EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / Reviews / కాష్మోరా సినిమా రివ్యూ & రేటింగ్.

కాష్మోరా సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

kashmora-movie-review-and-rating

తమిళం పాటు తెలుగులో సమాన మార్కెట్ ని సంపాదించుకున్న హీరో కార్తీ. అన్న సూర్యలా మంచి సినిమాలను ఎంచుకుంటూ ఎప్పటికి అప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా కాష్మోరా సినిమాను తన కెరీర్ లోనే బారి బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బాహుబలి స్థాయిలో ఉంటుందని అలాగే గ్రాఫిక్స్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రచారం జరిగింది. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఒకసారి చూద్దాం.

కథ :

తేలికగా డబ్బులు సంపాదించడానికి దెయ్యాలను వదలగొడుతా అంటూ తన దగ్గరికి వచ్చేవారిని బురిడీ కొట్టించి వారి వద్దనుండి డబ్బులు గుంజుతుంటాడు కార్తీ. అలాంటి టైంలో ఒక మంత్రికి సహాయం చేయవలసి వస్తుంది దానితో ఆ మంత్రి పూర్తిగా కార్తీని నమ్మి తన వద్ద ఉన్న డబ్బు బంగారాన్నితన దగ్గర ఉంటే సేఫ్ అని దాచిపెట్టమంటాడు. అసలే డబ్బు అంటే పిచ్చి ఉన్న కార్తీ ఆ డబ్బును తీసుకోని ఆ ఊరినుండి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతాడు. అలాంటి సమయంలో ఒక కోటాలో దెయ్యాలు ఉన్నాయి వెళ్ళగొట్టాలని ఒక వ్యక్తి వచ్చి డబ్బు ఆశ చూపడంతో సరే అని ఒప్పుకుంటాడు.  కోటాలో కార్తి ఎలా ఇరుక్కున్నాడు, ఇంతకు ఆ కోటాలో దెయ్యాలు ఉన్నాయా! ఇంతకు కోటాలో ఎవరు ఉన్నారు వారికి కార్తీకి సంబంధం ఏమిటి!అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ :

ఈ సినిమా ఫస్ట్ లుక్ కాష్మోరా స్టైల్లో విడుదల చేసే సరికి కార్తీ తమిళ్ అభిమానులు ఈ సినిమాను మరో బాహుబలి అంటూ ప్రచారం మొదలు పెట్టారు దానితో తెలుగులో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫస్టాఫ్ అంత కార్తీ, అతని కుటుంబం మొత్తం దెయ్యాలను వదులగొడుతాం అంటూ ప్రజలను చాలా ఫన్నీగా మోసం చేస్తుంటారు. ఇక వీరి కుటుంబం మొత్తం బంగ్లా లోకి వెళ్లిన తర్వాతనే అసలు కథ మొదలవుతుంది. 700 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఒక రాజ్యాన్ని ఏవిధంగా నాశనం చేసిందో చాలా బాగా చూపించాడు దర్శకుడు. రాజ్ నాయక్ అనే సైన్యాధిపతి ఎందుకు ఆత్మగా మారాడు అలాగే దాని వలన కలిగిన పరిణామాలు ఏమిటి అనేది సెకాండాఫ్ లో చూపించిన విధానం బాగుంది. ఇక 700 ఏళ్ల నాటి రాజ్యం, అప్పటి యుద్దాన్ని, చాలా బాగా చూపించారు. ఇక ఈ సినిమాలో ఒక ఆత్మా కథని, ఫాంటసీతో ముడిపెట్టిన విధానం బాగుంది. అయితే మొదటి భాగంతో పోల్చుట రెండవ భాగంలో కొద్దిగా కామెడీ తగ్గిందని చెప్పాలి.

నటీనటుల పనితీరు:

ఈ సినిమాలో ఎవరి గురించి అయినా మనం చెప్పుకోవాలి అంటే అది కార్తీ గురించే. ఇందులో రాజ్ నాయక్ గా, కాష్మోరా గా రెండు భిన్నమైన పాత్రలలో ఒదిగిపోయాడు అని చెప్పాలి. కాష్మోరాగా ఒకవైపు కామిడి పండించి మరొక వైపు రాజా నాయక్ గా అందని ఆశ్చర్యపరిచాడు. ఇక రత్నమహాదేవి పాత్రలో నాయన తార మరోసారి తన నటనతో అబ్బురపరిచింది. నయన్ ఒకవైపు అందగా కనిపిస్తూనే ధైర్య వంతురాలైన యువరాణి గా అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో పరిశోధన విద్యార్థిగా శ్రీదివ్య అలాగే వివేక్ వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

ముఖ్యంగా దర్శకుడు గురించి చెప్పాలి.. 700 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ముడిపెడుతూ రాసుకున్న కథ చాలా బాగుంది. రాజా నాయక్ పాత్రను తీర్చి దిద్దిన విధానము బాగుంది. ఇక ఈ సినిమాలో పాటలు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అలాగే బ్యాగ్రౌడ్ మ్యూజిక్ కూడా అంతగా ఎఫెక్ట్ గా అనిపించలేదు. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకి తగినట్టు లేదనే చెప్పాలి. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • కార్తీ
  • నయన తార
  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
  • విజువ‌ల్ ఎఫెక్ట్స్‌

మైన‌స్ పాయింట్స్:

  • సెకండాఫ్ లెంగ్త్
  • మ్యూజిక్
  • ఎడిటింగ్

అలజడి రేటింగ్: 3/5

పంచ్ లైన్: నవ్విస్తూనే ఆశ్చర్యపరిచే కాష్మోరా.

Comments

comments