Home / Reviews / కాటమరాయుడు రివ్యూ & రేటింగ్.

కాటమరాయుడు రివ్యూ & రేటింగ్.

కాటమరాయుడు రివ్యూ రేటింగ్

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: పవన్ కళ్యాణ్,శృతి హాసన్, రావు రమేష్, అలీ, అజయ్, శివ బాలాజీ, నాజర్ తదితరులు.

Directed by: కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ)

Produced by: శరత్ మరార్

Banner: నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్

Music Composed by: అనూప్ రూబెన్స్

పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆ సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి, కాటమరాయుడు ట్రైలర్ చూసిన తరువాత అప్పటికే ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి, తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్ సినిమా మూల కథని తీసుకోని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెచ్చే విధంగా డైరెక్టర్ కిషోర్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు, భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న కాటమరాయుడు సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

కథ:

తన తమ్ముళ్ల కోసం వయసు పైబడిన కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటూ తన ప్రాంతంలో ఒక ఫ్యాక్షనిస్ట్ గా కొనసాగుతూ ఉంటాడు కాటమరాయుడు (పవన్ కళ్యాణ్), తమ అన్నయకి ఎలా అయిన పెళ్లి చేయాలనీ ప్రయత్నిస్తుంటారు నలుగురు తమ్ముళ్లు (అజయ్, కమల్, శివ బాలాజీ, కృష్ణ), అమ్మాయిలు అంటే ఇష్టం లేని తమ అన్నయ్యని హీరోయిన్ (శృతి హాసన్) ప్రేమలోకి ఎలా దించారు..? అసలు శృతి హాసన్ ఎవరు..? అలాగే విలన్ వల్ల శృతి హాసన్ కుటుంబానికి ఆపద వస్తుంది,  అసలు శృతి హాసన్ ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఏంటి..? కాటమరాయుడు విలన్ ను ఎలా ఢీ కొట్టాడు..? కాటమరాయుడు లవ్ స్టోరీ ఏమైంది అన్నది అసలు కథ.

అలజడి విశ్లేషణ:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు కొత్త కొత్త రికార్డులకు సమయం వచ్చిందనే లెక్క, గత ఏడాది సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ప్లాప్ సినిమాతో కూడా 50 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేయడం పవన్ కళ్యాణ్ కె సాధ్యమైంది, తమిళం వీరం సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే సినిమా అని చెప్పొచ్చు. సినిమాలో పవర్ స్టార్ వన్ మ్యాన్ షో చేశాడు. కెరీర్ లో మొదటిసారి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ తన సరికొత్త గెటప్ తో అదరగొట్టాడు.

సినిమా కథ మనం ఎప్పటినుండో చూస్తున్న రొటీన్ కథే అయిన తన పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, కామెడీ సీన్లు బాగా వర్క్ అవుట్ అయ్యాయి, మిర మిర మీసం సాంగ్ సినిమాకే హైలైట్ గా ఉంటుంది, పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది, ఫ్యాన్స్ కు మాత్రం సినిమా మంచి ఎంటర్టైనింగ్ ఇస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూసే చక్కని సినిమాగా కాటమరాయుడు ఉంది. కామెడీ కూడా కితకితలు పెట్టేలా చేస్తుంది. మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కాటమరాయుడుగా వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు మెచ్చే సినిమా తీశాడని చెప్పొచ్చు.

నటీనటుల పనితీరు:

పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ లుక్ సినిమాలో కొత్తగా ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు, వన్ మ్యాన్ షో తో సినిమా మొత్తాన్ని పవన్ కళ్యాణ్ యే నడిపిస్తాడు.

శృతి హాసన్ : శృతి హాసన్ చాలా గ్లామర్ గా కనిపించింది. పాత్రకు తగ్గట్టు చక్కనైనా కట్టు బొట్టుతో అమ్మడు అదరగొట్టింది.

ఇక కాటమరాయుడు తమ్ముళ్లుగా నటించిన నలుగురు తమ్ముళ్లు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఆలి కామెడీ బాగుంది. విలన్ గా నటించిన తరుణ్ అరోరా, రావు రమేష్ లు కూడా బాగానే ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

పవన్ కళ్యాణ్ ని ఫ్యాక్షనిస్ట్ గెటప్ లో సరికొత్తగా చూపించడంలో డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్దాసాని(డాలీ) సక్సెస్ అయ్యాడు, ఫ్యాన్స్ కి నచ్చే విధంగా సినిమాని పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు, కాటమరాయుడు సినిమాకి సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ రేంజ్ లో లేదు, మిర మిరా మీసం సాంగ్ తప్ప మిగతావన్ని మాములుగానే అనిపిస్తాయి, శరత్ మరార్ పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేములోను కనిపిస్తది.

ప్లస్ పాయింట్స్ :

  • పవన్ కళ్యాణ్
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ స్టోరీ
  • మ్యూజిక్

పంచ్ లైన్ : సునామి వలే వచ్చాడు మన అందరి కాటమరాయుడు…!

(Visited 3,950 times, 68 visits today)