EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

మన ఎమ్మెల్యేలు, నాయకులూ ఈయనని చూసి నేర్చుకోవలసిందే..!

Author:

ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏదేని కార్పొరేషన్ ఛైర్మెన్లు, జడ్జిలు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏదైనా కార్యక్రమం కోసం లేదా పనికి వెళ్తున్నప్పుడు వారి మార్గంలో జీరో ట్రాఫిక్ ఉండేలా ఆదేశాలు ఇస్తారు, వారికున్న వీవీఐపీ హోదాతో చిన్న చిన్న వాటికి కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ప్రవర్తిస్తారు, కేంద్ర ప్రభుత్వం బుగ్గ కార్ల వ్యవస్థని రద్దు చేసి నాయకులూ, ఉన్నతాధికారులు వీవీఐపీ కల్చర్ ని వదులుకోవాలని చెప్పిన కూడా కాన్వాయ్ లో పదుల సంఖ్యలో వాహనాలు, సైరన్ సౌండ్ , జీరో ట్రాఫిక్ కల్చర్ ఇంకా కొనసాగుతూనే ఉంది, ముఖ్యమంత్రులు, డీజీపీ, గవర్నర్ లు అంటే ప్రజా వ్యవస్థలో కీలకమైన వాళ్ళు కాబట్టి ఆ కల్చర్ తప్పదు, కానీ ఈ మధ్య చిన్న చిన్న పదవులు చేపట్టిన వాళ్ళు కూడా వారి లెవెల్ ని చూపించుకోవాలనే మనస్త్వతంతో వీవీఐపీ కల్చర్ లో బతుకుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ముఖ్యంగా వారి వాహనాలు రోడ్ మీదకు వచ్చిన ట్రాఫిక్ ఆపేయటం వాళ్ళ సామాన్య ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, కొన్ని సార్లు వారి కోసం ప్రాణాలని నిలిపే అంబులెన్స్ లని కూడా ఆపేస్తున్నారు, దీనిని మించిన మూర్ఖత్వం ఉండదు, కానీ కర్ణాటక రాష్ట్రంలో ఒక మంత్రి ప్రవర్తించిన తీరుని ప్రజలంతా ప్రశంసిస్తున్నారు.

కర్ణాటక

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రాతినిధ్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే ఒక సాధారణ ప్రజా నాయకుడు రామలింగరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రామలింగారెడ్డి కొంతకాలం క్రితం కర్ణాటక హోమ్ మంత్రిగా పదవిని చేపట్టారు, పదవి చేపట్టిన తరువాత నాకు గన్ మెన్.. ప్రత్యేక భద్రత లాంటివి అవసరం లేదు, జీరో ట్రాఫిక్ ఆదేశాలు, ప్రత్యేక కాన్వాయ్ లాంటివి అస్సలు వద్దు అని ప్రకటించాడు, తన వాహనానికి అదనంగా మరొక వాహనం ఇస్తే చాలు అని ప్రకటించాడు.

ముఖ్యమంత్రి తరువాత స్థానం అయిన హోమ్ మంత్రి పదవిలో ఉంది తనకు ఎటువంటి సౌకర్యాలు అవసరం లేదు అని ప్రకటించడం చాలా గొప్ప విషయం, తను చెప్పినవన్నీ భద్రత పరంగా సాధ్యం కాకపోవచ్చు కానీ అంత పెద్ద స్థానంలో ఉంది కూడా ఆ వీవీఐపీ కల్చర్ ని వదులుకోవడానికి సిద్ధం అయ్యాడు అంటేనే చాలా గొప్ప విషయం, చిన్న చిన్న పదవులు చేపట్టిన వాళ్లే తమని తామే వీవీఐపీగా ఊహించుకుంటూ అధికార దర్పాన్ని వెలగబెడుతుంటారు అలాంటి వారు కర్ణాటక హోమ్ మంత్రి నుండి చాలా నేర్చుకోవాల్సి ఉంది.

(Visited 217 times, 232 visits today)

Comments

comments