Home / Entertainment / Video: రెచ్చగొట్టకండ్రా! అంటూ ఊర్రూతలూగించిన కాటమరాయుడు.

Video: రెచ్చగొట్టకండ్రా! అంటూ ఊర్రూతలూగించిన కాటమరాయుడు.

Author:

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అందరూ తెలుగు ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కాటమరాయుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదల చేసారు. ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిన్న హైద్రాబాద్ లో ఘనంగా జరిపారు. ఆ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేసిన కాటమరాయుడు ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ ట్రైలర్ మరోసారి ఇక్కడ చూసేయ్యండి.

ఓయ్ నన్ను రెచ్చగొట్టకండ్రా! అంటూ పవన్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ లో పవన్ డిఫరెంట్ వేరీయేషన్స్ చూపించారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, రోమాన్స్ అన్ని యాంగిల్స్ సాంపిల్ చూపించి సినిమాలో అభిమానులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయని ప్రేక్షకులకు తెలుపకనె తెలిపారు. అన్నింటికన్నా ట్రైలర్ లో పవన్ డ్యాన్సులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

(Visited 362 times, 2 visits today)