళు తల ఎత్తుకోనేలా చేస్తా అంటున్నాడు ఈ అత్యంత పొడుగైన అబ్బాయి.

ఇప్పటికే రెండు సార్లు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కినా కరణ్, పెరిగి పెద్దయ్యాక మళ్ళీ ఇంకో రికార్డు నెలకొల్పుతాడని తల్లి ఆశగా ఆనందంగా చెబుతోంది. అంతేకాదు, పులి కడుపునా పులే పుడుతుంది.. మరి నా కడుపున నా కన్నా ఎత్తున్న కొడుకే పుట్టాడని నవ్వుతూ జవాబిచ్చింది. ఏమో.. ఈ అబ్బాయి ఎత్తు పెరగడం చూస్తుంటే ముందు ముందు మరిన్ని రికార్డులు ఖాయంగా కనబడుతున్నాయి.

Comments

comments